ఒకనాటి డిటెక్టివ్ ప్రపంచంలోకి తీసుకువెళ్లిన ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గారికి,ప్రచురిస్తోన్న మేన్ రోబో కు కృతజ్ఞతలు..శ్రీవాణి,ప్రమోద్ (చెన్నై)
వావ్…గ్రేట్..వెల్ కం టు సిద్దార్ధ …ధనుంజయ (వైజాగ్)
2
జేమ్స్ మెల్లిగా కళ్ళు తెరిచాడు.కొందరు ఆగంతకులు తనను లాక్కొచ్చి ఇక్కడికి తీసుకురావడం గుర్తుంది.పెనుగులాడితే ఎక్కడ ఏంచేస్తారనే భయంతో మిన్నకుండి పోయాడు.మెల్లిగా కళ్ళు తెరిచిన జేమ్స్ కు మెల్లిమెల్లిగా తననెక్కడికి తీసుకువచ్చారో అర్థమైంది. అదొక పాడుబడిన గోడౌన్…తుప్పుపట్టిన మిషనరీ వుంది.,తన చేతులు ఫ్రీగానే వున్నాయి,కానీ తన నడుముచుట్టూ తాళ్లతో కట్టేసారు.అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కలేదు.
అప్పుడే అక్కడికి నలుగురు ఆగంతకులు వచ్చారు.అందరూ లావుగా వున్నారు.ముఖాలకు మంకీ కాప్స్ వున్నాయి.
“భయ్యాస్ అసలు నన్ను ఇక్కడెందుకు తీసుకువచ్చారు? భయాన్ని నొక్కిపెట్టి అడిగాడు,.తాను భయపడుతున్నట్టు కనిపిస్తే ఇంకా భయపెడుతారని భయం
“నిన్నెందుకు తీసుకువచ్చామో నీకు నిజంగా తెలియదా?ఆ నలుగురిలో ఒకడడిగాడు
“నాకేమైనా భవిష్యత్తు కలలో కనిపిస్తుందా?అయినా “నాకెలా తెలుస్తుంది? .
“ఓకే ఇందాక నువ్వు నీ క్యాబ్ లో తీసుకువచ్చావు కదా?అతనెవరు? ఆ నలుగురిలో మరొకడడిగాడు
“ప్యాసింజర్..ప్రయాణీకుడు ” చెప్పాడు జేమ్స్
“అతను నీకేం చెప్పాడు..అదే నీతో ఏమ్మాట్లాడాడు?
“గప్ చుప్ అదే పానీపూరి గురించి “చెప్పాడు జేమ్స్
అంతే జేమ్స్ చెంప చెళ్లుమనిపించాడు ఇందాకటి వ్యక్తి
“బేవకూఫ్..నీకళ్ళకు మేమెలా కనిపిస్తున్నాం?కోపంగా అన్నాడా వ్యక్తి
“భేవకూప్స్ లానే కనిపిస్తున్నారా “అనాలనుకుని అంటే మళ్ళీ చెంప చెళ్లుమనిపిస్తారని డౌటొచ్చి ఆ ప్రయత్నమ్ విరమించుకుని “చెంప రుద్దుకుంటూ”పానీపూరి గురించి అతడడిగితే నన్నెందుకు కొడతారు? వెళ్లి ఆయన్ని కొట్టండీ…”ఉక్రొషంగా అన్నాడు.
“నిన్ను కొట్టిందికి అందుక్కాదు”ఆ నలుగురు ఒకేసారి అన్నారు.
“మరి టైం పాస్ కోసం కొట్టారా?కోపంగా అడిగాడు జేమ్స్
“నేను చెబుతాను భయ్యా”అని వినిపించింది.ఆ నలుగురితో పాటు జేమ్స్ కూడా ఆ మాటలు వినిపించిన వైపు చూసారు.
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకు)
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్