(కొన్నేళ్ల క్రితం సమస్యల శత్రువులు నా మస్తిష్కం ముందు మోహరించి నన్ను చుట్టుముట్టిన క్షణం .నన్ను గాయపరిచే ప్రతీ సంఘటన ఒక శస్త్రమై నన్ను ఒత్తిడి సైన్యంతో చుట్టుముట్టినప్పుడు..నన్ను నేను ప్రశ్నించుకుని నాలో వున్నా ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుని యుద్ధాన్ని కొనసాగించాను..ఇంకా పోరాడుతూనే వున్నాను…గెలిచేవరకూ పోరాటం…ఓటమి ఓడేవరకూ యుద్ధం..కేవలం మహిళల కోణంలో ఆత్మవిశ్వాసాన్ని ఒక చిరు అధ్యాయంగా రాయాలన్న ఆలోచనలో..అక్షరాలతో నేను…శ్రీసుధామయి)
నిఘంటువు అనే ఆకాశంలో కనిపించే ఒకేఒక నక్షత్రం నన్ను చేరి మీదగ్గరికి చేర్చమంది.తనను గుర్తించమంది.
గుర్తించినా పట్టించుకోనివారిని మరీమరీ అడిగానని చెప్పమంది.
తను లేకపోత విజయం లేదుట
తను లేకపోతే నిజమైన సంతృప్తి లేదుట..
తను లేకపోతే అసలు ఆనందమే లేదుట…
ఇంతకీ తనెవరో..తన పేరేమిటో చెప్పనే లేదు కదూ…
తను మనందరికీ బాగా తెలుసట…మనమే తనని పట్టించుకోకుండా ఉంటామట..తనను ప్రేమించినవారితో జీవితకాలం ఉంటుందిట..విజయాలను సాధించి పెడుతుందిట
మనిషి విజయానికి
మన నడవడికను
మన ఉన్నతికి కారణమైనా ఆ తను మనలోనే వుంది
తన పేరు ఆత్మవిశ్వాసం…సెల్ఫ్ కాన్ఫిడెన్స్
ఇందిరాగాంధీ శక్తియుక్తుల్లో
మదర్ థెరెసా సేవాభావంతో….
కల్పనా చావ్లా విజయంలో
సుధామయూరి ఆత్మవిశ్వాసంలో
సానియా మీర్జా సక్సెస్ లో
జె కె రౌలింగ్ పాపులార్టీలో
ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధతంత్రంలో
రాణి రుద్రమదేవి వీరత్వంలో …
ఎదుగుతూ ఒదిగిన ఆత్మవిశ్వాసాన్ని మనం మర్చిపోతున్నామా…
రోడ్డు మీదికి వచ్చిన అమ్మాయిలో పోకిరీల భయం..
ఆఫీస్ లో బాసాసురుల వేధింపుల భయం
ఇంట్లో అత్తమామల ఆరళ్ళ భయం…మొగుడి భయం
ప్రేమించినవాడు మోసం చేస్తే ఆ వెధవ తప్ప మనకు దిక్కే లేడన్న భయం…
యాసిడ్ పోస్తానంటే భయం..రోడ్డు మీదికి రావాలంటే భయం…
చస్తూ బ్రతుకుతూ చావలేక బ్రతుకుతూ…
సమస్యలకు కృంగిపోయే పిరికితనం
ఓటమికి తలవంచే బేలతనం…
ఒక్కక్షణం అలొచిస్తే..
ఆత్మవిశ్వాసాన్ని ఆలోచనల నుంచి సమస్యలపైకి దృష్టిని సారిస్తే …గెలుపు మీదే…..
మీ జీవితంలో గొప్ప మలుపు మీ ముందు మోకరిల్లదా?
నిఘంటువులో కనిపించే పదం కాదు ఆత్మవిశ్వాసం
మనల్ని గెలుపుపథం వైపు నడిపించే వెలుగురేఖల ఇంద్రధనస్సు. ఆ…త్మ….వి…శ్వా…సం
ఆత్మవిశ్వాసమంటే అందని ద్రాక్ష కాదు …మనలోనే వున్న విల్ పవర్ …
యస్ ..నేను చేయగలను చేస్తాను అనే గట్టి నమ్మకం.
ఆత్మవిశ్వాసం వున్న చోట భయానికి చోటు లేదు…సందేహాలకు తావు లేదు..ఓటమికి అవకాశం లేదు.
ఆల్ ది బెస్ట్
అక్షరాలతో ఈ ప్రయాణం కొనసాగుతుంది
గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్