(12)
ఒక్కక్షణం నమ్మశక్యం కానట్టు నేలవైపు చూసాడు.దుమ్ములో డేవిడ్ పాదం స్పష్టముగా కనిపిస్తుంది.ఒక పాదం ముందుకు కదిలి మరో పాదం …జేమ్స్ ఒళ్ళు మరోసారి గగుర్పొడించింది.తనకే ఎందుకిలా జరుగుతుంది.సిద్దార్థ ఎంత కామ్ గా వున్నాడు.అతనికి డేవిడ్ ఆత్మ మీద నమ్మకం ఉందా?
అలా ఆలోచిస్తూ ఉండగానే డేవిడ్ పాదాల ముద్రలు డేవిడ్ బెడ్ రూమ్ వరకు వెళ్లాయి..బెడ్ రూమ్ తలుపు వేసి వుంది.
ఇప్పుడు సినిమాలో చూపించినట్టు తలుపు కిర్రుమనే శబ్దంతో తెరుచుకుంటుందా? ఒక్కక్షణం కళ్ళు గట్టిగా మూసుకుని మెల్లిగా ఒకకన్ను తెరిచి చూసాడు.
అప్పటికే డిటెక్టివ్ సిద్దార్థ తన దగ్గరున్న చిన్న సూదిలాంటి సాధనంతో బెడ్ రూమ్ తలుపు తెరిచాడు…జేమ్స్ వైపు చూసి ..”నువ్వు బెడ్ రూమ్ తలుపు వైపు చూడడంతోనే అర్థమైంది “డేవిడ్ తాళంచెవి తీసుకువచ్చి బెడ్ రూమ్ తాళం తీస్తాడని ” నువ్వు ఎదురుచూస్తున్నట్టు వున్నావ్..”నవ్వుతూ అన్నాడు
“ఈ మనిషి ఇలాంటి పరిస్థితిలోనూ ఎలా నవ్వగలుగుతున్నాడు ? అనే అనుమానం భయం ఆశ్చర్యం ” అన్నీ కలిగాయి జేమ్స్ కు
డిటెక్టివ్ సిద్దార్థ డేవిడ్ బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టాడు…అతని కళ్ళు చేతులు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి.
పదినిమిషాల్లో పెన్ డ్రైవ్ దొరికింది.ఫ్లవర్ వాజ్ కింద కనిపించింది.
జేమ్స్ ఆ ఇంట్లో ఆ బెడ్ రూమ్ లో డేవిడ్ తో కలిసి పేకాడిన సందర్భం గుర్తు చేసుకుంటూ ఉండగా…బెడ్ రూమ్ తలుపు టపటపా కొట్టుకున్నాయి.
ఆ గాలికి టీపాయ్ మీద వున్న ఫ్లవర్ వాజ్ కిందపడింది భళ్ళున శబ్దం చేస్తూ..అప్పుడు కనిపించింది ఫ్లవర్ వాజ్ కింద వున్న పెన్ డ్రైవ్.
డిటెక్టివ్ సిద్దార్థ జేమ్స్ వైపు తిరిగి “మనం వచ్చిన పని అయిపొయింది..మీ ఫ్రెండ్ కు థాంక్స్ చెప్పు వెళ్ళిపోదాం ? అంటూ గోడకు వున్న డేవిడ్ ఫోటో వైపు చూస్తూ ” థాంక్యూ ఫ్రెండ్..చనిపోయి కూడా సాక్షాన్ని బ్రతికించావ్ “అన్నాడు
జేమ్స్ డేవిడ్ ఫోటో వైపు చూసి..టేబుల్ మీద వున్న క్యాండిల్ తీసుకువచ్చి వెలిగించి కళ్లుమూసుకున్నాడు…ఇప్పుడతని లో చిత్రంగా భయం లేదు…
తర్వాత ఇద్దరూ బయటకు వచ్చారు…
డేవిడ్ ఇంటికి తాళం వేస్తూ డిటెక్టివ్ సిద్దార్థ చెప్పాడు..” డేవిడ్ కు వృద్ధురాలైన తల్లి ఉన్నట్టు..ఆవిడ అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది.చనిపోతూ కూడా డేవిడ్ మనకు మేలు చేసాడు..ప్రభుత్వం తరపున అతని తల్లికి ఇల్లు సమకూరుతుంది.బ్రతికినంతకాలం ఆవిడకు సాయం అందుతూనే ఉంటుంది. ” చెప్పాడు డిటెక్టివ్ సిద్దార్థ
“థాంక్యూ సర్ డేవిడ్ చాలా మంచివాడు”చెప్పాడు డేవిడ్ ఇంటివైపు చూస్తూ…
డేవిడ్ తనవైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తున్నాడు.మెల్లిమెల్లిగా అతని రూపం కనుమరుగవుతూ ఆకాశంవైపు పైపైకే వెళ్తుంది.
ఇక డేవిడ్ తనకు కనిపించడని..అతను అనుకున్నపని పూర్తయ్యిందని ఆ క్షణం అతనికి తెలియదు.
సరిగ్గా అదేక్షణంలో…
ఆ ఇంటిని చుట్టుముట్టిన మిస్టర్ డి అనుచరులు సిద్ర్త మీద జేమ్స్ మీద ఎటాక్ చేసి వాళ్ళు సేకరించిన సాక్ష్యాన్ని తీసుకుందామనుకున్నారు.
మూకుమ్మడిగా చుట్టుముట్టబోయారు.అప్పుడే వీలవైపే చూస్తూ కనిపించింది ఒక శునకం.
దానికళ్ళు ఎర్రగా వున్నాయి.నాలుక పొడవుగా వుంది.పళ్ళు రంపాళ్ల లా వున్నాయి.ఒక్కసారిగా వాళ్ళ మీదికి దూకింది….
***
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్)
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్