కొత్తదనాన్ని అన్వేషించే దర్సకనిర్మాతలకు ,సినీపరిశ్రమకు…
మేన్ రోబో పాటలతోట…ఒక వేదికగా,ఒక వారథిగా నిలుస్తుంది.
ఇది అక్షరస్వరం వినిపించే స్వరాల గళం …
స్వరానికి అక్షరాల అనువాదం…
స్వర సరస్వతికి కైమోడ్పు
ప్రతిభకు స్వరాభిషేకం….పాటకు పట్టాభిషేకం
పల్లవించిన పాటలతోటలో వికసించి వినిపించే చరణాల పరిమళాలు….
పద్మశ్రీ కలంలో ఊపిరిపోసుకున్న అక్షరాలు …
స్వరంలో సంగతులై వినిపించే పాటల పరవళ్లు.
ప్రతీవారం పాటతో పరిచయం
ప్రతీవారం స్వరంతో సంగమం .
తెలుగునాట గేయరచయిత్రులను,వర్తమాన గాయకులను పరిచయం చేసే ప్రయోగానికి శుభారంభం.
ఏ పాటనైనా రాయగలను…స్వరాలు సమకూర్చగలను పాడగలను…ఇది నా ఆత్మవిశ్వాసపు గుండెసవ్వడి.అవకాశాన్ని ఆహ్వానిస్తాను…ప్రతిభను నిరూపించుకుంటాను…పాట మాటను నిలబెడుతాను…అంటున్నారు పద్మశ్రీ
ఈ నేపథ్యంలో తాను రాసి స్వరపరిచిన ఒక పాటను మీకు అందిస్తున్నాం…వీడియోను కూడా మీరు చూడచ్చు.
ఒక చక్కటి లవ్ ఫీల్ సాంగ్ ..అమ్మాయి ప్రేమలో పడిందంటే ఆలోచనలన్నీ వింతపోకడలే కాదా..మరి అంతటి మనసు ఎంతటి తియ్యని అనుభూతికి లోనౌతుందో తెలియచెప్పేది ఈ పాటలోని మాధుర్యం…అంటున్నారు పద్మశ్రీ…
రచన,సంగీతం,గానం బుర్రా పద్మశ్రీ..
పల్లవి—మనసే మౌనగితం నేనే పాడనా,
నీ ఊసులే ప్రేమ కావ్యం నేనై రాయనా,
అందించనా ప్రేమ కానుకా
అర్పించనా నా మనసే నీకిక….(మనసే}
చరణం
నిన్నే తలుచుకుంటే మనసంతా కలవరింతా,
నీకై చేరువైతే ఒళ్ళంతా పులకరింతా,,2
రోజంతా నీ చింతై ఏమి తోచదాయే ..
రేయంతా కవ్వింతై ఎదో గుబులాయే..
ఎలా చెప్పనమ్మా…నీకెలా చెప్పనమ్మా…
వయసు చేసే అల్లరి పరువం పొంగెను పోకిరై (మనసే)
చరణం
మాటలన్నీ పేర్చి కూర్చి మంత్రమేదో వేసినావు..
వచ్చిరాని ప్రేమ భాష మత్తులోన ముంచివేసే..2
నువ్వొచ్చే దారిలోనా వెతికాయి నా కన్నులు,
గుండెల్లో గుబులు రేగి ఎరుపెక్కాయి బుగ్గలు
ఎలా చెప్పనమ్మా ..నీకెలా చెప్పనమ్మా…
వాటమైన వన్నెకాడు వయసు గిల్లీ వెళ్ళాడని..(మనసే}
పద్మశ్రీ పాడిన పాట..వీడియో
వచ్చేవారం మరో పాటతో మళ్ళీ పాటల తోటలోకి వచ్చేద్దాం