అల్ ఫనర్ రెస్టారెంట్…
నాన్ వెజ్ లో అబుదాబిలోనే టాప్..
ఇండియన్ చెఫ్స్ తో అద్భుతమైన డిషెస్ తో క్వాలిటీకి పేరు పొందిన రెస్టారెంట్.
హోటల్ ఖలీల్ ఫ్రెండ్ ది కావడంతో టేబుల్ రిజర్వేషన్ చేసుకోకుండానే దొరికింది
అనుకున్న సమయానికి ఖచ్చితంగా వచ్చేశారు అగస్త్య అండ్ టీం.
***
ఖలీల్ రెస్టారెంట్ లో ఫేమస్ ఐటెం అరబిక్ రోటి తో చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు.
అందరూ నిశ్శబ్దంగా అగస్త్య వైపు చూస్తున్నారు. అగస్త్య ఏమి ప్లాన్ చేస్తాడో టెన్షన్ గా ఉంది.
టైం సెన్స్ ఉన్న వాళ్ళు కావడంతో ఈ అసైన్ మెంట్ త్వరగా కంప్లీట్ చెయ్యాలన్న ఎగ్జైట్ మెంట్ ప్రతి ఒక్కరి ఫేస్ లో కనపడుతోంది
అగస్త్య ఏదో చెప్పబోతున్నంతలో ఆ టేబుల్ ను సమీపిస్తుండడంతో ఒక్కసారిగా అందరూ అలెర్ట్ అయ్యారు.
సాహు చేయి నెమ్మదిగా ప్యాంటు పాకెట్ లో ఉన్న నైఫ్ ను తాకింది.
సడన్ ఎటాక్స్ తో అనుభవం ఉండడం వల్ల నిద్రలో కూడా టెన్షన్ లేకుండా ఆపదలను ఎదుర్కునే సెన్స్ అబ్బింది అందరికి.
ఎటాక్ లో ముందు ఎవరి రెస్పాన్స్ ఉంటుందో వాళ్ళదే పైచేయి. క్షణంలో నూరో వంతు లేట్ ఐతే చాలు, అదృష్టం మొహం చాటేస్తుంది,
సాహు కదలికలను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న అగస్త్య షార్ప్ గా కదిలి అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు
హిమాంషుతో సహా అక్కడ ఉన్నవారు అగస్త్య ప్రవర్తనకు తెల్లబోయారు.
ఇంతలో ఒక వ్యక్తి టేబుల్ వద్దకు వచ్చాడు.
అతణ్ణి చూసి అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు
నందనవర్మ…
“సర్… మీరా… వాట్ ఏ సర్ ప్రైజ్?”
అగస్త్య ఎందుకు తనను ఆపాడో సాహుకు అర్థం అయ్యింది. నందనవర్మగారి రాక అగస్త్యకు తెలుసు.
ఇంతవరకు తమతోనే ఉన్న అగస్త్యకు విషయం ఎలా తెలిసందనేదే అర్థం కాని విషయం…
“అవునయ్యా… నాకు రాక తప్పలేదు. మీ ప్రోగ్రెస్ బాగుంది కాని చాలా ఆలస్యం అవుతోంది. వి డోంట్ హావ్ ఎనఫ్ టైం నౌ”
నందనవర్మగారి మాటలకు అక్కడున్నవారు అంగీకరించారు.
“అగస్త్య… వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ స్టెప్” అడిగారు నందనవర్మ
“సర్… అల్ ఫనర్ రెస్టారెంట్ బ్రాంచ్ ఫనర్ రెస్టారెంట్ సాదియత్ లో ఉంది. అక్కడకు చాలా మంది వస్తారు. మన టార్గెట్ కు సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది”
“మనకు కావలసిన మనుషులని నేను గుర్తుపట్టగలను” అంతవరకు మౌనంగా ఉన్న సత్యమూర్తి అందుకున్నాడు
సత్యమూర్తి గురించి అగస్త్య నందనవర్మ గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్యడం వల్ల అతణ్ణి గుర్తుపట్టడం కష్టం కాలేదు.
“ఫనర్ లో ఆల్రెడీ సూట్స్ బుక్ చేయించాను. వెంటనే బయలుదేరండి. ఐ విల్ మీట్ యు దేర్ గయ్స్” అంటూ నందనవర్మ సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయారు
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకు)
ఈ సీరియల్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
జీవితంలో అన్నింటినీ,అందరినీ కోల్పోయిన అతనికి…మనసు కోరుకునే సాన్నిహిత్యం. శరీరం కోరుకునే సాంగత్యం…వెరసి ఓ సెక్యూర్డ్ ఫీలింగ్….విజయార్కె కథ విభ్రమ
http://manrobo.com/?p=646
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…
…చీఫ్ ఎడిటర్