” పంజాబీ అమ్మాయిలా వున్నానని ” బలే బలే” అని సింబాలిక్ గా అనాల్సిన అవసరం లేదు ” సీరియస్ లుక్కొకటి ఇచ్చి అంది…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (24-06-2018)

                                       (14)
నిత్యం రద్దీగా వుండే ప్రాంతం…అక్కడ ఓ పానీపూరి బండి వుంది. నీట్ గా డ్రెస్ వేసుకుని వున్నాడు.చేతులకు తడి అంటకుండా గ్లోవ్స్ వున్నాయి.కార్పోరేట్ స్టైల్ లో వున్నాడు.దాదాపు వందకు పైగా పానీపూరి బండ్లు సిటీలో వివిధ ప్రాంతాల్లో వున్నాయి.మెడలో ఏప్రాన్ లాంటిది కట్టుకున్నారు.వాళ్ళు వేసుకున్న చొక్కా మీద చిన్నగా డి అక్షరం వుంది.
కేవలం కొద్దిరోజుల్లోనే డి పానీపూరి కి యూత్ ఎడిక్ట్ య్యారు.కాలేజీ పిల్లలు ముఖ్యంగా కాలేజీ ముందు మార్నింగ్ టైములో కూడా అంబీడుబాటులో వుండే పానీపూరి సాయంకాలాల్లో కూడా అందుబాటుకిలోకి వచ్చాయి. అర్థరాత్రి  వరకూ అందుబాటులో ఉండడం వల్ల చాలామంది  మొబైల్ టిఫిన్స్ కన్నా పానీపూరీకే ఎడిక్ట్ అవుతున్నారు.
డిటెక్టివ్ సిద్దార్థ నీట్ గాకార్పోరేట్ స్టైల్ లో డ్రెస్ వేసుకున్నాడు.టక్ చేసుకున్నాడు. చలువ కళ్లద్దాలు మొహాన్ని కవర్ చేస్తున్నాయి.టీనేజ్ యువత వేలంవెర్రిలా ఉందక్కడ.ఒక్కొక్కరు ప్లేట్లకు ప్లేట్లు లాగిస్తున్నారు.ఆ గప్ చుప్ ( పానీపూరి ) బండి పక్కనే నలుపుఱంగు దుస్తులు ధరించిన ఇద్దరు బలిష్ఠులైన వ్యక్తులు వున్నారు.సిటీలో వున్న ప్రతీ బండి దగ్గర ఇద్దరేసి వ్యక్తులు వుంటారు.ఎటువంటి గొడవ జరిగినా ఆ ఇద్దరువ్యక్తులు పానీపూరి బండివాడిని రక్షిస్తారు.వాడి ప్యాంటు జేబులో రివాల్వర్ ఉంటుంది.వల్ల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి.ఎప్పుడు ఎవరికీ ఏ ప్రమాదం వచ్చినా కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతుంది.మిగితావాళ్ళు ఎలర్ట్ అవుతారు.
డిటెక్టివ్ సిద్దార్థ తన పక్కనే వున్న పంజాబీ అమ్మాయి వంక చూసి  ” బలే బలే ” అన్నాడు
” పంజాబీ అమ్మాయిలా వున్నానని బలే బలే అని సింబాలిక్ గా అనాల్సిన అవసరం లేదు ” సీరియస్ లుక్కొకటి ఇచ్చి అంది.పంజాబీ  గెటప్ లో వున్న సుగాత్రి
” ఐసీ..” అని పానీపూరి వాలా వంక చూసి ” దో ప్లేట్  పానీపూరి ” అన్నాడు…
“పానీపూరి అతడు రెండు ప్లేట్స్ లో పానీపూరి పెట్టిచ్చాడు ..సిద్దార్థ సుగాత్రి పానీపూరి బండికి పక్కనే  వున్నబలిష్ఠులైన వ్యక్తులకు దగ్గరగా వెళ్లారు..ఈలోగా సిద్దార్థ తన చేతిలో వున్న టప్పర్ వేర్ బాగ్ చేతిలోకి తీసుకుని అతి వేగంగా బ్యాగ్ ఓపెన్ చేసి అందులో వున్న బాక్స్ తీసి పానీపూరీని అందులో వేసాడు.తర్వాత టప్పర్ వేర్ బ్యాగ్ క్లోస్ చేసాడు..పానీపూరి తింటున్నట్టు ఆక్ట్ చేసాడు…పనిలోపనిగా సుగాత్రి ప్లేట్ లోని పానీపూరి ఒకటి తిన్నాడు.
” కావాలంటే మరో ప్లేట్ తినొచ్చుగా..నా ప్లేట్ లోని పానీపూరి లాగేసుకోకపోతే ” అంది సుగాత్రి పక్కనున్న వ్యక్తికి వినిపించేలా…
” అదేమిటో డార్లింగ్ నీకన్నా ఈ పానీపూరీలో కిక్కు ఎక్కువగా వుంది…ఈ బ్యూటీ పూరీలో లేని కిక్కు ఈ పానీపూరీలో వుందా ” అన్నాడు సుగాత్రి  వైపు చూసి
” ఓ పది ప్లేట్లే పార్సెల్ తీసుకువెల్దామా..రాత్రంతా తింటూ ఉండొచ్చు ” అంది సుగాత్రి
” ప్చ్ నో పార్సెల్ ఓన్లీ ఇక్కడే ఈటింగ్ ..పార్సెల్ ఇవ్వరట..” అన్నాడు సిద్దార్థ
వెంటనే సుగాత్రి తన హ్యాండ్ బాగ్ లో నుంచి రెండువేల రూపాయలనోటు తీసి  ” ఇదిచ్చినా ఇవ్వడా ? అంది
” ఉహూ…” అన్నాడు సిద్దార్థ
వీళ్ళ మాటలు వింటున్న ఆ ఇద్దరు బలిష్టమైన వ్యక్తులు చిన్నగా నవ్వుకుని..” వాళ్ళవైపు ఓసారి చూసి…: మీకు పానీపూరి పార్సెల్ కావాలా మేడం ” అని అడిగాడు
వెంటనే సిద్దార్థ ఆ బలిష్టమైన వ్యక్తి భుజం పట్టుకుని ” హలో ఇక్కడ మాకు కూడా కావాలి ..ఏంటి అమ్మాయిలకేనా ? అన్నాడు కోపం నటిస్తూ
” సారీ సర్..మీ ఇద్దరికీ ..ఓకేనా…ఇంతకూ మీరెక్కడ వుంటారు ? చిన్న అనుమానం తో అడిగాడు
ఇద్దరూ ఒకేసారి చెప్పారు
” ఆ అడ్రెస్ కు మా మనిషి వస్తాడు..” చెప్పారు వాళ్ళు
” ఒట్టు ” బలిష్టమైన వ్యక్తి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగాడు
” ఒట్టు సర్ ” అన్నాడు ఆ వ్యక్తి
అతని సన్నని మీసాలు   పట్టుకుని పీకే యత్నం చేస్తూ ” గుడ్డు బాయ్ : అన్నాడు
చిన్నగా కేకవేసాడు మీసాలు  లాగడంతో ఆ వ్యక్తి ” కోపాన్ని అణుచుకుని  ” ఇట్స్ ఒకే సర్ ” అన్నాడు.
తరువాత సుగాత్రి  సిద్దార్థ వెళ్తున్న హోండా యాక్టీవ్ ను ఫాలో చేయమని వేరే ఎవరికో ఫోన్ చేసారు..
సిద్దార్థ సుగాత్రి ఒక అపార్టుమెంట్ దగ్గరికి వెళ్లారు..
ఒక ఫ్లాట్ దగ్గరికి వెళ్లి తలుపు తీసి లోనికి వెళ్లి తలుపు మూసుకున్నారు.
వాళ్ళను ఫాలో అయినవ్యక్తి అది చూసి ఎవరికో ఫోన్ చేసి.” ఓకే నో డౌట్  కరెక్ట్ అడ్రస్ ” అని చెప్పారు.
                                               ***
తమని ఫాలో చేసిన  వ్యక్తి అపార్టుమెంట్ నుంచి వెళ్లెవరకూ వుంది…డ్రెస్ మార్చుకుని అపార్టుమెంట్ వెనుకవైపు నుంచి వెళ్లిపోయారు సిద్దార్థ సుగాత్రి 
                               ***
చీకటితెరలు సిటీని చుట్టేసాయి,సుగాత్రి డ్రెస్  మార్చుకుంటుంది.సిద్దార్థ   హాలులో నుంచి అరిచాడు..
” త్వరగా డ్రెస్ మార్చుకుంటే ..మనం యాక్షన్ లోకి దిగొచ్చు..”
” మీలా తొక్కలో ప్యాంటు షర్ట్ కాదు..చీర   బ్లౌజ్..” అని ఆగింది
” కంటిన్యూ ప్లీజ్ వాంప్ట్..” అన్నాడు సిద్దార్థ
అటువైపు నుంచి సైలెన్స్
చీర మార్చుకుంటున్న సుగాత్రి ఒక్కక్షణం సిగ్గు పడింది.సిద్దార్థ షార్ప్ బుర్రకు తన మాటలు అర్ధమయ్యే ఉంటాయి  .అయినా అతగాడిగురించి తెలిసి దానిలా మాట్లాడకూడదు.ఎంతైనా తనకు నోటిదూల ఎక్కువే ” అని తనను తాను తిట్టుకుంది.సిద్దార్థ మొహంలో ఫీలింగ్స్ గుర్తుకు చేసుకుంది.
హాలులో అటూఇటూ పచార్లు చేస్తున్న సిద్దార్థ అడుగుల   శబ్దం విని తలెత్తి అలాగే వుండిపోయాడు.పింక్ కలర్ శారీ లో సుగాత్రి  చాలా అందంగా వుంది.ఆలస్యమైనా అందంగా తనకళ్లముందుకు వచ్చిన ఐదడుగుల నాలుగంగుళాల అందాన్ని అలానే చూస్తూ వుండిపోయాడు.
సుగాత్రికి ఆ చూపులు సిగ్గును పుట్టించాయి,ఒంట్లో వెచ్చని ఆవిర్లు సృష్టించాయి.
” ఎక్కడో ఓ సరసమైన కథలో చదివాను..గుప్పెడు స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా నిద్రపట్టనివ్వని అందం ” అని నిజంగా చాలా మందంగా చ చ చాలా అందంగా చెప్పాడు రచయిత…” మనఃస్ఫూర్తిగా అన్నాడు సిద్దార్థ
” పరాయి అమ్మయిల ఇలా ఓపెన్ గా పొగడ్డం మర్యాదస్తుల లక్షణం కాదు ” చిరుకోపంగా అంది సుగాత్రి
” మరి మనం మర్యాదస్థులం అని ఎవరు చెప్పారు..పక్కా మాస్..జులాయి..దేశముదురు.ఇడియట్ ..నేనింతే …” నవ్వుతూ అన్నాడు సిద్దార్ఛ్
” తాను మాటల్లో సిద్దార్థను ఏమార్చలేనన్న విషయం ఆమెకు ఎప్పుడో తెలుసా..అయినా సిద్దార్థ తనను ,తన అందాన్ని పొగుడుతుంటే బాగానే వుంది…”
” ఓకే వెల్దామా ? అన్నాడు సిద్దార్థ
” ఇంకాసేపు తన అందాన్ని పొగడొచ్చుగా ? మనసులో అనుకుంది సుగాత్రి
” పొగడొచ్చు కానీ టైం లేదు..పైగా నేను నీ అందాన్ని పొగిడితే నీక్కాబోయే ఆయన ఫీలవ్వొచ్చు ” అన్నాడు సుగాత్రి వంక చూస్తూ.
గతుక్కుమంది సుగాత్రి ..” తన మనసులో ఫీలింగ్స్ ఈ పురుషుడికేలా తెలిసాయబ్బా?  ” అయినా పెద్ద జాదూ కదా తెలిసే ఉంటుంది ” అనుకుంది..ప్రశ్న జవాబు తనే చెప్పుకుంది.
ఇద్దరు బయటకు నడిచారు…
                          ***
కాఫీ హ్యూస్ లో జేమ్స్ సిద్దార్ఛ్ సుగాత్రి కూచున్నారు
” జేమ్స్ మాకో హెల్ప్ కావలి ” అన్నాడు సిద్దార్థ జేమ్స్ వంక చూస్తూ
” సర్ నన్ను ఆజ్ఞాపించండి ..చిన్నపుడు టెక్స్ట్ బుక్స్ లో డిటెక్టివ్ నొవెల్స్ పెట్టుకుని చదివేవాడిని…ఇప్పుడు పెద్ద డిటెక్టివ్ ఎదురుగుగా కూచున్నాను ? అతని ఛాతీ   రెండు అంగుళాలు పెరిగింది
” మేడం ను కూడా కాస్త పొగుడు ..లేకపోతె ఫీలవుతుంది ” నవ్వుతూ అన్నాడు సిద్దార్థ
 వస్తోన్న నవ్వును ఆపుకుంటూ సిద్దార్ఛ్ అంక కోపంగా చూసినట్టు నటిస్తోంది సుగాత్రి..చిత్రమేమిటంటే సిద్దార్థ ఏం మాట్లాడినా బావుంటుంది..చివరికి కోపంతో కేకలేసినా…
” మీ గురించి పొగిడితే మేడం ను పొగిడినట్టీ..మీరిద్దరూ ఇద్దరే…సిబిఐ ంటే సినిమాల్లో పుస్తకాల్లో తప్ప రియల్ లైఫ్ లో చూడలేదు..పైగా మేడం చాలా అందంగా వుంటారు..ఆఖరిపోరాటంలో శ్రీదేవిలా ”   అన్నాడు జేమ్స్.
” సరే..ముందు నువ్వు అర్జెంటు గా ఆక్టర్ అయిపోవాలి..యాక్టింగ్ లో చించేయాలి..అన్నట్టు మీ ఆవిడకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అడిగాడు సిద్దార్ధ
“నా పక్కనా? కాస్త నీరసంగా అన్నాడు జేమ్స్
సిద్దార్థ జేమ్స్ వైపు చూసి చెప్పాడు
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్) 
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY