స్వేచ్ఛ అంటే మనం ఆనందంగా ఉండడం .ఆ స్వేచ్ఛ పంజరంలో ఉంటుందనుకున్న చిలుక తన తప్పు తెలుసుకునేసరికి ఆలస్యమైంది.తన స్వేచ్ఛను కోల్పోయింది.లక్ష్మీవిజయ నడింపల్లి కథ “పంజరంలో చిలుక”(10 -09 -2017 )

            అనగనగా ఒక జామచెట్టు. అక్కడికి తరచూ రెండు చిలుకలు వాటి పిల్ల చిలుకతో కలిసి ఆహారం కొరకు వస్తుంటాయి. ఎప్పటిలాగే వచ్చి తిరిగి గూటికిపోతుండగా పిల్లచిలుక వెనుక రాకపోవడం గమనించిన చిలుకలు మరలా జాంచెట్టు దగ్గరకు వచ్చిచూశాయి.
ఆ పెరడుకి సమీపంలోని భవనంలో ఒక పంజరంలో మరొక చిలుక వుంది.. దానికి అప్పుడే యజమాని ఆహారం యిచ్చి తిరిగి పంజరంలో బంధించాడు.
దానినే ఆసక్తిగా తిలకిస్తున్న పిల్లచిలుక తల్లితో అంది
“అమ్మా ఆ చిలుక చూడు దాని లోకం ఎంతో అందమైనది. అది మనలాగా ఆహారంకోసం వెత్తుక్కోనవసరంలేదు.”
ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు ఆహారం తెచ్చిపెట్టే వాళ్ళున్నారు. పంజరంలోని చిలుక జీవితం ఎంత బావుంటుందో కదా?అలాంటి జీవితం ఎంతో హాయికదా…అని నేను అక్కడికి వెళ్తాను అంటూ  మారాం  చేసింది పిల్ల చిలుక.
          “వద్దు అది ఒక బానిస బ్రతుకు ,అక్కడ స్వేచ్ఛ వుండదు. ప్రతి రోజూ ఎక్కడి కంటే  అక్కడికి విహరించడానికి వుండదు. దేవుడు మనకి రెక్కలిచ్చాడు. శక్తినిచ్చాడు. మన ఆహారం  మనమే సంపాదించుకోవాలి.కష్టపడకుండా సుఖాలననుభవించడానికి హక్కులేదు. అత్యాశకి పోయి స్వేచ్ఛని కోల్పోకూడదు.” హెచ్చరించింది తల్లి చిలుక. దానిని బుజ్జగించి గూటికి చేరుకున్నాయి
పిల్లచిలుకకి ఆ గూడు నచ్చలేదు. రంగురంగుల పంజరమే బాగుందనిపించింది. 
మర్నాడు తల్లికి చెప్పకుండా పిల్ల చిలుక ఆ పంజరం దగ్గరికి వచ్చింది
పంజరంలో చిలుక పిల్ల చిలుకను చూసి ఇలా చెప్పింది “నువ్వు మీ అమ్మతో సంతోషంగా వున్నావు..స్వేచ్ఛగా వున్నావు…పొరపాటున ఈ పంజరంలోకి రాకు…ఇక్కడంతా బానిస బ్రతుకే”అంది తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.
“తన యజమాని అంటేకి భయం రోజూ సరిగా తాను పలుకలేకపోతే చిన్నపాటి కర్రతో కొడతాడు.అందరూ చిలుక పలుకులు అని సంతోషపడుతారు…తమ బాధ తెలియదు… పంజరం నుండి బయటకు తీసి తన చేతులతో బంధిస్తాడు. తను ఎగిరిపోదాం అనుకుంటుంది.  యజమాని తనరెండూ కాళ్ళు పట్టుకోవడంతో విలవిల్లాడిపోతోంది.ప్రపంచాన్ని పంజరంలో నుంచే చూడాలి”.
తన బాధంతా చెప్పినా పిల్ల చిలుకకు పంజరం బ్రతుకే హాయి అనిపించింది.
 అదంతా చూసిన పిల్లచిలుక విసుక్కుంటుంది.
ఇంతలో పంజరంలో చిలుక యజమాని అక్కడికి వచ్చాడు.పిల్ల చిలుకను పట్టుకున్నాడు.తన కోరిక తీరిపోయింది సమయంగా సంతోషపడింది ఆ పిల్ల చిలుక.ఈ లోగా పిల్ల చిలుకను వెతుక్కుంటూ వచ్చి…పిల్ల చిలుక యజమాని చేతిలో బందీ అవ్వడం చూసి పిల్ల చిలుకను కాపాడబోయి అవీ పంజరంలోకి చేరిపోయాయి…
రోజులు గడుస్తున్నా కొద్దీ పిల్ల చిలుకకు “పంజరంలో చిలుక బాధ అంటే ఏమిటో,స్వేచ్ఛ ఎంత గొప్పగా ఉంటుందో..పెద్దలమాట వినకపోతే ఏమవుతుందో “తెలిసి వచ్చింది.
ఆ పిల్ల చిలుకకు తల్లి మాటల్లోని సత్యం అర్థమైంది .అప్పటికే పంజరంలో బ్రతుకు ఎంత కష్టమో తెలిసింది…కానీ ఫలితం లేకపోయింది.
నీతి..పెద్దల మాట వినవలెను…పంజరంలో చిలుకలా కాదు..స్వేచ్ఛగా బ్రతకడంలో  వున్న ఆనందాన్ని తెలుసుకోవాలి.
                                     ***
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY