HomeSerialsSerial2మీ అమ్మగారి గురించి చెబుతుంటే చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన మా అమ్మ గుర్తొచ్చి కన్నీళ్లు వచ్చాయి....
మీ అమ్మగారి గురించి చెబుతుంటే చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన మా అమ్మ గుర్తొచ్చి కన్నీళ్లు వచ్చాయి. డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి అక్షర కథనంతో(11-09-2016)
ఫీడ్ బ్యాక్ పుట్టపర్తి గారికి “సర్ మీ ఆటో బయోగ్రఫీ చదువుతుంటే (నాదృష్టిలో ఇది ఆటో బయోగ్రఫీ కాదు…యువతను ముందుకు నడిపించే వ్యక్తిత్వ వికాసరచన అని నా ఉద్దేశం) నలభయ్యేళ్ళు వెనక్కి వెళ్ళాను.మీ గురించి చదువుతుంటే మీరు మా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టు అనిపించింది.ఇంత బిజీ షెడ్యూల్ల్లో కూడా మీరు మీ భావాలు,అనుభవాలు మాతో షేర్ చేసుకోవడం బావుంది. యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం గీతాసారాన్ని చెప్పిన కృష్ణులే మీరు.బాల్యం గురించి,అలానే మీ అమ్మగారి గురించి చెబుతుంటే చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన మా అమ్మ గుర్తొచ్చి కన్నీళ్లు వచ్చాయి.థాంక్యూ సర్..మీ అక్షరాలు మీ అనుభవాలు మాకు వెలుగునిచ్చే వెలుగురేఖలు కావాలి. అక్షరకథనాన్ని అందిస్తోన్న తేజారాణి తిరునగరిగారికి…ఇలాంటి గొప్ప ధారావాహికను ప్రయోగాత్మకంగా మాకు ,సమస్త పాఠకలోకానికి అందిస్తోన్న మేన్ రోబోకు సదా కృతఙ్ఞులం..సోమశేఖరం (విశ్రాంత ఉపాథ్యాయులు) వారణాసి (4) ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది.కాలం వేగంగా వెళ్లిందా? అనిపిస్తుంది..కానీ ఒక్కటి మాత్రం నిజం అనిపిస్తుంది.సంతోషంగా,సంతృప్తిగా వున్నపుడు సమయం తెలియదు.కాలం యిట్టె గడిచిపోయినట్టు అనిపిస్తుంది.పనిలో వున్నప్పుడు కూడా సమయం తెలియదు. మనం చేసేపని మనకు తృప్తిని ఇవ్వాలి.ఆత్మసంతృప్తిని కలిగించాలి.
గతకొద్దిరోజులుగా విపరీతమైన పనిఒత్తిడి .మనం చేసేపని నిరంతరం ప్రవహించే సెలయేరులాంటిది.పనిచేస్తున్నప్పుడు సంతృప్తి అనే ప్రవాహం తేటగా ఉంటుంది. ఒకసారి కాలాన్ని వెనక్కి తిప్పి చూసుకుంటే నా విద్యాభ్యాసం మాములూగానే సాగింది.నేనో సాధారణ సగటు విద్యార్థిని. 1976 లో బీఎస్సీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. క్రికెట్ అంటే ఆసక్తి.ఇప్పటికీ క్రికెట్ అంటే చాలా మందికి క్రేజ్ వుంది. పేరెంట్స్ పిల్లలను చదివించే విషయంలోనే కాదు..ఆటపాటల్లోని పిల్లల ఆసక్తి అభిరుచి వారికీ ఏ రంగంలో ప్రావీణ్యం ఉందొ తెలుసుకునే ప్రయత్నం చేస్తే పిల్లల భవిష్యత్తుకు మంచి ఫలితాలు లభిస్తాయని నా వ్యక్తిగత అభిప్రాయం. మనలో సచిన్ లు వున్నారు..ధోనీలు వున్నారు..గవాస్కర్ కపిల్ దేవ్ లు ఉన్నారు.అయితే చిన్నారులలోని టాలెంట్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. చదువుకోవడం తప్పనిసరి.ప్రతీ వ్యక్తి విద్యాధికుడు కావాలి.విజ్ఞానాన్ని సముపార్జించాలి.అదే సమయంలో మనలోని కళలను కలలను బ్రతికించుకోవాలి.చదువు మాత్రమే పరమావధిగా భావించకూడదు అన్నది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే గాయకులు నటులు వ్యాపారవేత్తలు శాస్త్రజ్ఞులు రచయితలు ఇలా వివిధరంగాల్లోని ప్రముఖులు మనకు ఆదర్శంగా వున్నారు. నావరకు నాకు చదువుతోపాటు క్రికెట్ తో పాటు వీడియోగ్రఫీ కూడా ఇష్టమే.చిన్ని కెమెరాతో ఎన్నెన్నో ప్రయోగాలు చేసేవాడిని.నాన్న తన పనిలో బిజీ.అమ్మ ఒక సాధారణ గృహిణి నేనేరోజూ ప్రైవేట్ ట్యూషన్ కు వెళ్ళలేదు.స్కూల్ లో చెప్పింది…నేను చదువుకున్నది..మాత్రమే.నాకు సైన్స్ పట్ల ఆసక్తి.ఆ ఆసక్తే నన్ను బీఎస్సీ ( బయాలజీ ,కెమిస్ట్రీ )చదివేలా చేసింది. బీఎస్సీ అయిపోగానే ఏం చేయాలి? (జర్నీలో చిన్న బ్రేక్) (ప్రవాస భారతీయులకు… ప్రవాస భారతీయుల నుంచి ఎన్నారై స్టోరీస్ ను ఆహ్వానిస్తున్నాం.మీ సక్సెస్ కథనాలు,మీ అనుభవాలు మేన్ రోబో పాఠకులతో షేర్ చేసుకుంటే సంతోషిస్తాం. అలాగే డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారి గురించి తెలిసిన మిత్రులు,అభిమానులు,సన్నిహితులు వారితో( డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారితో మీకు వున్న అనుబంధాన్ని కూడా తెలియజేయవచ్చు. ఈ ధారావాహిక ఒక స్ఫూర్తికథనంగా మారుతుందని ,అందుకు మీ స్పందన ఒక దిక్సూచిలా నిలుస్తుందని భావిస్తున్నాం …)
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్