గెలుపే గమ్యమై..పట్టుదలే గమనమై…అడుగు ముందుకేస్తే విజయమే మీ స్వంతమై…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి “అక్షరాలతో నేను” (24-12 -2017 )

గెలుపే గమ్యంగా అలుపెరుగక శ్రమించేవారే తుదకు విజేతలుగా నిలుస్తారు.. భూమి మీద ఎందరో జన్మిస్తారు కానీ వారిలో కొందరు మాత్రమే జీవిస్తారు..మరణం తర్వాత కూడా జీవించేవారు ధన్యులు…భౌతికంగా లేకపోయినా వారి యశస్సు చరిత్రలో నిలిచిపోతుంది.వారి పేరు సువర్ణాక్షర లిఖితమవుతుంది.
పరిస్థితులు పరిణామాలు ఎన్నో అవరోధాలు అడ్డంకులు సృష్టించినా అధిగమించి అద్భుతాలను సాధించవచ్చు.. లక్ష్యాలను చేరుకోవచ్చు.. అవరోధాలు అడ్డంకులు ఆటంకాలు లేని లక్ష్యం లక్ష్యమే (Target) కాబోదు.. లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని చేరలేదని బాధపడటం కంటే ఆ లక్ష్యాన్ని చేరడానికి సరిపడా ప్రయత్నం చేసామా లేదా అని విశ్లేషించుకోగలగాలి..
లక్ష్యం కోసం చిత్తశుద్దితో నిరంతరం శ్రమిస్తే ఫలితం తప్పకుండా సిద్దిస్తుంది..
అయిదేళ్ల తన తమ్ముడు గుండెకు సంబంధించిన వ్యాధితో మరణిస్తే ఆ మరణాన్ని సవాల్ గా స్వీకరించిన ఒక పేదవాడి పట్టుదల తొలి మానవ గుండె మార్పిడి శస్త్రచికిత్సకు దారితీసింది..
ఒక్క అడుగు వేనవేల అడుగులకు మార్గదర్శకం అవుతుంది.నడవడం మొదలుపెడితే నత్త అయినా ఎప్పుడో అపుడు గమ్యస్థానం చేరుకుంటుంది.
అసాధ్యంగా భావించిన అంశాన్నే లక్ష్యంగా పెట్టుకున్న క్రిస్టియన్ బెర్నార్డ్ ప్రతిరోజూ 5 కి..మీ నడిచి వెళ్లి వైద్యవిద్య అభ్యసిస్తూ 1967 లో తొలి మానవ గుండెమార్పిడిని విజయవంతం చేసాడు..చరిత్రలో నిలిచాడు…
లక్ష్యాన్ని చేధించడంలో కొన్నిసార్లు అంతిమఫలితం ఆలస్యం కావచ్చు .. కానీ ఆ ఆలస్యాన్ని పరాజయంగా భావించి ప్రయత్నాన్ని వదిలేస్తే లక్ష్యం నీరుగారిపోతుంది.. అలా కాకుండా లక్ష్యమే గమ్యంగా సాగితే లక్ష్యమే మన మజిలీ అవుతుంది!!
విజయం మీ స్వంతం అవుతుంది…ఈ కథనం అర్థవంతమవుతుంది.స్ఫూర్తికథనం అవుతుంది

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.

గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY