మనసుకు హత్తుకునేలా సామజిక స్పృహ మానవతా విలువలు….ఆసక్తికరమైన కథనం..తేటతెనుగులా వుంది తల్లీ…చల్లగా వుండు……ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం (23 -07-2017)

ఫీడ్ బ్యాక్
*ఒక గొప్ప ఫీల్ వున్న సీరియల్ చదువుతున్నాం.దాదాపు నవలలు చదవడం మర్చిపోయాం.సుగాత్రి మాకు ఒక ఐకాన్ లా కనిపిస్తుంది.ప్రతీవారం సస్పెన్స్ మరోవారం కోసం ఎదురుచూసేలా చేస్తుంది…భానుప్రకాష్ (ముంబై)
*రేటింగ్స్ కోసం టీవీ ఛానెల్స్ చేసే అతిని సున్నితంగా మందలిస్తూనే మీడియా గొప్పతనాన్ని చెప్పారు…హేట్సాఫ్ శ్రీసుధామయిగారూ …లలిత(వైజాగ్).
*నమస్కారం అమ్మా….మనసుకు హత్తుకునేలా సామాజిక స్పృహ మానవతా విలువలు….ఆసక్తికరమైన కథనం..తేటతెనుగులా వుంది తల్లీ…చల్లగా వుండు…ఈ ధారావాహిక మీకు మంచి పేరుతెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను….అచ్యుత రామం (విశ్రాంత ఉపాథ్యాయులు) న్యూ ఢిల్లీ
***
జీవితం ఒక ప్రయాణం…మనం ప్రయాణించక పోయినా కాలం ప్రయాణిస్తూనే ఉంటుంది..భవిష్యత్తు వైపు….
ఓ గది నుంచి మరోగదికి, ఇంటి నుంచి ఆఫీస్ కు…ఒక ఊరు నుంచి మరో ఊరుకు రాష్ట్రాలకు దేశం కాని దేశాలకు…విదేశాలకూ …
పొట్ట చేత్తోపట్టుకుని కొందరు…విలాసాల కోసం ఇంకొందరు…నేరప్రపంచం వైపు మరికొందరు…ఎవరిదారిలో వాళ్ళు..ఎవరి అవసరంతో వాళ్ళు..ఎవరి స్వార్థంతో వాళ్ళు..ప్రయాణిస్తూనే వుంటారు..
ఈ ప్రయాణంలో లక్ష్యం వైపు ఆశయాల వైపు ప్రయాణించే వారెందరు?వారెవరు?
***
ప్రతిమ సూపర్ మార్కెట్ ముందు వెహికల్ ఆపింది సుగాత్రి….దాదాపు పదహారేళ్ళ క్రితం కూతురు పేరుతో ప్రారంభించిన సూపర్ మార్కెట్.నాణ్యత శుభ్రత రెండు కళ్ళు సూపర్ మార్కెట్ కు…తక్కువ లాభంతో నడపబడే సూపర్ మార్కెట్ అదొక్కటే సిటీలో…సూపర్ మార్కెట్ అద్దంలా ఉంటుంది.ఎక్కడ చెత్త కనిపించదు.సిగరెట్ గుట్కా లాంటివి ఆ స్టోర్ లో కనిపించవు.ప్రతీది పారదర్శకమే…కంప్యూటర్ బిల్లింగ్ …ఏ వస్తువు నాణ్యత లేకపోయినా చెత్తకుప్పలోకి వెళ్లవలిసిందే.
కుటుంబ అవసరాలకు సరిపోగా మిగిలిన లాభాలు ఎక్కడికి వెళ్తున్నాయో ఆ కుటుంబానికి కూడా తెలియదు.
ఒక్క సుగాత్రికి తప్ప
***
సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించడంతోనే అక్కడున్న స్టాఫ్ వినయం గా నమస్కరించారు.అందరినీ విష్ చేస్తూ వెళ్తోంది. ప్రతిమ సూపర్ మార్కెట్ ను నమ్ముకున్న పన్నెండు కుటుంబాలకు సుగాత్రి దేవతతో సమానం…తాను పదమూడవ కుటుంబం అని చెబుతుంది సుగాత్రి.
ఓ పక్క ప్యాకింగ్ జరుగుతుంది.ఒక్క గ్రామ్ తేడా లేకుండా ముఖ్యంగా తక్కువ లేకుండా ప్యాకింగ్ జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు ఎప్పటికప్పుడు ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు.మరొకరు నీట్ గా సర్దుతున్నారు….ఎవరి పనులు వాళ్ళు శ్రద్ద్ధగా చేస్తున్నారు.
సూపర్ మార్కెట్ లోకి రాగానే మొత్తం ఒకసారి కలియతిరుగుతుంది…సామానుల లిస్ట్ చెక్ చేసుకుంటుంది…స్టాక్ వివరాలు తెలుసుకుంటుంది.సూపర్ మార్కెట్ గురించే కాదు అందులో పనిచేసే సిబ్బంది సాధకబాధకాలు కనుక్కుంటుంది.
ఒక్కక్షణం ఆగింది…స్టాఫ్ లో ఓ వ్యక్తి కనిపించలేదు…లక్ష్మి కనిపించలేదు…రోజూ ఉషారుగా మాట్లాడుతూ సరుకుల లిస్ట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసే లక్ష్మి కనిపించలేదు…
గాయత్రి చురుకైన కళ్ళు లక్ష్మి ని వెతుకుతున్నాయి.అప్పుడే వాష్ రూమ్ నుంచి వస్తోంది…లక్ష్మి కళ్ళు ఎర్రబడి ఉండడం గమనించింది.బాగా ఏడ్చినట్టు తెలుస్తోంది.
ఎదురుగా సుగాత్రిని చూసి తడబాటును కప్పిపుచ్చుకుంటూ “గుడ్ మార్నింగ్ మేడం…”అంది లక్ష్మీ
“గుడ్ మార్నింగ్” అంటూ ముందుకు వెళ్ళిపోయింది.తన ఛాంబర్ లోకి వెళ్ళాక పదినిమిషాల తర్వాత లక్ష్మిని పిలిచింది.
“నీ వెంటపడి ఏడిపిస్తున్నదెవరు?సూటిగా అడిగింది సుగాత్రి
ఒక్కక్షణం ఆశ్చర్యంగా చూసింది.
” పెళ్ళికాలేదు..కాబట్టి నీ కన్నీళ్లకు భర్త కారణం కాదు..ఆర్థిక సమస్యలు లేవు…వయసులో వున్న అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుందంటే ఆ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తున్నారని అర్థం..వెంటపడి వేధిస్తున్నారని అర్థం…నాకూ నీ లాంటి కూతురుంది..చెప్పు లక్ష్మి “అమ్మ”లా అడుగుతున్నాను..నీ బాస్ లా కాదు…అనునయంగా అంది…
అప్పుడు ఏడుపు తన్నుకొచ్చేసింది…
“రెండురోజులుగా ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు…పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ మీద పోస్తాడట…”భయంగా చెప్పింది.
“ఇంట్లో నేను అమ్మ ఇద్దరమే ఉంటాం..మాకు మగతోడు లేరు కదా మేడం…అందుకే భయం..ఏదో మీరు దయతలచి నాకు సూపర్ మార్కెట్ లో పని ఇచ్చారు..పార్ట్ టైం చదువుకోమని ఫీజు కడుతున్నారు..పుస్తకాలూ కొనేస్తున్నారు…వాడి వల్ల డిస్ట్రబ్ అవుతున్నాను మేడం”ఇంకా ఏడుస్తూనే వుంది.
“సరే..నేను చూసుకుంటాను..పనిలోకి వెళ్ళు…రాత్రి స్టోర్ క్లోజ్ అయ్యాక…నీతో పాటు నేనూ వస్తాను .అన్నట్టు నిన్ను ఏడిపిస్తున్న వాడి పేరేమిటి? అడిగింది సుగాత్రి
“దాసు మేడం.వాడు రౌడీ షీటర్ వాడంటే అందరికీ భయం..ఎప్పుడూ యాసిడ్ బాటిల్ పట్టుకుని తిరుగుతుంటాడు”
చెప్పింది లక్ష్మి
“సరే నేను చూసుకుంటాను..అన్నట్టు మనదగ్గర టాయిలెట్ క్లీన్ చేసే యాసిడి బాటిల్స్ నాలుగు తీసిపెట్టు …అలాగే నాలుగు గ్లవుజులు కూడా….చెప్పింది సుగాత్రి.
ఎందుకో అర్థంకాకపోయినా మేడం చెప్పింది చేయడానికి ముందుకు కదిలింది లక్ష్మి..
ఒక్కక్షణం కళ్ళుమూసుకుని కళ్లుతెరిచింది.వాట్సాప్ లో ఒక మెసేజ్ టైపు చేసింది….ఏసీపీ వాట్సాప్ కు..
(గుప్పెడంత ఆకాశంలో చిరువిరామం)

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY