స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (24-06-2018)

నేను అవన్నీ చూస్తూ అక్కడే నిలబడ్డం ఇష్టం లేకుండా పోయింది.
అక్కడ నుండి బయటకు వెళ్లాలని కదిలాను. చుట్టూ జనం…
అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు. ఆడవారందరూ ఒక వైపు మగవారందరూ మరో వైపు కూర్చుంటున్నారు.
ఇక ఆలస్యం చేస్తే మనకు కూర్చోవడానికి ప్లేస్ కూడా దొరకదని అర్థం అయ్యింది.
అర్జెంట్ గా ప్లేస్ వెదుక్కుని కూర్చోవాలి అని డిసైడ్ అయ్యి చుట్టూ చూశాను. మొదటి వరుసలో కాస్త ప్లేస్ ఉన్నట్టు అనిపించింది.
మెల్లగా వెళ్లి అక్కడ కూర్చోబోయాను. నా ప్రక్కన ఉన్న అతను నన్ను ఆపేశాడు.
ఏమైంది అన్నట్టు అతని వంక చూశాను. నాకు మరో సైడ్ చూపించాడు.
వీ.ఐ.పిలు కనిపించే కొంతమంది నా వైపే సీరియస్ గా చూస్తున్నారు. అసలు అక్కడ ఎందుకు కూర్చోకూడదో తెలియక నన్ను ఆపిన అతనిని అడిగాను.
అది రిజర్వు చేసిన ప్లేస్ అంట. నన్ను సీరియస్ గా చూసే సదరు వీ.ఐ.పిలు కూర్చోబోయే స్థలం అట.
దేవుడని నమ్మే సాయిబాబా ముందు కూడా గుడిలో ఉన్నట్టు రిజర్వేషన్స్ ఉండడం ఆశ్చర్యం అనిపించలేదు. అక్కడ డబ్బు ఉన్న వాడిదే రాజ్యం. పలుకుబడి ఉన్నవాడితే పైచేయి అన్నట్టు ఉంది.
దేవుని ముందు అందరూ సమానులే అన్న వ్యక్తి ఎవరో కాని ఒక్కసారి అతనిని తీసుకు వచ్చి ఆ పరిస్థితి చూపించాలని బలంగా అనిపించింది.
అయినా నేను నమ్మని వ్యక్తికోసం ఎక్కడ కూర్చుంటే ఏమి అనుకుని నాకు నచ్చిన లాస్ట్ లైన్ దగ్గరకు వెళ్లాను.
దూరం నుండి చూస్తే అక్కడ జరిగే హంగామా మొత్తం క్లియర్ గా కనిపిస్తోంది. పేరుకోసం ప్రాకులాడే వ్యక్తులు.. సాయిబాబా కంట్లో పడాలన్న ఆరాటపడే హడావిడి కార్యకర్తలు చాలా మంది కనిపించారు.
నాకు అది వేడుకగా అనిపించి అక్కడే కూర్చున్నాను. నా ప్రక్కగా ఒక బుద్ధిష్ట్ ఉన్నాడు.
బుద్దిజం యొక్క సాంప్రదాయమైన డ్రెస్ వేసుకుని ఉన్నాడు. అతన్ని చూడడానికి నాకు ఎందుకో ఇంట్రెస్ట్ గా అనిపించింది.
ఇంతలో సాయిబాబా వచ్చి అతనికి స్పెషల్ గా వేసిన వెండి సింహాసనం మీద కూర్చున్నాడు.
చేతిలో మైక్ లాంటిది ఉంది. అప్పటివరకు హంగామా చేసిన వ్యక్తులు సైలెంట్ గా ఆయన చుట్టూ కూర్చున్నారు.
ఇంతలో తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి మైక్ తో సాయిబాబా పక్కన నిలుచున్నాడు.
అక్కడ ఒక్క సాయిబాబా తప్ప మిగిలిన అందరూ వైట్ డ్రెస్ లో ఉన్నారు. సాయి బాబా మాత్రం పట్టు బట్టల్లో దగదగా మెరిసిపోతున్నాడు.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY