HomeSerialsSerial2ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుకున్నామో…. డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas వండర్ ఫుల్ రైటర్...
ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుకున్నామో…. డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి అక్షర కథనంతో… (04-09-2016)
ఫీడ్ బ్యాక్ డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారికి… సింప్లీ సూపర్బ్ సర్…. ఎన్నారై స్టోరీ అనగానే కేవలం మీ ఆటోబయోగ్రఫీ మాత్రమే అనుకున్నాం.కానీ ఒక వ్యక్తిత్వవికాసాన్ని మా కళ్లముందుంచారు.ప్రతీ ఒక్కరినీ మీదైనా ప్రపంచంలోకి తీసుకువెళ్లారు.మీ భావాలు ,భాష మీరు చెప్పిన విషయాలు..అద్భుతంగా వున్నాయి. “అమ్మ యశోదలా నా చెవి మెలిపెట్టలేదు కానీ…”అంటూ అమ్మ గురించి చెప్పిన సంగతులు… నేను అల్లరిలో చిన్ని కృష్ణుడినే… అలా అని నా పేరులో కృష్ణుడు ఉన్నంత మాత్రాన నేను అంతటి గొప్పవాడిని కాదు…అంటూ నిరాడంబరంగా,వినమ్రంగా మీరు చెప్పిన తీరు…ఎక్సలెంట్…. ఎందుకంటే బాల్యం తిరిగిరానిది…కాలంలా… అని ఒకే ఒక వాక్యంలో కాలం గురించి చెప్పారు.ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుకున్నామో…లెక్కేలేదు. ఆటలు పాటలు ఆకతాయి అల్లరి…ఎంత గొప్పగా ఉంటుంది?ఏమీ తెలియని అమాయకత్వం…ఎంతో తెలుసనుకునే ఆకతాయితనం. అన్న మీ మాటల్లో నిజాయితీని నిర్భయంగా చెప్పుకునే మంచితనం కనిపించింది. చదివే అలవాటు క్రమక్రమంగా కనుమరుగైపోతోన్న పరిస్థితిలో మీ సీరియల్ వాట్సాప్ లో ఎవరో షేర్ చేస్తే …చూసాను.హైద్రాబాద్ నుంచి బెంగుళూర్ వెళ్తూ కనీసం మూడ్నాలుగుసార్లు చదువుకున్నాను.వెంటనే వెనక్కి వెళ్లి గత సంచికలు తిరగేసాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీ కథనం చదివి నేను నా బాల్యంలోకి వెళ్ళిపోయాను.అమ్మచేతి దెబ్బలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.నా కొడుకును చిన్నప్పుడు మారాం చేస్తే కొట్టినప్పుడు,ఇప్పుడు నా మనవడిని కొడుతున్నప్పుడు… వెంటనే మా పెద్దాడికి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు అమెరికాతో అర్థరాత్రి అని తెలిసి కూడా…వాడి మోహంలో ఆనందం వాడి గొంతులో వినిపిస్తుంది. మీ ఫొటోస్ చూసాను.ప్రముఖులతో మీ పరిచయాలు చూసాను…చిన్నప్పటి గుర్తులు,కాలేజీ రోజుల్లో ,ఉద్యోగం వచ్చిన కొత్తలో… ప్రతీ ఛాయాచిత్రం మీ మంచిమనసును చెబుతుంది.మీరు మా ముందు వుండి మాట్లాడుతున్నట్టు వుంది. తారీఖులు దస్తావేజులు కాదు అన్నట్టు..ఏదో రాస్తున్నారు అని కాకుండా,మీ జీవితంలోని సంఘటనలు,అనుభవాలు,మాకు ఉపయోగపడే విధంగా.ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం చదువుతున్నట్టుగా రాస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అక్షరకథనాన్ని అందిస్తోన్న తేజారాణి తిరునగరిగారికి కృతఙ్ఞతలు. ఇలాంటి ఒక మంచి ప్రయత్నానికి వేదిక అయినా మేన్ రోబోకు మేము రుణపడి ఉంటాం. కానీ చిన్న లోటు..సీరియల్ కొద్దీ కొద్దిగా వేస్తున్నారు.వచ్చేవారం వరకూ ఆ కొద్దిపాటి సీరియల్ చదువుకోమనడం అన్యాయం కదూ… డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారితో ముఖాముఖీ పెడితే బావుంటుందని సూచన…ఆర్. హైమావతి (బెంగుళూర్ ) *కంగ్రాట్స్ డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారు…. మీ గురించి మా ఫ్రెండ్స్ చెప్పగా విన్నాను. మన తెలుగువాడు గొప్పగా డల్లాస్ లో ఎదిగిపోయాడు.వెలిగిపోతున్నాడు.చక్కని సంస్కారం మీ మాటల్లో కనిపిస్తుంది.మీ వ్యక్తిత్వం మీరు రాస్తోన్న సీరియల్ లో కనిపిస్తుంది.డల్లాస్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకోవచ్చా?అమెరికాకు వచ్చే ఫ్రెషర్స్ కోసం మీరు సూచనలు,సలహాలు ఈ సీరియల్ లో నేపథ్యంగా ఇస్తే బావుంటుందని మా సూచన. ఒక మంచి సీరియల్ కు అక్షర కథనాన్ని అందిస్తోన్న తేజారాణి తిరునగరిగారికి,,ప్రతిభ వున్నవారికి ప్రోత్సహిస్తోన్న మేన్ రోబోకు ధన్యవాదాలు…సాయిప్రకాష్(ముంబై) (3 ) యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం ఎప్పుడైతే ధర్మానికి హాని సంభవిస్తుందో అప్పుడు తాను అవతారం ఎత్తుతానని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మే స్వయంగా చెప్పాడు. దేవదేవుడి లీలావినోదాలు ఎన్నెన్ని… అన్ని లోకాలు శ్రీకృష్ణుడిలోనే ఉన్నాయి. ఆయన కాలి మువ్వలు పాతాళం,రసాతలం. ఆయన మోకాళ్ళ ప్రదేశం మహాతల లోకం. ఆయన హృదయం సురలోకం. ఆయన నాభి అనంతాకాశం. ఆయన శిరస్సు సత్యలోకం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ దైవలక్షణం కదా! అందుకే పూతనాది రాక్షసులను సంహరించాడు. కంసుణ్ణి హతమార్చాడు. యమునా నదీజలాలకు విష విముక్తి ప్రసాదించేందుకు, కాళీయుని కోరల్లోంచి వెలువడుతున్న విషం నుంచి పశుపక్ష్యాదులను రక్షించేందుకూ కాళీయమర్దనం చేశాడు. ఇందులోనే మరో సూక్ష్మరహస్యం కూడా ఉంది. మీరు కూడా దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయవచ్చు అని ఆ పరమాత్ముడి సూచన కూడా ఉంది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ మధ్య జరుగుతున్న విధ్వంసాలు చూస్తుంటే ఒక మనిషిగా నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తుందే అనే బాధ కలుగుతుంది.టెర్రరిస్టులు ,ఉగ్రవాద సంస్థలు,ఉన్మాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపితే, స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా మారణాయుధాలు చేపడుతున్నారు… ఈ విష సంస్కృతీ ఎక్కడికి దారితీస్తోందోమోనన్న భయం. ఎందుకిలా జరుగుతుంది?చిన్ననాడే వీళ్ళలో ఉన్మాదబీజం పెరగదు కదా?మొక్కలోనే ఈ విష భావాలను తుంచేయాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే సంస్కారాన్ని,మానవత్వాన్ని.మనుష్యులను ప్రేమించేతత్వాన్ని.అలవర్చాలి.పాఠ్యపుస్తకాల్లో తప్పనిసరిగా వీటిని చేర్చాలి. పత్రికల్లో మారణహోమం తాలూకు వార్తలు కనిపించని రోజు రావాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. మనం బావుంటే చాలు అనుకోవడం స్వార్థం..మన చుట్టూ వున్నవాళ్లు కూడా బావుండాలి అనుకోవడం జీవితసత్యం..అదే మానవజన్మకు పరమార్థం. ఇక నా బాల్యంలోని కొన్ని సంఘటనలు నా జీవితాన్ని కూడా ప్రభావితం చేసివుండొచ్చు.ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది. (జర్నీ లో చిన్న బ్రేక్..వచ్చేవారం వరకూ)
(ప్రవాస భారతీయులకు… ప్రవాస భారతీయుల నుంచి ఎన్నారై స్టోరీస్ ను ఆహ్వానిస్తున్నాం.మీ సక్సెస్ కథనాలు,మీ అనుభవాలు మేన్ రోబో పాఠకులతో షేర్ చేసుకుంటే సంతోషిస్తాం. అలాగే డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారి గురించి తెలిసిన మిత్రులు,అభిమానులు,సన్నిహితులు వారితో( డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారితో మీకు వున్న అనుబంధాన్ని కూడా తెలియజేయవచ్చు. ఈ ధారావాహిక ఒక స్ఫూర్తికథనంగా మారుతుందని ,అందుకు మీ స్పందన ఒక దిక్సూచిలా నిలుస్తుందని భావిస్తున్నాం …) ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్