సాయి బాబా ఆశ్రమం…పుట్టపర్తి.
ఒక చిన్న ఊరులా ఉంది. లోపల జాతర జరుగుతున్నట్టుగా ఉంది.
ఎక్కడ చూసినా తెల్లటి డ్రెస్ వేసుకున్న జనం…
శాంతి కపోతాల్లా తిరుగుతున్నారు. అక్కడ నాకు నచ్చిన విషయం ఒక్కటే.. సేవ…
ఎవరికీ తోచినట్టు వారు సేవ చేస్తున్నారు…
కొంతమంది కాంటీన్ లో సర్వింగ్… మరి కొంతమంది క్లీనింగ్…
చాలా వరకు ఎవరూ పని లేకుండా లేరు. సైలెంట్ గా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. అక్కడ ఉన్న డిసిప్లిన్ నాకు బాగా నచ్చింది.
ఆశ్రమం మొత్తం ఒక రౌండ్ వేశాను. ఆశ్రమం చాలా పెద్దది.
మొత్తం చుట్టి రావడానికి చాలా టైం పట్టింది.. అప్పటికే చీకట్లు కమ్ముకొస్తున్నాయి…
ఇంతలో నేనున్నా అంటూ ఆకలి నన్ను పలకరించింది. మా షెడ్ వెదుక్కుంటూ బయలుదేరాను. నేను బయట వచ్చే తొందరలో షెడ్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం మరిచిపోయాను. ఇక నా పరిస్థితి దారుణంగా తయారైంది.
ఒకపక్క ఆకలి మరో పక్క దారి తెలియని స్థితి. దూరం నుండి చూస్తే అన్నీ షెడ్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి.
అప్పటికీ రెండు మూడు షెడ్స్ లోకి తొంగి చూశాను… మనకు తెలిసిన మొహాలు… మా జూనియర్స్ బ్యాచ్ ఎవరూ కనపడలేదు.
ఇక పరిస్థితి అదుపు తప్పేట్టు ఉంది. ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. పైగా అక్కడ ఫుడ్ సిస్టం గురించి పెద్దగా తెలియదు.
ఇక ఏదైతే అది అయ్యిందని దగ్గరలో ఉన్న క్యాంటీన్ వైపు బయలుదేరాను. ఇంటి నుండి డబ్బు తెచ్చుకోవడం వల్ల ఎక్కడైనా ఎప్పుడైనా తినే ఆప్షన్ ఉండడంతో ముందు ఆకలి సంగతి చూసి తరువాత తీరికగా షెడ్ విషయం చూద్దామని డిసైడ్ అయ్యా..
క్యాంటీన్ వద్దకు రాగానే ఎదురుగా ఉన్న ఒక బోర్డ్ చూసి నిలుచుండిపోయాను..
అది నోటీస్ బోర్డ్ లా ఉంది.
దాని మీద చక్కగా అక్కడ దొరికే పదార్ధాలు వాటి రేట్ రాసుంది…
అప్పటికే నాకు టిఫిన్ సెక్షన్ లోని మార్కెట్ రేట్స్ బాగా తెలుసు.
ఇడ్లీ, వడ, దోసలు మొదలైనవి రేట్ ఎంత ఉందో తెలుసు.
బయట హోటల్స్ తో పోల్చుకుంటే ఆశ్రమంలో రేట్స్ చాలా తక్కువ అనిపించింది…
ముందుగా నాకు నచ్చిన ఇడ్లీ వడ ను ఆర్డర్ చేసి ఒక పక్కన కూర్చున్నాను.
అక్కడ సర్వింగ్ కి ఎవరూ కనపడలేదు. ఎంతసేపు వెయిట్ చేసినా ఎవరూ రాలేదు.
కాస్త పరీక్షగా చూస్తే అర్థం అయ్యింది. అక్కడ సెల్ఫ్ సర్వింగ్ సిస్టం.
ఎవడి ప్లేట్ వాడే తెచ్చుకోవాలి. ఎవడి ప్లేట్ వాడే కడుక్కోవాలి. ఆ ముక్క ముందే తెలుసుంటే నా ఆకలి బాధ నుండి త్వరగా విముక్తి అయ్యేవాడిని కదా అనుకుంటూ ఉసురోమని వెళ్లి అక్కడున్న లైన్ లో నిలబడ్డాను
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్