జర్నలిజం అంతే నిజాన్ని స్కాన్ చేయడం…జర్నలిస్ట్ గా ఒక జ్ఞాపకం.

?????????????
వార్తాకథనంలో అతిశయోక్తులకు తావులేదు.
రచయితకు వుండే స్వేచ్ఛ జర్నలిస్ట్ కు ఉండదు.రచయిత తనదైన కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు.పాత్రలను పరకాయ ప్రవేశం చేయించవచ్చు.రంగురంగుల ప్రపంచంలో రచన విహరిస్తోంది.
జర్నలిజం అలా కాదు..ఒక వార్త రాయాలన్న.ఒక ఇంటర్ వ్యూ చేయాలన్న దాని తాలూకూనేపథ్యం తెలుసుకోవాలి.స్టడీ చేయాలి.ప్రశ్నలు స్పష్టంగా ఉండాలి.అవతలి వ్యక్తి నుంచి సమాధానాలు రాబట్టాలి.
జర్నలిస్టుగా 1990 ప్రాంతంలో నక్సల్స్ హిట్ లిస్ట్ లో వున్న ఎస్పీ మీనాను “హారిక” పత్రిక కోసం ఆ ఇంటర్ వ్యూ చేశాను.నిజామాబాదు లో వుండే పాత్రికేయ మిత్రుడు,స్థానిక పొద్దు దినపత్రిక సంపాదకులు బైస రామదాసు సాయంతో ఎస్పీ మీనా ను కలిసాను.
ఎస్పీ మీనా హయాంలో జరిగిన పన్నెండు ఎన్కౌంటర్స్ లో మొత్తం ఇరవైఆరు మంది చనిపోయారు.అందులో ఒక మహిళా,ఇద్దరు కానిస్టేబుల్స్ వున్నారు.
పీపుల్స్ వార్ కు ఎస్పీ మీనాకు మధ్య వార్ జరుగుతుంది.మిగితా ఇంటర్ వ్యూస్ కు దీనికి తేడా వుంది.ఒక ప్రముఖమైన వ్యక్తి ని ఇంటర్పూ వ్యూ చేస్తున్నామంటే ఆ వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలి.
ఎప్పుడెప్పుడు ఎన్కౌంటర్ జరిగింది?అందులో ఎవరి ప్రమేయం ఎంత వరకు వుంది?అన్న విషయాలు నిర్ధారణ చేసుకోవాలి.
ఏ ఒక్కర్నీ డిఫెండ్ చేయకుండా వాస్తవాలను ఇంటర్ వ్యూ ద్వారా రాబట్టాలి.
నిజామాబాద్ కు ప్యాసింజర్ రైలులో వెళ్ళాను.ఇంటర్ వ్యూ జరుగుతున్నంత సేపు గన్ మెన్లు ఎలర్ట్ గా వున్నారు.ఆ ఇంటర్ వ్యూలో నక్సల్స్ చర్యలను ఘాటుగా విమర్శించారు ఎస్పీ మీనా.
ఆ ఇంటర్ వ్యూ సంచలనం సృష్టించింది.
అయితే నాణేనికి మరోవైపు కూడా చూడాలని..పీపుల్స్ వార్ విధానాల గురించి పొరహక్కుల సంఘం నాయకులు,ప్రముఖ న్యాయవాది కన్నాభిరాన్ గారిని కూడా ఇంటర్ వ్యూ చేశాను.
కానీ ఆ ఇంటర్ వ్యూ చేసిన సంచిక మార్కెట్ లోకి రాకముందే ఆ పత్రిక ఆగిపోయింది.
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY