మనకు చేదును మిగిల్చే తీపిజబ్బు షుగర్..ఎంతవారైనా వారు వీరు అనే తేడా లేకుంగా వయసును కూడా లెక్క చేయకుండా ముంచుకువచ్చే షుగర్ ను ఇలా నియంత్రించవచ్చని నిపుణు చెబుతున్నారు. *భోజనం చేసిన తర్వాత కాసేపు …ఎట్ లీస్ట్ పది నిమిషాల పాటు నడిస్తే.రక్తంలో షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయట! ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత స్వల్ప నడకతో మధుమేహాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చట! *రోజూ అరగంట నడక కన్నా భోజనం తర్వాత స్వల్ప నడక వల్లే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు వెల్లడించారు. . *భోజనం తర్వాత పది నమిషాలు నడిచినవారిలో సగటున బ్లడ్ షుగర్ లెవెల్స్ 12 శాతం వరకూ తగ్గిపోయాయని గుర్తించారు.