HomeSerialsSerial3జితేంద్ర భూపతి ఒక నియంత. తన మాట విననివారిని….స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి 24-07-2016
జితేంద్ర భూపతి ఒక నియంత. తన మాట విననివారిని….స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి 24-07-2016
69
“చెప్పండి మాస్టారు… మొత్తం వివరంగా మేం ఏ పాయింట్ మిస్ కాకుండా చెప్పండి” హిమాంషు అడిగాడు “జితేంద్ర భూపతి ఒక నియంత. తన మాట విననివారిని ఏ మాత్రం ఉపేక్షించడు. మీరు లండన్ నుండి రావడం దగ్గర నుండి అతనికి అన్ని వివరాలు తెలుసు” సత్యమూర్తి చెప్పడం ఆపి అగస్త్య వంక చూశాడు
“ఇప్పుడు రెండు విషయాలపై క్లారిటి కావాలి. ఒకటి జితేంద్ర భూపతికి కావలసింది ఏమిటి? రెండు విదిశ అగస్త్య పైకి విదిశను పంపడానికి కారణం?
అడగడం మరిచిపోయాను… జితేంద్ర భూపతికి ఆ గుడికి ఏమిటి సంబంధం?” అడిగాడు హిమాంషు
“నీ అనాలిసిస్ బాగుంది. కథ మొత్తం గుడి చుట్టూనే తిరుగుతోంది. అగస్త్య వెంకటశేషయ్య మనవడు కావడంతో అతనికి జన్మత: కొన్ని హక్కులు సంభవించాయి. విదిశ ముకుంద భూపతి వారసురాలు కావడంతో వంశపారంపర్యంగా కొన్ని అధికారాలు దక్కాయి.”
అందరూ శ్రద్దగా వింటున్నారు. “ముందు తేలవలసిన విషయం ఒక్కటి ఉంది. విదిశ అగస్త్యను లవ్ చేస్తోందా?”
ఒక్కసారిగా వాతావరణం గంభీరంగా మారింది. సత్యమూర్తి ఏం చెపుతాడో అని అందరూ చాలా శ్రద్దగా చూస్తున్నారు
“విదిశ మొదట తన పేరెంట్స్ ను రక్షించుకోవడానికి మాత్రమే అగస్త్యకు దగ్గరైంది. కాని…”
“చెప్పండి” ఉత్సుకతో అడిగాడు హిమాంషు
“విదిశ అగస్త్యను నిజంగానే ప్రేమించింది”
ఆమాటతో అగస్త్యలో ఉన్న ఏ మూలో అనుమానం తొలగిపోయింది
తన మనసు తనను మోసం చెయ్యదు ప్రేమ ఒక్కసారి మాత్రమే పుడుతుంది. అది జీవితాంతం ఉంటుంది. మనసు ఒక్కరినే కోరుకుంటుంది. అది మరణించేవరకు ఉంటుంది.
విదిశ మనసును మాత్రమే చూశాడు అగస్త్య
అది స్వచ్చమై, సహజమై తనను చేరుకుంది. తన ప్రేమ అబద్ధం ఎంత మాత్రం కాదు కాలేదు…
అలా జరిగితే నిజమైన ప్రేమకు విలువలేదు.
మోసం చెయ్యడం తెలియని అమాయక హృదయం తనది. ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే మనసును మోసం చెయ్యడం కంటే మరో పాపం లేదు.
ప్రేమంటే ఇదేనా!
ప్రేమలో ఇంత శక్తి ఉందా!
మొన్నటివరకు తనంటే ఎవరో కూడా తెలియని మనసుకు, తను ఒక్కసారి పరిచయం కాగానే ఇంతలా మారిపోవడం ఏమిటి?
తన గురించే ఆలోచించే విధంగా ఎలా తయారైంది?
తన ఊహే శక్తిగా మారి ఉత్తేజాన్ని కలిగిస్తోందా!
తను లేకుంటే బ్రతకే లేదు అన్న స్థితికి జారడానికి కారణం ఏమిటి? ఏమైనా ప్రేమ నిజంగా గొప్పదే! ఏదో తెలియని ఉత్సాహం… తనను తలచుకుంటే మనసంతా ఏదో చెప్పలేని ఆనందం ప్రపంచంలో మరేది అవసరం లేదు.. తను ఉంటే చాలు అన్న ఫీలింగ్ మన కోసం మరో మనసు ఎదురుచూస్తోంది అన్న విషయం తలచుకుంటే గుండె ఉప్పొంగిపోతుంది. చెప్పలేని… మనసు విప్పలేని ఒక అద్భుత భావన ఒక్కసారి చూస్తే జన్మకు ఇది చాలు అన్న ఫీలింగ్. విదిశ కూడా అలానే ఆలోచిస్తూ ఉంటుందేమో మనసు మనసుతో మాట్లాడుకోవడం అంటే ఇదేనేమో
***
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకూ) స్మార్ట్ రైటర్ సురేంద్ర రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి