ఇంతకూ మా జూనియర్ గ్యాంగ్ ఎక్కడో కనపడలేదు. ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రాంలో ఉండి ఉంటారు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (15 -07-2018)

“ప్రేమైక స్వరూపులారా….” ముగింపు దశలో వినపడ్డ పదం.
ఇక ప్రోగ్రాం చివరికొచ్చేసిందని అర్థం అయ్యింది. మరో రెండు నిముషాలు మాట్లాడి సాయిబాబా తన సింహాసనంలో కూర్చున్నాడు.
ఇక అయిపోయింది కదా అని లేవబోతూ ఎందుకో డౌట్ వచ్చి చుట్టూ చూశాను.
ప్రసంగం అయిపోయినా ఎవరూ వాళ్ళ ప్లేస్ నుండి కదలలేదు. నేను ఇక తప్పదు అన్నట్టు అక్కడే కూర్చున్నాను.
అప్పటికే ఒక గంట పైగా కూర్చుని ఉండడంతో కాళ్ళు లాగేస్తున్నాయి. ఇదేం పనిష్ మెంటో అర్థం కాలేదు.
అసలు సాయిబాబా ఏమి చేస్తున్నాడా అని చూశాను.
అతను చుట్టూ ఉన్న వ్యక్తులతో ఏదో మాట్లాడుతున్నాడు. అదృష్టజాతకుడు అనుకున్నా..
ఇంతలో నేను కూర్చున్న వైపుకు ఎదురుగా ఏదో కోలాహలం మొదలైంది. ఏమిటా అని ఆ వైపు చూశాను.
జనం ఎక్కువగా గుమిగూడి ఉండడం వల్ల అర్థం కాలేదు.
ఇంతలో సాయిబాబా చుట్టూ ఉన్న వ్యక్తులు మెల్లగా ప్రక్కకు జరగడం మొదలుపెట్టారు.
నాకు ఏదో సస్పెన్స్ మూవీ చూసున్నట్టు ఉంది.
కాసేపటికి ఆయన చుట్టూ ఉన్న స్థలం దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతలో ఏదో ఊరేగింపు కదిలినట్టు అనిపించి అటువైపు చూశాను.
దూరంగా ఒక బాల వికాస్ గ్రూప్ నిలబడి ఉంది. అందరూ ఒకే డ్రెస్ వేసుకుని ఉన్నారు.
కాస్త పరీక్షగా చూస్తే అర్థం అయ్యింది… భరత నాట్యం డ్రెస్ లో ఉన్నారు.
ఇంతలో ఎక్కడో విజిల్ సౌండ్ వినిపించింది. వెంటనే అప్పటి వరకు అక్కడ ఉన్న గ్రూప్ సాయిబాబా ముందుకు వచ్చారు. అతని ముందు కాసేపు డాన్స్ చేసి ముందుకు వెళ్ళిపోయారు.
ఇంతలో మరో గ్రూప్ భజనలు చేసుకుంటూ సాయిబాబా ముందు నుండి వెళ్ళింది.
నాకు అప్పటికి అర్థం అయ్యింది… తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇలాంటి విన్యాసాలు ప్రదర్శిస్తారు. అటువంటి ప్రదర్శనే నేను చూస్తున్నది.  ఇంతకూ మా జూనియర్ గ్యాంగ్ ఎక్కడో కనపడలేదు. ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రాంలో ఉండి ఉంటారు.
ఇక వారికోసం ఎదురుచూడ్డం ప్రారంభించాను. ఒక్కొక్క గ్రూప్ సాయిబాబా ముందు నుండి వెళుతుంటే వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడు

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY