సృష్టిలోని అందాలను అక్షరాల్లోకి అనువదిస్తే పద్మశ్రీ పల్లవీచరణాల అక్షర పరిమళాల పాటలతోటలో …(11-09-2016)

కొత్తదనాన్ని అన్వేషించే దర్సకనిర్మాతలకు ,సినీపరిశ్రమకు…
మేన్ రోబో పాటలతోట…ఒక వేదికగా,ఒక వారథిగా నిలుస్తుంది.
ఇది అక్షరస్వరం వినిపించే స్వరాల గళం …
స్వరానికి అక్షరాల అనువాదం…
స్వర సరస్వతికి కైమోడ్పు
ప్రతిభకు స్వరాభిషేకం….పాటకు పట్టాభిషేకం
సృష్టిలోని అందాలను అక్షరాల్లోకి అనువదిస్తే పద్మశ్రీ పల్లవీచరణాలఅక్షర పరిమళాలు ఈ వారం మీకోసం.
పల్లవి
అందమైన లోకం,అమ్మప్రేమ పాశం 
తియ్యనైన స్నేహం,తొలిప్రేమ మొహం,
ఎవ్వ్వరికి మర్చిపోనిది అది ఎప్పటికి వీడిపోనిది...
హొయ్ హొయ్ హొయ్........(అందమైన)

చరణం 
ఊహలకు రెక్కలు వస్తే ఊపిరి పొయ్యాలి,
కనులకు కలలే వస్తే కలనిజం చెయ్యాలి.
ఆహా హా ...ఎహే హే.....2..
పుడమి తల్లి పంచన చేరి ప్రగతి బాట వెయ్యాలి,
ఆకాశం అంచులు దాటే కీర్తి మనమే చాటాలి..
ప్రశాంత ఏకాంతం అందరికి కావాలి,
గుప్పెడంత ఆనందం గుండెసొంతమవ్వాలి..
హొయ్ .........(అందమైన)

చరణం 
రాగమే ఆలాపిస్తే వాగులై సాగాలి,
నడకకు గతులే చేర్చి నాట్యమే చెయ్యాలి.
ఆహా హా....ఏహే హే.....2
పాట మాధుర్యానికి కోయిలమ్మ కూయాలి,
పొంగుచున్న ఆశలన్నీ పురివిప్పి ఆడాలి,
చికు,చింత లేని లోకం మనసొంత మవ్వాలి
నామాల శ్రీనివాసు చల్లంగా చూడాలి..
హొయ్...........(అందమైనలోకం)

గత సంచికలోని
మనసే మౌనగితం నేనే పాడనా,
నీ ఊసులే ప్రేమ కావ్యం నేనై రాయనా,
పాట తాలూకు వీడియో ఇది.

ఈ పాటమీద మీ విలువైన మాట/కామెంట్ మాకు పేస్ బుక్ /ట్విట్టర్ /మెయిల్/ ద్వారా పంపించవచ్చు.షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY