స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి 10-07-2016

                                                    67

“నాకు సహాయం చెయ్యండి. నాకు తెలిసిన అన్ని విషయాలు చెప్తాను. ప్లీజ్..”
దీనంగా అడిగాడు సత్యమూర్తి.

సత్యమూర్తి కళ్ళలో భయం క్లియర్ గా కనిపించింది
“ష్యూర్… మా అగస్త్య ఒక్కసారి మాట ఇస్తే ఇక తప్పే ప్రసక్తే లేదు. ఆ విషయంలో నాది గ్యారంటీ” భరోసా ఇస్తూ అన్నాడు హిమాంషు
“ఐతే వినండి…” అంటూ సత్యమూర్తి ఏదో చెప్పబోయేంతలో ఆకాశంలో ఏదో పెద్ద శబ్దం వినిపించింది
అగస్త్య వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు.
“హిమా! టేక్ కేర్ అఫ్ హిమ్” అంటూ విండో వద్దకు వెళ్ళాడు.
హెలికాప్టర్ ఒకటి పైన చక్కర్ కొడుతూ కనిపించింది. దీక్షగా చూస్తే హెలికాప్టర్ లో ఉన్న రాకెట్ లాంచర్ తమ వైపే గురి పెట్టి ఉండడం కనిపించి అగస్త్య మైండ్ ఒక్కసారి అలెర్ట్ అయ్యింది.
“హిమా… వి ఆర్ ఇన్ డేంజర్. గెట్ హిమ్ అవుట్ క్విక్” అంటూ ఒక్క జంప్ లో టెంట్ బయట పడ్డాడు.
“గురూ.. ఇది చాలా అన్యాయం… ఇంత పెద్ద శాల్తీని నాకు వదిలి నువ్వు ఒక్కడే జంప్ చెయ్యడం… ఒక్క నిముషం ముందు చెప్తే నీ సొమ్మేం పోయేది… అన్నీ ఇలానే చేసి నాకు టెన్షన్ తెప్పిస్తావు…” అంటూ హిమాంషు సత్యమూర్తిని బుజాన వేసుకుని టెంట్ మరో వైపు ఉన్న ఎంట్రన్స్ నుండి బయటకు జంప్ చేశాడు.
స్ప్లిట్ సెకండ్ లో హెలికాప్టర్ నుండి దూసుకు వచ్చిన రాకెట్ లాంచర్ టెంట్ ని క్షణంలో బుగ్గి చేసింది.
ఆ దృశ్యం చూసిన స్తయమూర్తి భయంతో స్పృహ తప్పి విరుచుకు పడిపోయాడు.
రాకెట్ లాంచర్ దెబ్బకు తాటిచెట్టు ప్రమాణంలో లేచిన ఇసుక ముగ్గరిని కప్పేసింది.
పరిస్థితి అర్థం ఐన హిమాంషు ఏ మాత్రం కదలక అలానే భూమికి అతుక్కుపోయాడు.
హెలికాప్టర్ కాసేపు అక్కడే ప్రదక్షిణ చేసి ఉత్తర దిశగా బయలుదేరింది.
హెలికాప్టర్ కనుచూపు దాటేవరకు కదలకుండా ఉన్న హిమాంషు ఒక్కసారిగా లేచి పైన ఉన్న ఇసుకను దులుపుకున్నాడు.
“గురూ! ఎక్కడా?” అంటూ చుట్టూ వెదికాడు.
అగస్త్య ఎక్కడా కనపడలేదు.
సత్యమూర్తి పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ తన ప్రక్కన్నే శవంలో పడి ఉన్న అతన్ని కదిపాడు.
ప్రాణం ఉంది కాని స్పృహలో లేడు. ఇప్పటికి అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదనుకుంటూ అగస్త్యను వెదకడం ప్రారంభించాడు.
ఇసుక గుట్టలు నిలువెత్తు ఉన్నాయి. గుట్ట అవతల ఏమి ఉందో సరిగ్గా కనపడ్డంలేదు.
అగస్త్యను వెదుకుతూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద గుట్ట ఎక్కాడు.
చుట్టూ చూస్తూ ఉండగా మరో ఎత్తైన గుట్టనుండి అగస్త్య తాపీగా దిగుతూ కనపడ్డాడు.
“అయినా ఈ మద్య నీకు మనుషుల సెంటిమెంట్స్ పై ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నట్టు ఉంది… నేను ఇంత గొంతు చించుకుని అరుస్తూ ఉంటే, ఏ మాత్రం పట్టనట్టు అలా ఎలా ఉంటున్నావో కొంచమైనా అర్థం కావడం లేదు” నిష్టూరంగా అన్నాడు హిమాంషు
అగస్త్య అతని వైపు ఒక చిరునవ్వు విసిరి సత్యమూర్తి పడి ఉన్న చోటుకు వెళ్ళాడు.
“ఏమడిగినా అర్థం కాకుండా , సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వడం బాగా అలవాటు అయ్యింది ఈ మద్య నీకు” రుసరుసలాడుతూ అతన్ని అనుసరించాడు హిమాంషు
***
  (మిగితా వచ్చేవారం)
ప్రముఖ రచయిత విజయార్కె రచనల్లో కొన్ని…ఫిక్షన్ …నాన్ ఫిక్షన్ …వ్యక్తిత్వ వికాస రచనలు…
వివిధ సందర్ర్భాల్లో ప్రముఖులతో దిగిన ఛాయాచిత్రమాలిక

NO COMMENTS

LEAVE A REPLY