2017 సంవత్సరం మనకు వీడ్కోలు చెపుతూ తన స్థానంలో మనకు 2018 కానుకగా అందిస్తూ ఎన్నో అవకాశాలకు విజయాలు సాధించడానికి వీలు కల్పిస్తోంది
2017 సంవత్సరం నాకు ఎన్నో అందమైన అనుభూతులను మరెన్నో అపురూపమైన క్షణాలను నాకు మిగిల్చింది..
ముఖ్యంగా నా అక్షరాలను అందలమెక్కించింది.. మేన్ రోబో వేదికగా నా అక్షరాలు మేన్ రోబోపాఠకులకు పరిచయమయ్యాయి.. గుప్పెడంత ఆకాశంలో ఒదిగిపోయిన నా అక్షరాలు మేన్ రోబో అనే తారాపథంలో మెరిశాయి!!
నన్ను నా అక్షరాలను అక్షర సంపన్నురాలిని చేసిన మేన్ రోబో పబ్లికేషన్స్ కు మేన్ రోబో CEO గారు విజయార్కె గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు!!
ఎన్నో విజయాలతో మేన్ రోబో పబ్లికేషన్స్ కోట్లాదిమంది పాఠకులకు వీక్షకులకు చేరువ కావాలని ఆశిస్తూ..
మేన్ రోబో వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
…శ్రీసుధామయి
సగటు సామాన్య మానవుడి జీవితమైనా పేరొందిన సెలబ్రిటీల జీవితమైనా నిత్యపయనం సమస్యల మధ్యనే సాగడం అతి సాధారణమైన విషయం..
సమస్యలు చిన్నవా పెద్దవా బలీయమైనవా బలహీనమైనవా అనే ప్రశ్నలు వారివారి జీవనవిధానాన్ని బట్టి మారుతుంటాయి..కానీ సమస్య అనునది మాత్రం ఏదొక రూపంలో తప్పకుండా ఉండే ఉంటుంది.. అలాంటి సమస్యను ఎదుర్కొని పరిష్కరించడంలోనే మనమేమిటో మనకు అవగతమవుతుంది..
అసలు ఉన్న సమస్య కంటే సమస్య గురించి మనం ఊహించుకున్నదే కఠినంగా ఉంటుంది..పరిష్కారానికి ప్రయత్నించకుండా నిర్దిష్టఅంశాన్ని కొండంత ఊహించడం వలనే సమస్య ఇంకా పెద్దదవుతుంది.. ఒక అంశం సమస్యకు దారి తీసినపుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది.. ఎటొచ్చీ మనం స్పందించే తీరు లోనే మన మానసిక శక్తి ఏమిటో తెలుస్తుంది.
సమస్యను సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి పరిష్కారంతో సాగనంపితే అవి మనకు శ్రేయోభిలాషులుగా మారతాయి.. అలా కాకుండా ఈ సమస్యలను భరించడం ఎలా అనే అనవసర ఒత్తిడి మానసికాందోళనతో వాటిని ఆహ్వానిస్తే అవి మనలను అధఃపాతాళానికి తోసేస్తాయి.. సమస్యలోని తీవ్రతను మనం నిబ్బరంగా ఎదుర్కోగలిగినపుడే సమస్య అంతు మనకు దొరుకుతుంది.
ఈ రోజు ఒక సమస్య ముగియగానే సమస్యల గొడవ వదిలిపోదు.. జీవితాంతం మన నీడ మన వెన్నంటి ఉన్నట్టే సమస్యలు కూడా మనతోనే అనునిత్యం సంచరిస్తుంటాయి.. “అత్యంత పేదరికం అనే సామాజిక సమస్య లో జన్శించి పేపర్ బాయ్ గా జీవితాన్ని ప్రారంబించిన మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు సమస్యల సాధకులు గా మారి నిరంతరం శ్రమించినందుకే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు” సమస్యల సాధనలో రాటు దేలడం నేర్చుకుని సాధకులు గా మారగలిగితే విజయవంతమైన జీవితం మన సొంతం అవుతుంది.
గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్