ఒకప్పుడు గొడుగులు నలుపు రంగుతో ఎందుకు తయారు చేసారో తెలుసా? చిన్నారుల ప్రపంచం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

వర్షాకాలం రాగానే గొడుగులు బయటకు వచ్చేస్తాయి.పిల్లలను ఆకర్షించడానికి రంగురంగుల గొడుగులు బుల్లి బుల్లి గొడుగులు మార్కెట్ లోకి వచ్చేసాయి.అయితే వర్షం నుంచి మాత్రమే కాదు,ఎండ నుంచి కూడా రక్షణ ఇచ్చే గొడుగుల గురించి మనకు ఎంత వరకు తెలుసు?ఒకప్పుడు గొడుగులు నలుపు రంగుతో ఎందుకు తయారు చేసారో తెలుసా?ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుని మీ పిల్లలకు కూడా చెబితే వారికి ఒక అవగాహన,ఆసక్తి ఏర్పడుతాయి.
మనం నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువుల గురించి తెలుసుకోవాలి.పిల్లలు తెలుసుకునేలా చేయాలి.
సాధారణంగా గొడుగుల్ని వర్షం నుంచి తడవకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు.
ఒకప్పుడు గొడుగులు మందపాటి నేతవస్త్రంతో తయారుచేసేవారు. ఈ గొడుగులు వర్షంలో తడవడం వల్ల ఆరడానికి చాలా సమయం పట్టేది. తరవాత నలుపురంగు వస్త్రంతో గొడుగులు తయారుచేయడం వల్ల అవి త్వరగా పొడిగా అవుతాయని కనుగొన్నారు. దాంతో అప్పట్నించి నలుపురంగునే గొడుగుల తయారీలో ఉపయోగించడం పరిపాటైపోయింది.
లేతరంగుల కన్నా నలుపురంగు లేదా ఇతర ముదురు రంగులు పరిసరాల నుంచి ఎక్కువ ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. దాంతో బాష్పిబావన ప్రక్రియ వేగంగా జరిగి త్వరగా ఆరిపోతాయి. ప్రస్తుతం గొడుగులకు సింథటిక్ వస్త్రాలను విరివిరిగా వాడుతున్నారు. ఇవి నీటిని పీల్చుకొని. దాంతో త్వరగా ఆరతాయి. అందుకే ప్రస్తుతం గొడుగులు అన్ని రకాల రంగుల్లోనూ లభ్యమవుతున్నాయి.
మనం ఉపయోగించే వస్తువుల గురించి ,వాటి తయారీ లేదా వాటి చరిత్ర తెలుసుకోవడం పిల్లలకు తెలిసేలా చేయడం వాళ్ళ పిల్లల్లో చురుకుదనం కలుగుతుంది.కేవలం పుస్తకాల్లో పాఠాలే కాకుండా విజ్ఞ వినోదాల విశేషాలు పిల్ల మెదడును చురుకుగా ఉంచుతుందని మనం గ్రహించాలి.
ఇలాంటి విశేషాలు మీరు కూడా మేన్ రోబోలో ప్రచురణ కోసం మాకు రాసి పంపించవచ్చు…చీఫ్ ఎడిటర్

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY