స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (10-06-2018)

నాకు అర్థం అయ్యింది ఏమంటే అవి డొనేషన్స్ లేకుంటే వినతి పత్రాలు. భక్తుల అర్జీలు కుప్పలుగా వచ్చినట్టు ఉన్నాయి.
వెనుక ఉన్న శిష్యులు భక్తిగా వాటిని సాయబాబా చేతి నుండి తీసుకుంటున్నారు.
అలా నడుస్తూ సాయిబాబా ఒక వ్యక్తి వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఆ వ్యక్తి సాయబాబా కాళ్ళ మీద పడ్డాడు. సాయిబాబా అతనిని లేపి కూర్చోబెట్టాడు. అలా గాలిలో చేతులు ఆడించాడు.
చేతులను గుప్పిట పట్టి అలా తెరిచాడు. ఆశ్చర్యం… అరచేతిలో బంగారు చెయిన్.
అందరిలో ఒక రకమైన షాక్.. చూసే భక్తులకు దేవుడు ఏదో మాయ చేసినట్టు ఉంది. అక్కడ ఉన్నవారు అందరూ సాయిరాం సాయిరాం అంటూ భక్తిపారవశ్యంలో అరుస్తున్నారు.
ఒక్క మేజిక్ చేస్తేనే ఇంత రియాక్షన్? ఈ మేజిక్ స్టేజ్ పైన చేసే మేజిషియన్స్ ను ఎందుకు ఇంతలా మెచ్చుకోరో అర్థం కాలేదు.
సాయిబాబా చిరునవ్వు నవ్వుకుంటూ అక్కడి మనుషులను చూస్తూ పలకరింపుగా నవ్వుతూ నేనున్న వైపుకు వచ్చాడు. అప్పుడే మొదటిసారి సాయి బాబాను అంత క్లోజ్ గా చూడడం…
తలనిండా జుత్తుతో తెల్లగా నిగనిగలాడుతూ పొట్టిగా ఉన్నాడు..
తెల్లటి సిల్క్ డ్రెస్. పైన నుండి కింద వరకు అంగీలా ఉంది. మొహం మీద చిరునవ్వు.
నా ముందు నుండి అలా నడుచుకుంటూ వెళుతున్నాడు. అతను నడిచి వెళ్ళే దారి మొత్తం రెడ్ కార్పెట్. మెత్తగా కాళ్ళకు సుఖాన్ని ఇస్తూ ఉంది. ఆ ఆనందం వల్ల కాబోలు మోహంలో ఏదో నవ్వు.
చుట్టూ చూస్తూ చేతిని గాలిలో తిప్పుతూ చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు.
అతనిని చూసినవారంతా ఏదో పారవశ్యంలో ఉన్నాడు అనుకునేట్టు ఉంది ఆ ప్రవర్తన.
అతను నన్ను దాటి పోగానే నా ముందు కూర్చున్న గ్రూప్ నుండి కొన్ని మాటలు వినపడ్డాయి.
“సాయి బాబా నన్ను చూశాడు… నా జన్మ తరించింది” అని ఒకతను అంటుంటే మరొకతను
”నేను ఆయన కాళ్ళు తాకాను. ఇక నాకు మోక్షం తప్పకుండా వస్తుంది” అంటున్నాడు
వాళ్ళను చూసి నేను తెల్లబోయాను
***

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY