అక్కడ డిస్కషన్ లో నాకు అర్థం అయ్యింది ఏమంటే ప్రతి బాల వికాస్ గ్రూప్ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం చేస్తున్నారు. కోలాటం, చెక్క భజన, నాట్యం, కీర్తనం (పాటలు పాడుతూ నడవడం) లాంటి ప్రోగ్రామ్స్.
రిపబ్లిక్ డే రోజున సైనిక కవాతులో నిలబడే వివిధ దళాలలా ఒక్కో గ్రూప్ కాస్త దూరంలో నిలబడి ఉన్నాయి. ఆయా గ్రూప్స్ కి సంబంధించి హెడ్స్ ఆ గ్రూప్స్ ముందు నిలబడి ఉన్నారు.
అందరూ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు ఉన్నారు. గ్రూప్స్ లో ఉన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడడం ప్రత్యక్షంగా చూస్తున్నాను.
ఇంతకూ మా గ్రూప్ ఎక్కడో చూద్దామని వెదకడం స్టార్ట్ చేశాను. ఇంతలోనే ఆశ్రమం ముందు సందడి మొదలైంది. అందరి చూపులు ఆ వైపు తిరిగాయి.. మా చూపులు కూడా ఆటోమేటిక్ గా ఆ వైపు తిరిగాయి…
దూరంగా… వంది మాగధులు వెంట నడుస్తుండగా శిష్యకోటి కీర్తనలు పాడుతుండగా దవళ వర్ణం (వైట్ డ్రెస్) వేషధారణలో నెమ్మదిగా నడుస్తూ వస్తున్నాడు సాయిబాబా.
ప్రతి రోజు కాషాయం ధరించే సాయిబాబా ఈ రోజు ఎందుకో ప్రత్యేకంగా వైట్ డ్రెస్ లో ఉన్నాడు. సిల్క్ డ్రెస్ లా ఉన్నట్టు ఉంది. ధగధగ మెరిసిపోతోంది.
ఆ డ్రెస్ పై ఎండ పడడంతో మిలమిల మెరిసిపోతోంది. ఆ చమక్కులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సర్వసంగ పరిత్యాగులైన బాబాలకు సిల్క్ డ్రెస్, చమక్కులు మిలమిలలు ఎందుకో అర్థం కాలేదు. అయినా ఇంత మంది పడిపడి మొక్కుతుంటే మనకు పోయింది ఏమి లేదులే అనుకుంటూ అక్కడే నిలుచున్నాను.
సాయిబాబా కనపడడంతో నా చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా సాయిరాం అంటూ సాయిబాబా వైపు పరుగెత్తుకు వెళ్ళారు.
దేవుడు ఎదురైనట్టు వంగి వంగి దండాలు పెడుతూ పడి లేచి పరుగులు పెడుతున్నారు.
సాయిబాబా తన రూమ్ (నివాసం అనే పెద్ద బంగాళా) నుండి బయటకు రాగానే అక్కడ ఉన్న వారిని పలకరించడం మొదలు పెట్టాడు. ఆ గ్యాంగ్ ను పరీక్షగా చూస్తే బాగా ఉన్న వాళ్ళే అనిపించింది. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంటే వాళ్ళు భక్తి ఎక్కువైనట్టు మరీ వంగిపోయి నిలుచున్నారు.
సన్యాసులకు బాబాలకు అందరూ సమానమే అని విన్నట్టు గుర్తు. అటువంటప్పుడు బాగా డబ్బున్న వారితోనే మాట్లాడ్డంలోని అంతరార్థం ఏమిటో అర్థం కాలేదు.
సాయిబాబా కాసేపు అక్కడ మాట్లాడి బయలుదేరాడు. అదంతా చూస్తుంటే సర్కస్ లో ప్రీమియం టికెట్ కొన్న వారిని ముందు సీట్ లో కూర్చోబెట్టినట్టు ఆ రిచ్ పీపల్ ని సాయిబాబా రూమ్ ఎదురుగా కూర్చోబెట్టడం చూస్తుంటే అంతా ప్లాన్డ్ గా అరేంజ్ చేసినట్టు ఉంది.
సాయిబాబా ముందుగా నడుస్తుంటే వెనుక జనం వస్తున్నారు.
సాయిబాబా నడుస్తూ తన ఎదురుగా కూర్చున్న వాళ్ళ వద్ద ఏదో కాగితాలు తీసుకుని పక్కన్నే ఉన్న పర్సనల్ అసిస్టెంట్ కి ఇస్తున్నాడు.
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్