బుక్ రివ్యూ …
కిడ్నాపర్లున్నారు జాగ్రత్త…బాబూ వికాస్ నువ్వెక్కడ ?
ఇప్పటికీ కిడాప్ వార్తలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూనే వున్నాయి,కిడ్నాప్ ల పట్ల ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి…కిడ్నాపర్లు కదలికలు గమనించాలి.కొన్ని జాగ్రత్తలతో కిడ్నాప్ లకు చెక్ చెప్పొచ్చు..కిడ్నాపర్స్ గుట్టురట్టు చేయాలన్నా.కిడ్నాపర్స్ ఆనుపానులు తెలుసుకోవాలన్నా కొన్ని టిప్స్ ఫాలో కావాలి.
ఆ విషయాలను ఈ పుస్తకంలో చాలావరకూ చర్చించడం జరిగింది..అంతేకాదు…కుటుంబంలో ఒకవ్యక్తి కిడ్నాప్ కు గురైతే ఆ కుటుంబం పడే బాధను ట్రూ లైఫ్ స్టోరీ గా …ఈ పుస్తకంలో అందించడం జరిగింది.
ఆంధ్రభూమి వీక్లీ లో జైలుగోడల మధ్య హీరో సుమన్…ఇన్వెస్టిగేటివ్ సీరియల్ రాసిన ప్రముఖరచయిత విజయార్కె …
“సంచలనం సృష్టించిన బాబూ వికాస్ కిడ్నాప్ ను కొన్నివారాల పాటు సీరియల్ గా అందించారు.అందుకు సంబంధించిన ఇంటర్వూస్ చేసారు.”
తమ బిడ్డ కిడ్నాప్ కు గురయ్యాక ఆ కుటుంబం పడ్డ వేదనకు అక్షరరూపం ఈ సీరియల్..ఇది చదివాకా కిడ్నాపర్స్ లో కూడా మార్పు వస్తుందేమో అన్న చిన్ని ఆశాభావం కలుగుతుంది.అలాగే కిడ్నాపర్స్ పట్ల మనమెలా అప్రమత్తంగా ఉండాలో చెబుతుంది.
ఈ పుస్తకం గురించి చెప్పాలంటే…
“పాపా నిన్ను మీ అమ్మ తీసుకురమ్మంది’చెప్పాడా అపరిచితుడు
“పాస్ వర్డ్ చెప్పండంకుల్”దబాయించి అడిగింది ఆ అమ్మాయి.
కిడ్నాపర్ బుర్ర గిర్రున తిరిగిపోయింది.
పాస్ వర్డ్ దేనికి?అడిగాడు…అక్కడే ఆ కిడ్నాపర్ దొరికిపోయాడు.
*పొద్దున్నే బడికి వెళ్తూ చిరునవ్వుతో టాటా చెప్పిన బిడ్డ సాయంత్రమయ్యేసరికి తిరిగి రాకపోతే…బిడ్డ కోసం ఎదురుచూసే తల్లి…కంటికి రెప్పలా కాపాడే తండ్రి. ఆ కుటుంబం పడే ఆందోళన చెప్పడానికి మాటలెక్కడ దొరుకుతాయి.?
మిస్సింగ్/కనబడుటలేదు
తప్పి పోవడం వేరు ..కిడ్నాప్ కు గురవ్వడం వేరు..రెఁడూ బాధాకరమే..కిడ్నాప్ విషాదభరితం కూడా…
వ్యక్తిగత విద్వేషాలు…పగ ప్రతీకారాలు…
డబ్బు కోసం కిడ్నాప్ లు….
అన్నెపున్నెం తెలియని చిన్నారులు…గదిలో నిర్బంధించి తల్లిదండ్రులతో బేరసారాలు సాగించి..ఒకోసారి చివరికి చంపి…
తల్చుకుంటుంటే మనసు భారమవుతోంది.
టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం ..
*2013 మరియు 2015 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 84 శాతం పెరిగింది. ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఇటువంటి కేసులు నమోదయ్యాయి.
*CRY (Child Rights and You) అంచనా ప్రకారం ప్రతిరోజూ 180 మంది పిల్లలు సగటునకనిపించకుండా పోతున్నారు., వీరిలో 22 మంది దేశ రాజధాని నుండి..ఇందులో అక్రమ రవాణా కోణం కూడా వుంది.కిడ్నాపర్లు అతి దారుణంగా పిల్లలను పొట్టన బెట్టుకుంటున్నారు.
*ప్రతీ ఎనిమిది నిమిషాలకు ఒక చైల్డ్ కిడ్నాప్ జరుగుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం తెలుస్తుంది.
*దాదాపు 40% మంది పిల్లలు కనిపించలేదు.
సంచలనం సృష్టించిన మిస్టీరియస్ కిడ్నాప్ …బాబూ వికాస్ ..నువ్వెక్కడ?
ఈ ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం లేదు.
కానీ ఈ గుండెకోత ఇంకా ఆ కుటుంబంలో గాయాలు చేస్తూనే వుంది.
ప్రముఖరచయిత విజయార్కె …కిడ్నాపర్లున్నారు జాగ్రత్త…బాబూ వికాస్ నువ్వెక్కడ ?
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ
కినిగె ద్వారా ఇ-బుక్ గా విడుదలైంది.
కిడ్నాపర్లున్నారు జాగ్రత్త…బాబూ వికాస్ నువ్వెక్కడ ? పుస్తకం లింక్
Free PDF Preview
http://preview.kinige.com/previews/8300/PreviewKidnaparlunnaruJagratta38773.pdf
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్