డ్రైవింగ్ లైసెన్స్ లేకపొతే కటకటాల్లోకి…
(డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి)
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదికి వచ్చే వాహనదారులూ పారాహుషార్…
ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా అమలు చేయడానికి నగరపోలీసులు సిద్ధమయ్యారు.నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదికి రావడం,ప్రమాదాలకు కారణం కావడంలాంటి అంశాల పట్ల దృష్టి సారించిన పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై కూడా దృష్టిసారించారు. వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనల చిట్టాను పొందుపరిచేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్.. ‘ఈ-అప్లికేషన్’ సిద్ధం చేశారు. పోలీసుల తనిఖీల్లో లైసెన్స్ లేకుండా పట్టుబడిన మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి మొదటి తప్పిదంగా వదిలేస్తారు. మరోసారి దొరికితే కేసులు నమోదు చేస్తారు. మిగిలిన వాహనదారులు తనిఖీల్లో చిక్కితే మాత్రం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేస్తారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా చేపట్టిన తనిఖీలకు వాహనదారులు సహకరించాలని డీసీపీ రంగనాథ్ కోరుతున్నారు.. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడటమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు.
భాగ్యనగరంలో అరకోటి వాహనాలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో అధికశాతం ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. వాహనాలు నడిపేవారిలో 33 శాతం మందికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు అధికారులు తేల్చడం గమనార్హం.
మీరు వేగంగా నడిపినా .డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా,మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడిపినా అది మీ కుటుంబానికే కాదు..మీబారిన పడ్డవారికీ విషాదమే…
తల్లిదండ్రులు మైనర్లయిన పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి(పిల్లల )భవిష్యత్తు నాశనం చేయకూడదని మేన్ రోబో కోరుకుంటోంది.
ప్రజాప్రయోజనం దృష్ట్యా ….
Live accidents in Hyderabad – captured in cctv cameras
Government of India Ads…