అప్పటివరకు నన్ను వెదికినట్టు ఉంది. నన్ను చూడగానే ఫస్ట్ కోపం తరువాత రిలీఫ్ మొహంలో కనపడింది….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (22 -07-2018)

నేను మా జూనియర్ బ్యాచ్ కోసం వెతుకుదామని లేచాను. అప్పటికే జనం బాగా బిజీగా ఉండడంతో నేను లేవడం ఎవరూ పట్టించుకోలేదు.
బాలవికాస్ గ్రూప్స్ ఒక్కొక్కటి సాయిబాబా ముందు నుండి వెళుతుంటే చుట్టూ ఉన్న జనం అక్కడ జరిగే ప్రోగ్రాం చూస్తూ ఉత్సాహంతో సాయిబాబా చుట్టూ నిలబడ్డారు.
వెనుక కూర్చున్న వారికి ప్రోగ్రాం ఏమి కనపడక లేచి నిలబడ్డారు.
ఇక నాకు లేవడానికి ఇబ్బంది లేకుండా పోయింది.
అప్పటికే మూడు గంటల పైగా కూర్చుని ఉండడంతో ఒళ్ళు హూనమై ఎక్కడివక్కడ పట్టుకుపోయాయి. లేచి నిలబడ్డానికే ఐదు నిముషాలు పట్టింది.
ప్రోగ్రాం ఇంటరెస్టింగ్ గా ఉండడంతో నేను కూడా ముందు వరుసలో వెళ్లి నిలబడ్డాను.
ఒక్కో గ్రూప్ రావడం వాళ్లకు ఇచ్చిన ఐటెం చేయడం, ప్రోగ్రాం అవ్వగానే వెళ్ళిపోవడం జరుగుతోంది.
సంకీర్తనలు, పద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు … ఇలా ఎన్నో రకాలుగా ప్రోగ్రామ్స్ సాయిబాబా ముందు నుండి వెళ్తున్నాయి.
డాన్స్ లు బాగున్నాయి, పాట కట్టి పాడడంలో ట్యూన్ బాగుంది.
ఇంతలో మా జూనియర్ గ్యాంగ్ వస్తూ కనిపించింది. ఏదో డాన్స్ ప్రోగ్రాంలా ఉంది. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఉన్నారు.
అసలు నాకు తెలియకుండా వీళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ చేశారో అర్థం కాలేదు. సాయిబాబా ముందు ఉన్న గ్రూప్ లో ఎవరో పర్ ఫార్మెన్స్ చేస్తున్నారు. దాని వెనుక బ్యాచ్ లో ఎవరో పెద్దవారు నడుస్తున్నారు. ఆ బ్యాచ్ లో ఆంటీ కూడా ఉంది. నేను గ్రూప్ కి దగ్గరగా ఉండడంతో అందరూ క్లియర్ గా కనిపిస్తున్నారు.
నా ముందు నుండే అన్ని బ్యాచ్స్ సాయిబాబా ముందుకు వెళుతున్నారు. ఇంతలో ఆంటీ నన్ను చూసింది.
అప్పటివరకు నన్ను వెదికినట్టు ఉంది. నన్ను చూడగానే ఫస్ట్ కోపం తరువాత రిలీఫ్ మొహంలో కనపడింది.
ఏ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చెయ్యాలని అనుకోలేదు. మరి ఆంటీ నాకోసం ఎందుకు వెదుకుతున్నారో అన్న డౌట్ వచ్చింది

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY