HomeManrobo SpecialFeature4మానవత్వానికి అర్థం చెప్పిన పరదేశి? హ్యుమానిటీ హద్దులు చెరిపేసిన బహ్రెయిన్ ప్రధాని,… (నరేన్ బాబు ,మస్కట్...
మానవత్వానికి అర్థం చెప్పిన పరదేశి? హ్యుమానిటీ హద్దులు చెరిపేసిన బహ్రెయిన్ ప్రధాని,… (నరేన్ బాబు ,మస్కట్ (ఒమన్)నుంచి )
ఒడిశాకు చెందిన దనా మాఝీ భార్య శవాన్ని మోస్తూ పన్నెండు కిలోమీటర్లు నడిచాడు.ఈ ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది.మానవత్వాన్ని నిలదీసింది.మానవతను ప్రేమించేవారిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ విషాద ఘటన బహ్రెయిన్ రాజకుటుంబీకులను కదిలించింది…ఈ దృశ్యాన్ని చూసిన బహ్రెయిన్ ప్రధాని, రాజ కుటుంబీకుడు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బాధితుడి కుటుంబ వివరాల కోసం ఆరా తీశారు. బహ్రెయిన్‌లోని భారత రాయబారి నుంచి ఈ మేరకు సమాచారం కోరినట్టు బహ్రెయిన్ మీడియా వెల్లడించింది వ్యక్తిగత సాయానికి “నేను సైతం”అంటూ ముందుగా ముందుకు వచ్చారు. మనదేశం కాదు..తనదేశం మనిషికి కాదు..మానవత్వంతో ఓ మనిషికి సాయం చేయాలనుకునే అతని మానవతావాదానికి హేట్సాప్ చెప్పాల్సిందే. మస్కట్ నుంచి నరేన్ ఆంగ్లకథనం మేన్ రోబో ఇంగ్లీష్ వెర్షన్ లో చూడండి.