అలుపన్నదే ఎరుగని యోధుడు..గెలుపన్నదే సాధించే ధీరుడు
విద్యార్థుల్లో ఒక్కడూ ..అందరివాడు…విద్యార్థుల గోకులంలో గోపాలుడు
మానవతే తన ఆయుధం విద్యార్థుల భవితే తన ఆశయం
…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
పచ్చదనం బాలలతో చెలిమి చేస్తుంది.స్వచ్ఛమైన ఉద్యానవనం గాలి బాలల దినోత్సవానికి వింజామరలు అయ్యాయి.
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్,విద్యార్థులకు స్నేహితుడు గైడ్ ఫిలాసఫర్ ,
ఉపాధ్యాయులకు మార్గదర్శకుడు ..నిరంతర స్వాప్నికుడు ..
ఏది చేసినా విభిన్నమే..ఏం చేసినా వినూత్నమే..ఎలా చేసినా విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు శుభారంభమే.
పండిట్ జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు బాలలకు పండుగరోజు..ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పచ్చని చెట్లతో నిండిన పార్క్ లో ఆహ్లాదాల సంబరాలు జరిపించారు.ఆటపాటలు వేషధారణలు అల్లరులు ఆనందాలు..తనూ ఒక విద్యార్థిగా మారాడు.
ఉపాధ్యాయులు సందడి చేసారు.
తల్లిదండ్రులు కనులారా ఈ వేడుక చూసారు.
ఆటపాటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం జరిగింది .
ఈ సందర్భంగా డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ” భారతదేశం తొలిప్రధాని పండిట్ చాచా జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు..బాలల దినోత్సవం గా మనం జరుపుకునే రోజు.
ప్రతీ సంవత్సరం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటాం..కానీ మనం ఆచరిస్తున్నామా ?
మన పిల్లలను చాచా నెహ్రు ఆశించిన రీతిలో తీర్చిదిద్దుతున్నామా ?
బంగారు బాల్యాన్ని మనం భవిష్యత్తు తరాలకు అందిస్తున్నామా ?
ఆలోచించండి..పునరాలోచించండి…
ప్రశ్నించండి … ప్రతిస్పందించండి /
బాల్యమనే విత్తనానికి తల్లిదండ్రులు నీళ్లు పోయాలి
ఉపాధ్యాయులు కృషి అనే సాగు చేయాలి
వ్యవస్థ మాలి గా పని చేయాలి
అందమైన బాల్యం పూలవనమై పరిమళాలు వెదజల్లాలి.
అదే నిజమైన బాలల దినోత్సవమాడే చాచా నెహ్రూకు నిజమైన నివాళి.ఇది గుండెనిండుగా నేను వెలిబుచ్చే నా ఏకాంకదా ” అన్నారు.
ఈ వేడుకలో పాఠశాల ప్రిన్సిపాల్ టి.గీత ,వైస్ ప్రిన్సిపాల్ కె.రాధ,….శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకను పలువురు ప్రముఖులు పార్క్ ను సందర్శించిన వారు ప్రశంసల వర్షం కురిపించారు.వేడుక చివరివరకూ వీక్షించారు.
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్