అనగనగా ఒక ఊరిలో ఒక బీద రైతు ఉండేవాడు.తన పేరు రత్తయ్య తనకు ఉన్న స్థలములో పంట పండించి బ్రతికేవాడు.రోజులాగే తన పొలంలో కలుపు తీసాడు.తర్వాత తను తెచ్చిన వేప చెట్టు నాటడానికి గుంత తీసాడు.
కొద్దిగ లోతుగా తీసిన వెంటనే ఒక పాత్ర కనపడుతుంది.దానిని పక్కన పెట్టి తన పని చేసుకున్నాడు.పెట్టె ఏంటో అని పరిశీంచాడు రాగి పాత్ర అని గ్రహించి అమ్మి సొమ్ము చేసుకోవాలి అని అనుకుంటాడు.
పాత్రను పక్కన పెట్టి తన చేతిలో మిగిలి ఉన్న కొన్ని విత్తనాలు అందులో వేసి తెచ్చుకున్న సద్ది తింటాడు.తర్వాత ఆ పాత్రలో చూస్తే విత్తనాలు పాత్ర నిండా అయ్యాయి.తనకు అర్థం కాక పాత్రలో ఉన్న విత్తనాలు తీసి అందులో ఒక చిన్న గడ్డి పోచను వేస్తాడు.తను చూస్తుండగానే పాత్ర గడ్డి పోచలతో నిండి పోతుంది.
అప్పుడు అర్థమౌతుంది ఇది మహిమ గల పాత్ర అని ఇంటికి తీసుకోని పోయి భద్రంగా దాచిపెడతాడు.తనకు ఏది కావాలి అంటే అది ఆ పాత్రలో వేసి తన అవసరాలను తీర్చుకునే వాడు.దిన దినం బాగా ధనవంతుడు అయ్యాడు.
అది చూసి ఓర్వలేని పక్కింటి పంకజం ఈ రత్తయ్య ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు అని కనిపెట్టడానికి కిటికీ నుండి చూస్తుంది.రత్తయ్య పాత్ర గురించి తెలుసుకొని ఆ రోజు రాత్రి పాత్రను దొంగలిస్తుంది.
పంకజం ఇంటికి వచ్చి పాత్రలో ఏదైనా ఉంది అని తన రెండు చేతలతో వెతుకుతుంది.ఆ పాత్రలో ఏమి లేదు కాని కాసేపటికి ఆమెకు అటు వైపు వంద ఇటువైపు వంద చేతులు వస్తాయి.అది గమనించిన గ్రామస్తులు తను వింతగా ఉంది అని పంకజం మన ఊరిలో ఉంటె అరిష్టము అని అంటూ తనను కొట్టి ఊరి నుండి తరిమేస్తారు.
చేసేది లేక పంకజం ఉసూరుమంటూ వెళ్ళిపోతుంది.పక్కఊరిలో తలదాచుకుందాం అనుకున్నాఎక్కడికి వెళ్లినా అదే పరిస్థితి.
జనం ఆమెను వింతగా చూస్తూ వున్నారు.ప్రతీక్షణం తాను చేసిన పనికి కుమిలిపోతూ,అత్యాశ ఎంత చేటు తెచ్చిందో అని బాధ పడుతూ కన్ను మూసింది.
నీతి:- అత్యాశకు వెళ్లి అనర్థాలు తెచ్చుకోవద్దు.
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్