HomeSerialsSerial3దుబాయ్ లా అండర్ గ్రౌండ్ వ్యాపకాలకు వ్యాపారాలకు క్రమంగా సేఫ్ ప్లేస్ అయ్యింది. ..స్మార్ట్ రైటర్...
దుబాయ్ లా అండర్ గ్రౌండ్ వ్యాపకాలకు వ్యాపారాలకు క్రమంగా సేఫ్ ప్లేస్ అయ్యింది. ..స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి (28-08-2016)
“అబుదాబికి కూతవేటు దూరంలో ఉంది సాదియత్ ఐలాండ్. పర్యాటకులకు స్వర్గాదామం. సాదియత్ ను దుబాయ్ లా తీర్చిదిద్దాలని అబుదాబి కంకణం కట్టుకుంది. పర్యాటకులను ఆకర్షించడానికి అనేక ప్యాకేజీలను ప్రకటించింది. అందులో భాగంగా ప్రైవేట్ సంస్థలను పెట్టుబడులకు ఆహ్వానించింది. ఇండియా నుండి ఇన్వెస్టర్స్ క్యూ కట్టారు. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. సాహు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు. వెహికల్ 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. అబుదాబి అనుకున్నట్టుగా సాదియత్ డెవలప్ అయ్యింది కాని… దుబాయ్ లా అండర్ గ్రౌండ్ వ్యాపకాలకు వ్యాపారాలకు క్రమంగా సేఫ్ ప్లేస్ అయ్యింది. మార్తాండ భూపతి సామ్రాజ్యం అక్కడే ఉంది. అతని ప్రధాన అనుచరులు అందరూ అక్కడే ఉంటారు. అతని ఆర్ధిక బలం అదే. అతనికి అంతకంటే సేఫ్ ప్లేస్ మరొకటి ఉండదు. అందుకే విదిశను అక్కడ దాచాడు. “విదిశను కిడ్నాప్ చేయడానికి కారణం ఏమిటి?” అంతవరకూ మౌనంగా వింటున్న హిమాంషు అడిగాడు “విదిశ అగస్త్య ప్రేమ గురించి అతనికి తెలుసు. విదిశను కిడ్నాప్ చేస్తే అగస్త్య తప్పకుండా తనని వెదుక్కుంటూ వస్తాడని కూడా తెలుసు” “అదేదో అగస్త్యనే టార్గెట్ చెయ్యొచ్చుగా. చుట్టు తిరిగి రావడం ఎందుకు?” “మొదట అదే ప్లాన్ చేశాడు. కాని అగస్త్య తప్పించుకున్నాడు. పైగా అగస్త్యకు ప్రాణం అంటే అస్సలు లెక్కలేదు. అగస్త్యను కిడ్నాప్ చేసినా ఏ మాత్రం ప్రయోజనం లేదని డిసైడ్ అయ్యాడు” మార్తాండ భూపతి తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు హిమాంషు. “అగస్త్య నుండి అతను ఏమి ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు” “ఆ విషయం నాకు పూర్తిగా తెలియదు. కాని నాగవల్లి గుడిలో అతనికి కావలసింది ఏదో ఉంది. అది సాధించడానికి అతను ఏ పనైనా చెయ్యడానికి రెడీ. అది అతని ప్రిస్టేజ్ కి సంబందించింది” సాహు వెహికల్ ఆపాడు. మాటల్లో పడి సిటి దగ్గరలో ఉన్న విషయం గమనించలేదు. “సాహు… ఏమైంది?” “మన ఫ్రండ్స్ సిటి లిమిట్స్ లో వెయిట్ చేస్తుంటారని నా డౌట్” “నిజమే… గుడ్ గెస్” మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు అగస్త్య “రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు… ఈ వెదవలు ఎప్పటికి వదులుతారో ఏమిటో” దీర్ఘం తీస్తూ అన్నాడు హిమాంషు. “ఖలీల్… సిటి ఎంటర్ కావడానికి ఆల్టర్ నేట్ రూట్ ఏదైనా ఉందా?” అడిగాడి సాహు (ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకు)
ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు… …చీఫ్ ఎడిటర్