ఫనర్…
ప్రపంచంలోని ఆధునికతను రంగరించి ఓకే చోట చేరిస్తే అది ఫనర్.
ఇది ఉంది… ఇది లేదు అన్నది లేకుండా ప్రతిదీ అందుబాటులో ఉంటుంది… అక్కడ కావలసింది డబ్బు మాత్రమే…
రోజుకు కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటుంది.
నమ్మకం మీదే లక్షల వ్యాపారం… మోసానికి తావు లేదు
బలం ఉన్నవాడితే రాజ్యం. తెలివి ఉన్నవాడిదే డబ్బు…
ఏ మూల ఏం జరిగినా న్యూస్ ముందుగా తెలిసేది ఫనర్ లో.
ఫనర్ లో నందనవర్మగారి నమ్మకమైన నెట్ వర్క్ ఉంది.
ఫైజల్…
సర్వర్ గా చేరి తన నెట్ వర్క్ ను బాగా విస్తరించుకున్నాడు.
ఫైజల్ తన మనుషులను అలెర్ట్ చేసి నందనవర్మ గారికి కావలసిన కట్టుదిట్టాలు చేయించాడు.
సాయంత్రం 6 గంటలు కావస్తోంది.
మిడ్ సమ్మర్ కావడం వల్ల సాయంత్రం నాలుగు అయినట్టు ఉంది వాతావరణం.
ఎండ మండిపోతోంది..
హిమాంషు సాహుతో కలసి ఫనర్ లోకి ఎంటర్ అయ్యాడు.
డజన్ కళ్ళు వాళ్ళవైపు తీక్షణంగా చూశాయి…
హిమాంషు అవేమి పట్టించుకోకుండా వెళ్లి దగ్గరలో ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నాడు.
సాహు హోటల్ మొత్తం కను చివరల గమనించుకుంటూ మెల్లగా అతని ఎదురుగా కూర్చున్నాడు.
సరిగ్గా 5 నిముషాల తరువాత ఖలీల్ ఎంటర్ అయ్యాడు. అప్పటివరకు అనుమానించదగ్గ సంఘటనలు ఏమీ జరగలేదు.
అగస్త్య తన వేషం మార్చుకుని అర్థగంట తరువాత ఎంటర్ అయ్యాడు.
బాగా డబ్బున్న వాడిలా.. ఖర్చు పెట్టే స్థోమత ఉన్నట్టు… ఆ ప్రదేశంలో కొత్తగా ఎంటర్ అయినట్టు కవర్ చేస్తూ వెళ్లి బార్ టేబుల్ వద్ద కూర్చున్నాడు.
కొన్ని నిముషాలలోనే అతనికి కావలసిన ఎఫెక్ట్ వచ్చేసింది…
డబ్బు ఉండీ ఎలా ఖర్చు చెయ్యాలో తెలియని వారిని బుట్టలో వేసి మొత్తం ఖాళీ చేసి పంపడంలో భూపతి గ్యాంగ్ ను మించిన వారు లేరు.
ఆ విషయం తెలిసీ వాళ్ళకు తగ్గట్టుగా రెడీ అయ్యి వచ్చాడు అగస్త్య.
“రెండు చివాస్ రీగల్ లార్జ్” అంటూ అతని ప్రక్కనే కూర్చున్నాడు వస్తాదులా ఉన్న వ్యక్తి.
తన కళ్ళలోని బెదురుని జాగ్రత్తగా మెయిన్ టైన్ చేస్తూ అతణ్ణి చూసి పలకరింపుగా నవ్వాడు అగస్త్య.
“బ్రో… కొత్తగా వచ్చావా?”
“అవును.” తన పాకెట్ ను తడుముకుంటూ అన్నాడు అగస్త్య.
“డోంట్ వర్రీ… ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉండదు. అంతా మనోళ్ళే.. మనకు తెలీకుండా ఏమీ జరగదు”
అతణ్ణి చూసి రిలీఫ్ అయినట్టు మొహం పెడుతూ నవ్వాడు అగస్త్య.
“ఇంతకూ ఏమి చేస్తావు?”
“డైమెండ్ బిజినెస్… అంతా ఏ గ్రేడ్”
“దుబాయ్ లో బ్రాంచ్ ఓపెన్ చేద్దామని వచ్చాను” అతను అడగకపోయినా చెప్పాడు అగస్త్య
“గుడ్. మనది అదే బిజినెస్… నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇంతకూ ఎక్కడ దిగావు”
“బుర్జ్ ఖలీఫా”
***
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకూ )
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్