మేకప్ ఆర్టిస్ట్ కి యాబై రూపాయలు ఇవ్వడం చూశాను. నాపై దాదాపు వంద రూపాయలు ఖర్చు పెడుతున్నారు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (24-12-2017)

గతసంచిక తరువాయి
కాసేపటి తరువాత ప్రదీపన్న నన్ను బయట నుండి కేకేసి పిలిచాడు. ఇంత మేకప్ వేసుకుని బయట ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు.
అయినా తప్పదు… వెళ్ళాలి…
మెల్లగా బయటకు నడిచాను. అదృష్టం… బయట ఎవరూ లేరు.
అన్న బయట రిక్షా పెట్టుకుని నిలుచున్నాడు. ఎంత శ్రద్ద… ఎంత కమిట్మెంట్….
నా డ్రామాపై, నాపై ఎంత నమ్మకం లేకపోతే ఇంత ఖర్చు పెడతారు?
మేకప్ ఆర్టిస్ట్ కి యాబై రూపాయలు ఇవ్వడం చూశాను. నాపై దాదాపు వంద రూపాయలు ఖర్చు పెడుతున్నారు.
అప్పట్లో వంద అంటే చాలా పెద్ద మొత్తం. రిక్షాకే రెండు కిలోమీటర్ల దూరానికి నాలుగు రూపాయలు అవుతాయి. ఇక నాకు ఆకలి అవుతుందని మేకప్ టైంలోనే ప్రదీపన్న తినడానికి సమోసాలు పట్టుకొచ్చాడు. దానితోపాటు కూల్ డ్రింక్స్ కూడా…
నేను మెట్లు దిగి జాగ్రత్తగా కిందకి వెళ్లాను. ఆ డ్రెస్ తో నడవడం అంటే చాలా కష్టంగా ఉంది. పైగా నెత్తిన బరువుగా కిరీటం. తల అటూ ఇటూ కదపడానికి లేదు. తల అలానే కదలకుండా పెట్టడంతో మెడ నొప్పి స్టార్ట్ అయ్యింది.
ఎన్టీఆర్ మేకప్ వేసుకుని స్టూడియో వెళ్లి పొద్దున నుండి సాయంత్రం వరకు యాక్ట్ చేసి తిరిగి మేకప్ మాన్ ఇంటికి వచ్చి మేకప్ తీసేసి ఇంటికి వెళ్ళడం… అది కూడా సినిమా అయ్యేంతవరకు ఇంత కమిట్మెంట్ ఉండడం నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది.
అందుకే మరి ఆయన ఆరాధ్యుడైయ్యాడు.
మిట్ట మద్యాహ్నం కావడంతో రోడ్ పై ఎవరూ లేరు. అక్కడక్కడ ఎదురైన వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఆ పరిస్థితి నాకు చాలా కష్టంగా ఉంది. ప్రదీపన్న బండిలో నన్ను స్లోగా ఫాలో అవుతున్నాడు. అదృష్టం ఏ కుక్కో నన్ను చూసి మొరగలేదు… నా వెంట పడలేదు.
అలా నెమ్మదిగా డ్రామా జరిగే మా స్కూల్ వద్దకు వచ్చాను. మేకప్ ఆర్టిస్ట్ ఇల్లు స్కూల్ దగ్గరగా ఉండడంతో నేను తొందరగానే స్కూల్ చేరుకున్నాను.
ప్రదీపన్న రిక్షాను సరాసరి లోనికి తీసుకువెళ్ళాడు. అప్పటికి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవారు మాత్రమే స్కూల్ లో ఉన్నారు.
నేను రిక్షా దిగడంతో అందరూ వాళ్ళ పనులు మాని నన్నే చూడడం స్టార్ట్ చేశారు.
వాళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే నేను వేసే డ్రామా ఇంతకూ ముందు ఎవరూ వేసినట్టు లేరనిపించింది
చేతితో గద పట్టుకుని రిక్షా దిగి డ్రామా స్టేజి పక్కన్నే ఉన్న ఒక రూమ్ లోనికి వెళ్లాను.
నేను ఏ బాలవికాస్ సెంటరో అందరికి తెలిసి ఉండడంతో అందరూ ఆంటీని అడుగుతున్నారు. ప్రదీపన్న వారికి ఏదో చెపుతున్నాడు.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY