ఎంతప్రేమ వున్నా చనిపోయినవాళ్లు కనిపిస్తే ప్రేమ స్థానములో భయం చోటు చేసుకుంటుందా?…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (03-06-2018)

                                           (11)
ఏ క్షణమైనా అక్కడ ఆ గదిలో సునామీ వస్తుందా అన్నట్టు భయంతో వణికిపోతున్నారు మిస్టర్ డి అనుచరులు.
అందరివైపూ చూసాడు మిస్టర్  డి…
“మనలోనే ఎవరో ఒకరు ఇన్ఫార్మర్ వున్నాడు..ఇది నా అనుమానం కాదు  ..కన్ఫర్మ్ …ఆ ఇన్ఫార్మర్ ఎవరో బయటకు వస్తే సింపుల్ గా ఒకేఒక బులెట్ తో చంపేస్తాను..లేదంటే..ఆ ఇన్ఫార్మర్ ఎవరో నేను కనిపెడితే “అప్పుడు వాడిని మాములుగా చంపను…చిత్రవధ చేసి చంపుతాను ” అందరివైపు చూసి అన్నాడు
అక్కడున్నది ఏడుగురు..అందరిలోనూ భయమే..తమలో ఆ ఇన్ఫార్మర్ ఎవరు..అందులో ఆరుగురు  మాత్రమే  మిస్టర్ డి మనుష్యులు..మరి ఏడవవాడు ఎవడు ?
“చెప్పండి..మర్యాదగా వాడెవడో బయటకురావాలి ” మిస్టర్ డి హెచ్చరిస్తున్నట్టు అన్నాడు..
తనకు పక్క సమాచారం వచ్చింది.తన ఆక్టివిటీస్ బయిటకు తెలుస్తున్నాయి.ముఖ్యంగా సిద్దార్థ హైద్రాబాద్ రావడానికి ఆ ఇన్ఫార్మర్ కారణమైన వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది.
తనను మోసం చేసినవాడిని వదిలి పెట్టకూడదు..ఆ ఇన్ఫార్మర్ కు తను వేసే శిక్ష చూసి మిగితావాళ్ళు భయపడిపోవాలి.
అదే సమయంలో ..
డేవిడ్ ఇంటి ముందు జేమ్స్ పూలకుండీ కింద వున్న కీస్ తీసుకున్నాడు.జేమ్స్ వెన్నులో వణుకు.
కీస్  ఎక్కడున్నాయో డేవిడ్ చూపించాడు..కాదు కాదు డేవిడ్ ఆత్మ చూపించింది. ..ఇది ఇదెలా సాధ్యం?
తను  ఇంత టెన్షన్ పడుతుంటే డిటెక్టివ్ సిద్దార్థ  మాత్రం కూల్ గా వున్నాడు.
జేమ్స్ కీస్ సిద్దార్థకు ఇచ్చాడు.సిద్దార్థ కీస్ వంక చూసి లాక్ ఓపెన్ చేసాడు.
ఇల్లు దుమ్ము కొట్టుకు పోయింది.
ఒక్కారిగా జేమ్స్ లో భయం బాధ తన్నుకు వచ్చాయి.
ఈ ఇంట్లికి తాను ఎన్నో సార్లు  వచ్చాడు.ఇక్కడే సోఫాలో కూచోని డేవిడ్ తో కబుర్లు చెప్పాడు.
అదే డేవిడ్ ఇపుడు చనిపోయాక కనిపిస్తే బయపడి పోతున్నాడు.ఎంతప్రేమ వున్నా చనిపోయినవాళ్లు కనిపిస్తే  ప్రేమ స్థానములో భయం చోటు చేసుకుంటుందా?
                                                   ***
సుగాత్రి సిద్దార్థ ఫోన్ కోసం ఎదురుచూస్తుంది…పోలీసులు మఫ్టీలో మిస్టర్ డి ఇంటి ముందు వున్నారు.వాళ్లంతా ప్రత్యేక తర్ఫీదు పొందినవాళ్లు.మిస్టర్ డి ఆపరేషన్ ను ప్రారంభించింది సిద్ధార్థే.
ఈ మిషన్ లో   సిద్దార్థకు  సహకరించాలని తనకు ముందే సమాచారం వుంది.మిస్టర్  డి హైద్రబాద్ లో స్టూడెంట్స్ ను  యూత్ ను టార్గెట్ గా చేసుకుని వాళ్ళను డ్రగ్ ఎడిక్ట్స్ గా  మారుస్తున్నాడన్న  పక్కాసమాచారం వుంది.
హైద్రాబాద్ లో ఎంతో ఇష్టంగా తినే పానీపూరీలో డ్రగ్స్ ..?
ఐస్ క్రీం లో కూడా డ్రగ్స్  ను మిక్స్ చేసే తెలివితేటల క్రిమినల్స్ పెరిగిపోయారు.
చాప క్రింద నీరులా ప్రవహించే డ్రగ్  దందాను ..మిస్టర్ డి  మాఫియా సామ్రాజ్యాన్ని కూకటివ్రేళ్ళతో పెకిలించాలంటే సిద్దార్థ వల్లే సాధ్యం.
అందుకే సిద్దార్థ చెప్పినట్టే  చేస్తూ వచ్చింది.
ఇప్పుడు కూడా ఆ పనిలోనే ఉంది.మిస్టర్  డి కు కుడిభుజం..కరుడుకట్టిన నేరస్థుడు  ..కరీం కు సిద్దార్థ స్పాట్ పెట్టాడు.
                                                                     ***
మిస్టర్ డి తన చేతి వాచీ వంక చూసుకున్నాడు.సెకను ముల్లు తిరుగుతూనే.వుంది…అతను ఇంత కోపంగా ఎప్పుడూ లేడు.
తన దగ్గర నమ్మకంగా పనిచేసే వాళ్లలో సిద్దార్థ ఇన్ఫార్మర్ వున్నాడని  రూఢీగా తెలిసింది.తనకు నమ్మకద్రోహం చేసినవాడిని వదిలిపెట్టకూడదు..అనుకున్నాడు.
అదే సమయంలో కరీం కూడా అలానే అనుకున్నాడు..మిస్టర్ డి కి నమ్మకద్రోహం చేసిన వాళ్లలో ఈ ఆరుగురిలో ఎవరు…
                                                     ***
నేలంతా దుమ్ము కొట్టుకుపోయి వుంది..లోపలికి అడుగుపెట్టి అన్నాడు కాస్త భయపడుతోనే జేమ్స్
“మనకు జేమ్స్ సీక్రెట్ గా దాచిపెట్టిన  సాక్ష్యం కావాలి.అది ఓ పెన్ డ్రైవ్ లో ఉన్నట్టు సమాచారం “అన్నాడు సిద్దార్థ
“ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో ఎలా కనిపెట్టడం?  జేమ్స్ అన్నాడు
డిటెక్టివ్ సిద్దార్థ జేమ్స్ వైపు చూసి చెప్పాడు చిరునవ్వుతో “చనిపోయిన మీ ఫ్రెండ్ డేవిడ్ ను అడుగు”
జేమ్స్ ఉలిక్కిపడ్డడు..డేవిడ్ ను తను అడగడమే? సిద్దార్థ జోక్ చేస్తున్నాడా?
“అడుగు భయ్యా  ..నువ్వడిగితే తప్పకండా చెబుతాడు…”నింపాదిగా అన్నాడు సిద్దార్థ
జేమ్స్ కళ్ళు మూసుకున్నాడు..
అడుగుతున్నావా?అడుగు …”అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ
మనసులోనే డేవిడ్ ను అడిగిన ఫీలింగ్ వచ్చింది.కళ్ళు తెరిచి  చూసి షాకయ్యాడు..
డేవిడ్ నడుస్తున్నాడు..అతని అడుగుజాడలు దుమ్ము  మీద ముద్రలుగా పడుతున్నాయి.
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్) 
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

 

NO COMMENTS

LEAVE A REPLY