క్యాన్సర్ అనే పదం వైద్య నిఘంటువులో లేనిరోజు రావాలి.
క్యాన్సర్ పట్ల ఎంత అప్రమత్తంగా వున్నా దొంగచాటున కభళిస్తూనే వుంది.ఒకప్పుడు గౌతమి ,మొన్న సోనాలిబింద్రే .ఇప్పుడు బాలీవుడ్ నటుడు రిషి కపూర్, ప్రముఖుల వివరాలు తెలుస్తున్నాయి.ఎందరో సామాన్యులు …బయటకురాని గణాంకాలు.
క్యాన్సర్ ని జయించే రోజు రావాలి.కనీసం క్యాన్సర్ అవేర్ నెస్ ను ప్రజల్లో కలిగించాలి.అందుకు అందరూ ముందుకు రావాలి.
” దేవుడు మనుష్యులని సృష్టించాడు. ఆ మనుష్యులను అర్థాంతరంగా తీసుకెళ్ళడానికి మృత్యువుని సృష్టించాడు. ఆ మృత్యువు కాన్సర్ ను సృష్టించింది.
కాన్సర్ మనుష్యుల మధ్య అనుబంధాలను, ఆనందాలను హరించి విషాదాన్ని మిగిల్చింది. దేవుడు పశ్చాత్తాపపడి డాక్టర్‌ని సృష్టించాడు.
అప్పుడేం జరిగింది?
కాన్సర్‌ని గుర్తించడం ఎలా?
కాన్సర్ బాధితులను ఓదార్చడమెలా?
నెలలో ఒకరోజు యాభై రూపాయల ఖర్చుతో, వంద పోస్టుకార్డులు కాన్సర్ బాధితులకు పోస్ట్ చేస్తే?
కాన్సర్‌తో పోరాడి గెలిచిన వారు, ఓడినవారు, స్ఫూర్తినిచ్చిన వారు. ఎవరెవరు?
మీకు తెలుసా? తలనుండి కాళ్ళ వేళ్ళ వరకు ఏ భాగానికైన వచ్చే కాన్సర్…
100 రకాలకు పైగా ఉన్నాయి.”
సుప్రసిద్ధ డాక్టర్, చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ…
ప్రముఖ రచయిత విజయార్కె కలిసి అందిస్తున్న… తొలి ప్రయోజనాత్మక ప్రయోగం “కాన్సర్‌ని జయించండి”
కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు.
రిషికపూర్ తాను ఎదుర్కున్న సవాళ్ల గురించి ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు.
‘గతేడాది దిల్లీలో ఓ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు నేను వైద్య పరీక్షలు చేయించుకున్న ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తర్వాత తొమ్మిది నెలలుగా న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నాను. జీవితంలో పెను మార్పు చోటుచేసుకున్నట్లు అనిపించింది. చికిత్స మొదలుపెట్టాక 26 కిలోలు తగ్గిపోయాను. నాలుగు నెలల పాటు తిండిలేదు. ఆకలి వేసేది కాదు.
ఈ మధ్యనే ఎనిమిది కిలోలు పెరిగాను. ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం మెరుగవుతోంది. ఇంకా చికిత్స జరుగుతోంది. నా ఇంటిని చాలా మిస్సవుతున్నాను. నేను న్యూయార్క్‌లో మరో రెండు నెలలు చికిత్స తీసుకోవాలి. సెప్టెంబర్‌లో నా పుట్టినరోజు. కనీసం అప్పటికైనా నేను నా ఇంటికి చేరుకుంటానని ఆశిస్తున్నాను’ అని వెల్లడించారు రిషి.
మీరు త్వరలో క్యాన్సర్ ని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో మీ పుట్టినరోజు జరుపుకోవాలని మేన్ రోబో మనసారా ఆకాంక్షిస్తోంది.
కాన్సర్ ని జయించిన సోనాలి బింద్రే మాటలు ..
( ఈనాడు సౌజన్యంతో)
ముంబయి: బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జులైలో ఆమె తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. చికిత్స కోసం న్యూయార్క్ వెళ్తున్నట్లు తెలిపారు. అక్కడే ఆమెకు కొన్ని నెలలపాటు చికిత్స జరిగింది. అయితే ఈ క్రమంలో ‘చనిపోతానేమో’ అనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని సోనాలి చెప్పారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ‘నా ఉదర భాగంలో క్యాన్సర్ కణాలు పూర్తిగా వ్యాపించి ఉన్నాయని స్కాన్ ద్వారా తెలిసినప్పుడు, బతికే అవకాశం కేవలం 30 శాతం ఉందని న్యూయార్క్ వైద్యులు చెప్పినప్పుడు.. మా గుండె పగిలింది. కానీ చనిపోతాననే ఆలోచన నాకు రాలేదు. పూర్తిగా కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని మాత్రం అర్థమైంది. కానీ ప్రాణాలు పోతాయని మాత్రం ఎప్పుడూ భయపడలేదు’.
‘ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు నా బలం అయ్యారు. ఇప్పుడు నేను నా శరీరంపై ఎక్కువ దృష్టిపెడుతున్నా. చిన్నచిన్న మార్పుల్ని పట్టించుకుంటున్నా. ఇది ఓ కొత్త ప్రయాణం. క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా.. ఎక్కువ జాగ్రత్త అవసరం, సపోర్ట్ అవసరం. మీ చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉండేలా చూసుకోండి. ఇది ప్రేమ, అనురాగం పొందాల్సిన సమయం’ అని సోనాలి చెప్పారు.
క్యాన్సర్ అనే పదం వైద్య నిఘంటువులో లేనిరోజు రావాలి.
క్యాన్సర్ ను ఎదుర్కోండి.క్యాన్సర్ ని జయించండి.మీ విలువైన జీవితాన్ని,అందులో కొంతసమయాన్ని క్యాన్సర్ అవేర్ నెస్ కోసం వెచ్చించండి.
క్యాన్సర్ ని జయించండి… పిడిఎఫ్ చదివి మీకు ఉపయోగం అనుకుంటే ఈ పుస్తకాన్ని మొత్తం చదవండి.
క్యాన్సర్ ని జయించండి పుస్తకం లింక్.
http://kinige.com/book/Cancerni+Jayinchandi
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్