అగస్త్య కంట్రోల్ లో లేడన్న విషయం మరునిముషంలో అర్థం అయ్యింది…స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి (18-09-2016)

“వెయిటర్… మా దోస్త్ కు ఎంత కావాలంటే అంత మందు సప్లై చెయ్యి. బిల్ నేను పే చేస్తాను” హుషారుగా అన్నాడు.
అగస్త్య టేబుల్ కి కాస్త దూరంగా హిమాంషు, సాహులు కూర్చున్నారు. బ్లూ లేబెల్ విస్కీ బాటల్ నెమ్మదిగా ఖాళీ అవుతోంది.
సాహు, హిమాంషు ఒకప్రక్క తాగుతున్నా కాన్సంట్రేషన్ మాత్రం అగస్త్య టేబుల్ పైనే ఉంది.
సమయం సాయంత్రం 7 గంటలు
మూడు రౌండ్స్ కంప్లీట్ అయ్యింది.
అగస్త్య ఎక్కువగా తాగినట్టు తూలడం ప్రారంభించాడు.
అనుకున్న ప్లాన్ చక్కగా సాగుతుండడంతో ఖలీల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
“బ్రో! అర్ యు ఓకే?” భుజం పట్టి కుదుపుతూ అడిగాడు అగస్త్యకు మందు పోయించిన వ్యక్తి.
బలవంతంగా కనురెప్పలు తెరుస్తూ మెల్లగా నవ్వాడు అగస్త్య
“ఐ యాం అండర్ కంట్రోల్ బ్రో. ఏమీ పరవాలేదు. మరో రౌండ్ కి నేను రెడీ” మాటలు ముద్దముద్దగా వస్తుంటే టేబుల్ పై తల వాలుస్తూ అన్నాడు అగస్త్య
“నో బ్రో… ఇప్పటికే చాలా ఎక్కువ ఐనట్టు ఉంది. కావాలంటే ఒక బాటిల్ రూమ్ కి పట్టుకు వెళదాం.. ఓకే నా!” అగస్త్యను గమనిస్తూ అన్నాడు ఆ వ్యక్తి
“నో… నాకు ఇప్పుడే కావాలి” మొండికేస్తూ అన్నాడు అగస్త్య
“వద్దు బ్రో… కావాలంటే కార్ లో తాగొచ్చు. ఇంతకూ నీ రూమ్ నెంబర్ ఎంత?”
“ఏ రూమ్ నెంబర్?” అర్థం కానట్టు అడిగాడు అగస్త్య
“బుర్జ్ ఖలీఫాలో నువ్వు దిగిన సూట్ నెంబర్”
“బుర్జ్ ఖాలీఫానా.. అంటే” అర్థంకానట్టు అడిగాడు అగస్త్య
ఒక్కసారి తెల్లబోయాడు ఆ వ్యక్తి
అగస్త్య కంట్రోల్ లో లేడన్న విషయం మరునిముషంలో అర్థం అయ్యింది
”బ్రో… ఇఫ్ యు డోంట్ మైండ్, నా రూమ్ కి వెళదామా?”
“నో… నో… నా వద్ద ఉన్న డైమెండ్స్ చాలా విలువైనవి. నేను ఎక్కడకూ రాను…” మొండిగా అన్నాడు అగస్త్య
“మరి… ఎక్కడ ఉంటావు.. నీ రూమ్ నెంబర్ గుర్తు లేదు కదా”
“ఏ రూమ్?” తిరిగి ప్రశ్నించాడు అగస్త్య
అగస్త్య పరిస్థితి అతనికి క్లియర్ గా అర్థం అయ్యింది
“ఓకే బ్రో… నన్ను ఎక్కడైనా డ్రాప్ చెయ్యమంటావా?”
“హా… థాంక్స్. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు. కాని నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తావు?”
“నీ రూమ్ లోనే” నోటికి వచ్చిన మాట టక్కున అన్నాడు
“సరే… పద పోదాం” అంటూ లేచి నిలబడబోయాడు అగస్త్య. బాలన్స్ కుదరక చైర్ లో కూలబడ్డాడు
బిల్ పే చేసి అగస్త్యను చేత్తో బాలన్స్ చేస్తూ దూరంగా ఉన్న తన గ్యాంగ్ కి సైగ చేశాడు.
అంతవరకూ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న హిమాంషు, సాహు కళ్ళకు అతని సైగ చక్కగా కనిపించింది.
అప్పటికే బిల్ పే చేసిన సాహు అగస్త్య కన్నా ముందుగా పార్కింగ్ లాట్ చేరాడు.
“అటాక్ కన్నా ఫాలోయింగ్ బెటర్ బ్రో, ఏమంటావు?” కార్ పార్కింగ్ వద్ద ఉన్న పిల్లర్ వద్ద షాడోను కవర్ చేసుకుంటూ అన్నాడు సాహు
“అదే నేను అనుకుంటున్నా బ్రో… అప్పుడే మనకు కీ ఏరియా తెలుస్తుంది” చూపును లిఫ్ట్ పై నుండి తిప్పకుండా అన్నాడు హిమాంషు
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకూ )
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY