(గత సంచిక తరువాయి)
కాసేపటి తరువాత తల ఎత్తి చూస్తే డ్రాయింగ్ కంపిటీషన్ లో పాల్గొన్న వారంతా నా చుట్టూ నిలబడి నేను వేసే డ్రాయింగ్ సీరియస్ గా చూస్తున్నారు.
అప్పటివరకు నాకు ఇష్టం వచ్చినట్టు నేను గీసుకుంటూ నా లోకంలో నేను ఉన్నా. అలా అందరూ నా చుట్టూ మూగడంతో ఒళ్ళు దగ్గరపెట్టుకుని జాగ్రత్తగా గీయడం స్టార్ట్ చేశాను.
కాసేపటి తరువాత బొమ్మ పూర్తి అయ్యింది. నాకు కాస్త శాటిస్ ఫాక్షన్ కలిగింది. సాయి బాబా మొహం చూడడానికి బాగానే ఉంది అనిపించింది.
ఇంతలో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టిన పెద్దావిడ వచ్చారు. నా బొమ్మ ఇంకా పూర్తి కాలేదు. ఆవిడ అలా కాసేపు చూసి సాయిబాబా ముక్కుకి బ్రౌన్ కలర్ వేయమని చెప్పారు. ఆ సలహా నాకు ఎందుకో నచ్చలేదు.
అయినా పెద్దావిడ చెపుతుంది కదా అని స్కెచ్ పెన్ తో ముక్కుకి బ్రౌన్ కలర్ వేశాను. అలా వేయడంతో బాగున్నది కాస్తా పాడైపోయింది.
ఆవిడ అలా ఎందుకు వేయమన్నదో నాకు అప్పుడు అర్థం అయ్యింది. బాలవికాస్ ఆవిడ గ్రూప్ నుండి కొంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. నా బొమ్మ బాగా రావడంతో ఆవిడకు తన గ్రూప్ లో ఎక్కడ ప్రైజ్ రాకుండా పోతుందో అన్న ఈర్ష్యతో ఇచ్చిన సలహా..
సాయిబాబా పేరు చెబుతూ. భజన్స్ చేస్తూ చిన్న పిల్లలను మంచి దారిలో నడిపించాల్సిన వారిలో ఇంత చీప్ మెంటాలిటి ఉండడం నాకు నచ్చలేదు.
మన మనసులే శుద్ధం కానప్పుడు ఇక పిల్లల మనసులు ఎలా సక్రమ మార్గంలో నడుపుతారో అన్న సందేహం ఆ రోజే మొదటిసారి కలిగింది.
నా అదృష్టం బాగుంది. నేను వేసిన బొమ్మకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను వేసిన బొమ్మ విషయం ఆంటీ వరకు వెళ్ళింది.
నా డ్రాయింగ్ బాగుండడంతో అందరూ చూసినట్టు తరువాత తెలిసింది.
ఆంటీతో పిచ్చాపాటీ మాట్లాడుతుండగా క్యాజువల్ గా ఈ టాపిక్ పైన మాట వచ్చింది.
“నీ డ్రాయింగ్ చూశాను” అన్నారు ఆంటీ.
నేనేమీ మాట్లాడలేదు
“అంతా బాగుంది కానీ ముక్కు మాత్రం ఎందుకు చెడగొట్టావు” అని అడిగారు
నా వద్ద సమాధానం లేదని ఆంటీకి కూడా తెలుసు. అసలు ఆ ముక్కుకి కలర్ ఎవరు, ఎందుకు వేయమన్నారో కూడా ఆంటీకి తెలుసని నాకు అర్థం అయ్యింది.
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్