నీ జ్ఞాపకాల క్షతగాత్రిని (లక్ష్మీ విజయ నడింపల్లి) కుంచె చింతాలక్ష్మీనారాయణ!…కన్ను…అఖిలాశ(బెంగుళూరు) ఆత్మత్యాగం కవితలు (27 -08 -2017 )

నీ జ్ఞాపకాల క్షతగాత్రిని (లక్ష్మీ విజయ నడింపల్లి)

—————————————-
ఏ చీకటి చిదిమేసిందో
చిరుగించిన చెలిమి ఆనవాళ్ళని
ఏరాతిరి నులిమేసిందో
నీజతలో గడిపిన క్షణాలని
కన్నీటిసుడిగుండంలో మునిగి
కునుకు నన్నువెలివేసింది
కలలకి కూడా అలకేనా నేస్తమా
నీరూపం కరువైపోయింది.

చితిలోనూ వెలితే నీవులేక జతగా
చిరునవ్వు చురకే నీవులేని నేను బ్రతుకుతుండగా
చిరునామా చెప్పిపోలేదేం నేస్తమా
చూడు శ్మశానం కూడా వెక్కిరిస్తుంది మరలా నిను కలవలేనని

పంచుకున్న ఙ్ఞాపకాలెన్నిఉంటేనేం
నీ ప్రాణాన్ని నిలపలేనప్పుడు
పంచుకుతిన్న గుర్తులెన్నివుంటేనేం
నను పిలవకుండా వెళ్ళిపోయాకా
శ్వాస బరువైపోతుంది
నువ్వులేవనే నిజమైన అబద్ధం తలపుకొస్తే

లోకులవిరుపులకి ఊపిరియెంతని
నువ్వు క్రుంగిపోయావు
ఈకాకులమూకల నీతులకెందుకు బెదిరిపోయావు
హృదయంలేని దూరం నన్ను బంధించింది
మరణంలేనీ కాలం నానుండి విడదీసింది

నినుచేర్చె మరణపుఛాయలు పంపవూ
మరోజన్మలోను తోడవుతాను

మరలా ఏకొమ్మకి పువ్వైనావో చెప్పవూ
నీకాపుకి కంచవుతాను
కన్ను
తెలుస్తోంది నాకు కన్పిస్తోంది నాకు
సమాజంలో కక్కుర్తితో ధనార్జనే ధ్యేయంగా
ఆహార ఉత్పత్తులు కలుషితమవుతున్నా నా కన్నులతోనే చూస్తున్నా….

ఎలుకను పిల్లి..పిల్లిని కుక్క
కుక్కను నక్క..నక్కను తోడేలు
తోడేలును సింహాలు..లేనోడిని ఉన్నోడు
బలహీనుడుని బలవంతుడు తరమటం
నా కన్నులతోనే చూస్తున్నా….

గుమ్మం దాటిన అమ్మాయి పైన
ఎన్నో కన్నులు సూదుల్లా గుచ్చుతూ
కొంచెం కొంచెం రక్తం తాగే దోమల్లా తెలియకుండా రక్తం పీల్చీ జలగల్లా
ప్రాణాలను తీసుతుంటే చూస్తున్నా
నా కన్నులతోనే చూస్తున్నా…
నే చూస్తున్నా నా నేత్రాలు బిగ్గరగా తెరచి
ఏమీ చేయలేని నిస్సహాయతతో
నా కన్నుల కెమెరాలో బందించి
నా కలం లిఖించింది పాపపు చిట్టా!
ఇక అమలు జరపాలి శిక్షల జాబితా!!

-కుంచె చింతాలక్ష్మీనారాయణ!…కన్ను

ఆత్మత్యాగం

నీవే నా ప్రాణమని
నీవే నా లోకమని
నీతోనే నా జీవితమని
నీవే నేనని..నీలోనే నేనని
తలచి వలచి వచ్చాను
వదిలి కదిలి పోయావ
ప్రియతమా తరలిరావ
హృదయంలో నింపుకున్న
తొలి పరిచయ గడియాలనే
మరవకనే ఆత్మత్యాగం చేసి
రాలి పోయావా నిశిలోకి
నన్నువదిలి మౌనంగా..!!
వేదననే మిగిలించావు..!!
రోదనతో నా రుధిరం
పగిలిపోయినది..!!
జీవం దేహం వదిలి
రాలిపోయినది..!!

—అఖిలాశ(బెంగుళూరు)

ఈ కవితలను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

NO COMMENTS

LEAVE A REPLY