HomeSerialsSerial2చరిత్రలో మిగిలిపోవడం వేరు…మనమే చరిత్రగా నిలిచిపోవడం వేరు….డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas వండర్...
చరిత్రలో మిగిలిపోవడం వేరు…మనమే చరిత్రగా నిలిచిపోవడం వేరు….డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి అక్షర కథనంతో(18-09-2016)
(23 మార్చి 1957 మాయాబజార్ విడుదలైంది.అదే రోజున డాక్టర్ కృష్ణపుట్టపర్తి జన్మించారు. 59 నుంచి అరవైలోకి ప్రవేశించిన మాయాబజార్ ప్రపంచ సినీ చరిత్రలోనే అద్భుత చిత్రం . ఈ నేపథ్యంలో మాయాబజార్ ను స్మరించుకుంటూ,ఈ అధ్యాయాన్ని మాయాబజార్ చిత్రానికి అంకితం చేయడం సముచితం…సందర్భోచితం అని భావిస్తున్నాం…చీఫ్ ఎడిటర్) ఫీడ్ బ్యాక్ *ఒక అద్భుతమైన వ్యక్తిత్వవికాస రచనను అందిస్తూ సరికొత్త ప్రయోగానికి నాంది పలికిన మేన్ రోబోకు డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారికి,రచయిత్రి తేజారాణి గారికి కృతఙ్ఞతలు …ఆర్.సువర్ణ.దినేష్,సుందర్ (విజయవాడ) *డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారూ..మీ జ్ఞాపకాలు మాకు వ్యక్తిత్వవికాస పాఠాలు .థాంక్యూ సర్ ,థాంక్యూ తేజారాణి గారూ…టి.వేదవతి.కౌసల్య(కాకినాడ) చరిత్రలో కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి. చరిత్రలో మిగిలిపోవడం వేరు…మనమే చరిత్రగా నిలిచిపోవడం వేరు. 23 మార్చి 1957 మాయాబజార్ మహత్తర చిత్రం చిత్రం అశేష ప్రేక్షకుల ముంగిట నిలిచినరోజు.మాయాబజార్ చిత్రం విడుదలైన రోజు. చలనచిత్రచరిత్రలో వెండితెరకావ్యం అజరామర చిత్రరాజం మాయాబజార్. పేరులోనే మాయ వుంది.పేరులోనే మహత్తు వుంది.అతిరథ మహారథుల కలయికలో నభూతోనభవిష్యత్తి స్థాయిలో చలనచిత్రకారులకు ఒక పాఠ్యగ్రంథంగా నిలిచిన చిత్రం. 59 దాటి అరవైలోకి వచ్చినా ఇంకా నిత్యనూతనంగా ప్రేక్షకులను సమ్మోహనపరుస్తూనే వుంది. ఆ చిత్రంలో సీనియర్ సముద్రాలవారు మాటలు పుట్టించకపోతే ఎలా పుడతాయిరా..అని ఓ పాత్రచేత చెప్పిస్తారు…ఎంత గొప్ప మాట.తల్పం గిల్పం లాంటి మాటలేనా…?అసమదీయులు తసమదీయులు అంటూ…కొత్త పదాల సృష్టి అద్వితీయం. పాండవులు ఎక్కడ కనిపించకపోయినా చిత్రమంతా వారు వున్నట్టే ఉంటుంది. ఎన్ఠీఆర్ ,ఏఎన్నార్, యస్వీఆర్ సావిత్రి గుమ్మడి ఛాయాదేవి సూర్యకాంతమ్మ ఒకరా ఇద్దరా..అందరూ హేమాహేమీలే… అందులో ఆ పాత్రలకు జీవంపోసిన మహానటులు నేడు మన మధ్య భౌతికంగా లేకపోయినా వారి నటన ఇంకా బ్రతికే వుంది.వారికీర్తి బ్రతికే వుంది.వారి కీర్తిప్రతిష్టలు బ్రతికే వున్నాయి. అందుకే మనం శాశ్వతం కాదు మనం సాధించిన గెలుపు,మన వ్యక్తిత్వం,మనప్రతిభ..మనం సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంచితనమే మనకు ప్రామాణికం. ఆ అద్భుతఘటనకు కాలమే సాక్షి.ఆ కాలంలోనే ..ఆ రోజునే నేను పుడమితల్లి ఒడిలోనే నేను పడ్డం నా అదృష్టంకాక మరేమిటి? 23 మార్చి 1957 రోజున పుట్టాను.ఆ మహత్తరచిత్రం విడుదలైన రోజు,నేను పుట్టినరోజు యాదృశ్చికంగా ఒక్కటే కావడం నా అదృష్టం. బహుశా ఆ కారణంగానే కాబోలు నాకు సినిమాలు అంటే మిక్కిలిమక్కువ ఏర్పడింది.నటన అంటే పాషన్…పూర్వపు అధ్యాయంలో చెప్పుకున్నట్టు నాదగ్గర వున్న వీడియో కెమెరాతో ఎన్నోసర్కస్ ఫీట్స్ చేశాను.కొంతమంది మిత్రులు అంటూ వుంటారు. “మాయాబజార్ లాంటి గొప్పచిత్రం విడుదలైనరోజున పుట్టావు కాబట్టి నీకు సినిమాలు అంటే ఆసక్తి పెరిగిందని..” ఇప్పటికీ మనదేశం నుంచి డల్లాస్ కు వచ్చిన సినీ ప్రముఖులను కలుస్తున్నప్పుడు సన్నటికన్నిటితో మెరిసే కించిత్ గర్వం నా కళ్ళలో ఉంటుంది కాబోలు. అక్కినేని .గానగంధర్వుడు బాలు,కళాతపస్వి విశ్వనాథ్ ,విశ్వనటుడు కమల్ హాసన్..ఎందరో ఎందరెందరో మహామహుల సాన్నిహిత్యం పరిచయభాగ్యం నా సుకృతం…. ఆ మహామహులనుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను.నిరాండంబరంగా ఉండడం,జీరో స్థాయినుంచి నంబర్ వన్ స్థాయికి ఎదగడం,ఎదిగేకొద్దీ ఒదిగివుండడం …కృషితో నిరంతరసాధనతో జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం…ఇవి ప్రతీ మనిషికి అవసరమైన వ్యక్తిత్వవికాస పాఠాలుగా పనికివస్తాయి. ఏ జన్మ రుణానుబంధంలో నాకు చలనచిత్ర పరిశ్రమతో ,ప్రముఖులతో అనుబంధం ఏర్పడింది.వారిమైత్రీ బంధానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. మాయాబజార్ లాంటి మరుపురాని చిత్రం గురించి చెప్పుకునే అదృష్టం కలిగింది.ధన్యోస్మి
(జర్నీలో చిన్న బ్రేక్) (ప్రవాస భారతీయులకు… ప్రవాస భారతీయుల నుంచి ఎన్నారై స్టోరీస్ ను ఆహ్వానిస్తున్నాం.మీ సక్సెస్ కథనాలు,మీ అనుభవాలు మేన్ రోబో పాఠకులతో షేర్ చేసుకుంటే సంతోషిస్తాం. అలాగే డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారి గురించి తెలిసిన మిత్రులు,అభిమానులు,సన్నిహితులు వారితో( డాక్టర్ కృష్ణ పుట్టపర్తిగారితో మీకు వున్న అనుబంధాన్ని కూడా తెలియజేయవచ్చు. ఈ ధారావాహిక ఒక స్ఫూర్తికథనంగా మారుతుందని ,అందుకు మీ స్పందన ఒక దిక్సూచిలా నిలుస్తుందని భావిస్తున్నాం …)
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్