ఆమె మనసును చదివి .” అర్ యు హ్యాపీ ” అన్నాడు…సుగాత్రి సిగ్గాత్రి అయ్యింది …ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ “డిటెక్టివ్ సిద్ధార్థ” (22-07-2018)

                                       18
” డ్రెస్ లు జ్యువలరీ  అన్నీ ఇస్తారా ? అడిగింది జేమ్స్ భార్య 
” నువ్వు చేసేది రియాల్టీ షో..నేచురల్   గా ఉండాలి….” చెప్పాడు సిద్దార్థ
” అలాగే అన్నట్టు ” తలూపింది
సిద్దార్థ  జేమ్స్ కు అతని భార్యకు ఏం చేయాలో చెప్పాడు.
తరువాత జేమ్స్ భార్య వైపు తిరిగి ” మీ ఆయన అదే జేమ్స్ డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యాడు..” ఇంకా పూర్తిగా చెప్పకముందే జేమ్స్ వైపు మిర్రిమిర్రి చూసింది 
” ఎప్పటి నుంచి ..ఒళ్ళు చీరేస్తాను..” అంటూ ఏదో అనబోయింది
వెంటనే ప్రమాదాన్ని పసికట్టిన సిద్దార్థ
” ఇది రియాల్టీ షో ..జేమ్స్ పాత్ర డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిన పాత్ర…పానీపూరీల్లో డ్రగ్స్ సప్లై చేస్తూ ఓ విలన్ ముఠా జనాన్ని డ్రగ్స్ కు ఎడిక్ట్ చేస్తుంది..ఆ విషయం నీకు తెలిసింది…వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి నీ మొగుడిని తిడుతూ పానీపూరీల్లో డ్రగ్స్ కలిపే వాడిని చితక్కొట్టాలి ..అది చూసి జనం రెచ్చిపోవాలి..అన్ని వైపులా నుంచి కెమెరాలు నీ యాక్టింగ్ ను షూట్ చేస్తూ ఉంటాయి..నీకు సపోర్ట్ గా జూనియర్ ఆర్టిస్ట్ లు వుంటారు ” వివరంగా చెప్పాడు సిద్దార్థ
అంతే మిసెస్ జేమ్స్ గాల్లో తేలిపోతుంది..జేమ్స్ కు మాత్రం లోలోపల కొంత భయంగానే వున్న డిటెక్టివ్ సిద్దార్థ , సుగాత్రి మేడం ఉన్నారన్న ధైర్యం .
జేమ్స్ అతని భార్య వెళ్లగానే సిద్దార్థ జూనియర్ ఆర్టిస్టులను పిలిపించాడు..అందులో కాలేజీ మ్మాయిలు,అబ్బాయిలు భార్యాభర్తలు వృద్ధులు ఇలా రకరకాల పాత్రలు పోషించేవాళ్ళు వున్నారు.వాళ్లకు ఏం చేయాలో చెప్పాడు..సినిమా వాళ్ళు ఇచ్చే రెమ్యూనరేషన్ కు అదనంగా ఎక్కువే ఇచ్చాడు…సరికొత్త నాటకానికి,ఆపరేషన్ డి ఫినిష్ కు సిద్ధమయ్యాడు సిద్దార్థ
సుగాత్రి సిద్దార్థ వైపే చూస్తుంది.అతనిలోని షార్ప్ నెస్ ను చూస్తోంది.ఎంత ఫాస్ట్ గా క్విక్ గా ఆలోచిస్తాడో .సన్తే ఫాస్ట్ గా వర్క్ ఫినిష్ చేస్తాడు.
ఒక్కోసారి ఈ సిద్దార్థ తనతో అల్లరిచేసే సిద్దార్థ ఒక్కరేనా అనిపిస్తుంది 
సిద్దార్థ సుగాత్రి వైపు చూసి ” ఏంటీ ..నా చిన్నమెదడు ఏమైనా చితికిపోయిందేమోనన్న సందేహం వచ్చిందా? నవ్వుతూ అడిగాడు 
” ఉహూ అదికాదు..సాధారణంగా కేసులు పరిశోధనలు అధరాలు అరెస్టులు ఉంటాయి..కానీ చాలా ప్లాన్డ్ గా ఒక పథకం ప్రకారం ఇలా సినిమా షూటింగ్ ను తలపిస్తూ క్రైమ్ సినిమా చూపిస్తున్నారు ” అంది సుగాత్రి 
సిద్దార్థ సుగాత్రి  వైపు చూసి చెప్పసాగాడు 
” అతి భయంకరమైన డ్రగ్స్ మాఫియా..దందాలు కబ్జాలు వీటివల్ల డబ్బు నష్టం..దేశ ఆర్థిక వ్యవస్థలో నష్టం వస్తే రావచ్చు..కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలు నేల్కులుతాయి..భవిష్యత్తు వున్న చిన్నారులు యువత నిస్త్రాణంగా మారుతారు…దీని దుష్ప్రభాభావం మన దేశ భవిష్యత్తును అధఃపాతాళానికి  తొక్కేస్తుంది…   అధరాలు దొరకవు..దొరికిన శిక్ష పడాలంటే సంవత్సరాల తాత్సారం ..ఈలోగా విదేశాల్లోకి పారిపోతారు.ఒక మాఫియా డాన్ ను మనం ఇండియా రప్పిస్తున్నామా…శిక్ష పడాలి..ఆ శిక్ష న్యాయస్థానం విధించే శిక్ష కన్నా భయంకరంగా ఉండాలి…తప్పించుకునే అవకాశం ఉండకూడదు…” 
సుగాత్రి విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది
అల్లరిగా  కనిపించే సిద్ధార్థతో సీరియస్ నెస్ దేవుడి విశ్వరూపంలా వుంది
సిద్దార్థ కొనసాగించాడు
మన సిటీలో ఇప్పటివరకూ రెండులక్షల మంది డ్రగ్స్ ఎడిక్ట్ గా మారారు..అందులో ముప్పై వేలమందిని ట్రేస్ చేయగలిగాం..వాళ్ళను రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాం.నేను అదృశ్యమయ్యానని డిటెక్టివ్  వృత్తిని వదిలేసానని చెప్పుకుంటున్న సమయంలో నేను చేసిన పని ఇదే…
ఇపుడు వాళ్లందరినీ మాములు పరిస్థితుల్లోకి తీసుకురావడమే కాదు..ఒక్కొక్కరిని ఒక్కో సైనికుడిగా చేసాం..డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఉండే కాప్స్ గా పనిచేస్తున్నారు…మిస్టర్ డి డ్రగ్స్ తయారీకేంద్రాల మీద ఈటా మొదలైంది.
మిస్టర్ డి చావుదెబ్బ తీయాలి
మిస్టర్ డి కుడిభుజం మీద మొదటి ఎటాక్..అది మన చేయం..భస్మాసురహస్తంలా మాస్టర్ డి మాత్రమే చేస్తాడు…” చెప్పాడు సిద్ధార్థ
అలాగే సిద్ధార్థను చూస్తూ ఉండిపోయింది.ఒక్కక్షణం అతడిని గట్టిగా హత్తుకోవాలన్న కోరిక మనసును పట్టి కుదిపేసింది.
సిద్ధార్థ సుగాత్రి దగ్గరికి వచ్చి ,సుగాత్రిని  గట్టిగా హత్తుకున్నాడు..ఆమె మనసును చదివి .” అర్ యు హ్యాపీ ” అన్నాడు
సుగాత్రి సిగ్గాత్రి అయ్యింది ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
                                           ***
 జమిలి కరీమ్ ఒళ్ళో   వుంది.అతడిని తన కౌగిలిలో బంధించింది..అది మృత్యువు కౌగిలి అని కరీమ్ కు తెలియదు 
అతనికి కొత్తగా వుంది.అమ్మాయిలను బలవంతంగా రేప్ చేయడం.చంపేయడం అమానుషంగా ప్రవర్తించడం అలవాటు…ఇప్పుడు ఓ అమ్మాయికి తనకు తానుగా రావడం…ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా తనతో క్లోజ్ గా ఉండడం..తనకోసం గిఫ్ట్స్  కొనడం…
” కరీమ్ మిమ్మల్ని చూస్తుంటే జెలసీగా ఉంది ..మీ మజిల్ పవర్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ …మిస్టర్  డి కు మీరు ఏ మాత్రం తగ్గారు..మీరే లేకపోతే మిస్టర్ డి సామ్రాజ్యం సగం కుప్పకూలుతుంది ” ఆమె మాటల్లో మత్తు వుంది.అతని చేతికి మధువు అందించింది.ఆ మధువు తళుకు మత్తు అతనికి ఎక్కింది .దానికి తోడు ఆమె మాటల కిక్కు..చేతల కిక్కు…
” థాంక్యూ డార్లింగ్ న గొప్పతనాన్ని నువ్వు గుర్తించావు..మిస్టర్  డి గుర్తించినా బయటకు చెప్పడు..చెబితే నేను ఎదిగిపోతానని భయం ..పిచ్చి డి ..” మత్తులో మాటలు తూలాడు…శరీరం తూలుతోంది..మాటలతో పాటు.
గోడకు వున్న తైలవర్ణచిత్రంలో పులి కన్నుకు బిగించిన కెమెరా కన్ను పనిచేస్తుంది.
జింక మీద దాడిచేస్తోన్న తైలవర్ణ చిత్రం ..జింక మీద లంఘిస్తోన్న పులి క్రూరమైన కన్నులో నుంచి చూస్తోన్న కెమెరా కన్ను అక్కడి దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది.
                                                                           ***
మిస్టర్ డి ఆలోచిస్తున్నాడు.ఇంతవరకూ అతను ఎప్పుడూ ఇంత అందోళనకు గురికాలేదు.ఎవ్వరినీ అంత తేలిగ్గా నమ్మడు…అలాంటిది ఇప్పుడు తన కుదిభజం..రైట్ హ్యాండ్ తనను కార్నర్ చేస్తున్నదన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నారు, కరీమ్ కు ఫోన్ చేసాడు…
” కరీమ్ ఎక్కడున్నావ్ ? 
” బాస్…ఒక పార్టీకి డ్రగ్స్ ఇచ్చాం..క్యాష్ కలెక్ట్ చేసుకుని వచ్చిన మనవాళ్ళు మనకు టోకరా ఇచ్చి పారిపోతున్నారు.వాళ్ళను ట్రేస్ చేస్తున్నాను..అరగంటలో మీ ముందుంటాను బాస్ ” అటువైపు నుంచి కరీమ్ మాట్లాడాడు
మిస్టర్ డి కు కాన్ఫర్మ్ అయ్యింది కరీమ్ తనని కర్నె చేస్తున్నాడు.
ఎందుకంటే కరీమ్ ను ఫాలో చేసినవాళ్లు చెప్పిన సమాచారం ప్రకారం..కరీమ్ ఒక క్లబ్ డాన్సర్ ఇంట్లో వున్నాడు…
అప్పుడే అతని వాట్సాప్ కు వీడియో వచ్చింది..అందులో కరీమ్ క్లబ్ డాన్సర్   ఒళ్ళో..అదీ తాగి తూలుతూ తన గురించి మాట్లాడిన వీడియో…
మిస్టర్ డి కి ఫోన్ వచ్చింది
” మిస్టర్ డి నీ ప్లేసులోకి రావడానికి నీ కుడిభజం నీ రెండుచేతులు విరిచేస్తునాడు ..నిన్ను రాంగ్ ట్రాక్ లోకి తీసుకువెళ్తున్నాడు.తానే పారిపొమ్మని చెప్పి వాళ్ళు పారిపోతున్నారని డ్రామా ఆడుతున్నాడు.” అంటూ ఫోన్ కట్ య్యింది.
అంత ఈజీగా అతంబు ఫోన్ కాల్స్ ను నమ్మలేదు..వీడియో చూసాడు..ఈ మధ్య బర్త్ డే అని అబద్దం ఆడాడు  ..ఇప్పుడు డాన్సర్ దగ్గర ఉండి.మరో దగ్గర వున్నానని అబద్దం ఆడుతున్నాడు…
 
మిస్టర్ డి రాబర్ట్ కు ఫోన్ చేసాడు
 రాబర్ట్  ఫ్రొఫెషనల్ కిల్లర్.అతనికి జాలి దయ  వుండవు.డబ్బులు తీసుకుని హత్యలు చేయడంలో అతి క్రూరుడు.
” రాబర్ట్ నువ్వు వెంటనే ఒక హత్య చేయాలి.ఆ హత్య ఎంత ఘోరంగా వుండలంటే జనంలోనే కాదు మాఫియాలోనూ వణుకు పుట్టాలి…నమ్మకద్రోహం   చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలియాలి.నీకు రావాల్సిన అమౌంట్ నీ అకౌంట్ లో పడిపోతుంది  .నువ్వు వెంటనే రంగంలోకి దిగు..” చెప్పాడు రాబర్ట్
” ఇంతకూనేను చంపవలిసిన వ్యక్తి ఎవరు..ఫోటో డిటైల్స్ పంపించండి మిస్టర్   డి ” అన్నాడు రాబర్ట్
” డీటెయిల్స్ అవసరం లేదు..ఫోటో అవసరం   లేదు…ఆ వ్యక్తి నీకు తెలుసు.కరీమ్..కరీమ్ ను చంపాలి .” చెప్పాడు మిస్టర్ డి
చెప్పాడు
రాబర్ట్ షాకయ్యాడు
” నువ్వు కరెక్ట్ గానే విన్నావు…ఫినిష్ హిమ్.అతను చనిపోయిన విషయం కన్ఫర్మ్ ఆయన వెంటనే నీ డబ్బు నీకు చేరుతుంది ” చెప్పి ఫోన్ పెట్టేసాడు మిస్టర్ డి.
                                                   ***
జమిలి కరీమ్  ను తట్టి లేపింది.ఆమె మొహంలో ఆందోళన కనిపిస్తుంది ..కరీమ్ మీరు తొందరగా ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోండి..ప్లీజ్ ..నీకేమైనా అయితే నేను తట్టుకోలేను ” అంది
” ఏమైంది డియర్..ఈ కరీమ్ కు ప్రమాదమా..నేనే అందరికీ ప్రమాదం..పైగా మిస్టర్ డి మనిషిని  టచ్ చేసేవాడు పుట్టలేదు ” అన్నాడు కరీమ్ కళ్ళు నులుముకుని
” నీకు ప్రమాదం వున్నదే మిస్తే డి నుంచి…అతనే నిన్ను చంపాలని   ప్రయత్నిస్తున్నాడు…” చెప్పింది జమిలి
” న్నో నేను నమ్మను..నేను మిస్టర్ డి కి కుడిభుజాన్ని…అయినా నన్ను చాపి దమ్మెవరికి ఉంటుంది ” నందు కరీమ్
” రాబర్ట్ కు ” చెప్పింది జమిలి
రాబర్ట్ పేరు వినగానే షాకయ్యాడు..ఎందుకంటే రాబర్ట్ ను హత్యలు చేయడానికి ఉపయోగించుకుంటారు మిస్టర్ డి…అలంటి రాబర్ట్ ..
జమిలి తన ఫోన్ లో వున్నా రికార్డర్ ని అం చేసింది
మిస్టర్ డి రాబర్ట్ మధ్య జరిగిన సంభాషణ  టేప్ …
కరీమ్ మొహంలో రంగులు మారుతున్నాయి.రాబర్ట్ ను ఎప్పుడైతే నియమించాడో అప్పుడే అర్థమైంది.రాబర్ట్ గొంతును తాను గుర్తు పట్టగలడు..అతనికి ఒక్క విషయం అర్థం కాలేదు…తనను మిస్టర్ డి ఎందుకు చంపమన్నాడు ? అయితే ఇలాంటి  సమయంలో దానికి కరీమ్ పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు…
ఎందుకంటే ఇప్పుడు తాను తన ప్రాణాన్ని కాపాడుకోవాలి..రాబర్ట్ ఎంత ప్రమాదకరమైన మనిషో తెలుసు..మిస్టర్ డి ని అంత తేలిగ్గా వదలకూడదు..మిస్టర్  డి కోసం తాను తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు..కానీ మిస్టర్ డి తన ప్రాణాలు తీయాలనుకున్నాడు.
క్రీంజమిలి వంక చూసాడు..ఇప్పుడు అతని కళ్ళకు జమిలి దేవతలా కనిపిస్తుంది.
” జమిలి టైం లేదు..నేనో రాబర్టో…ఆ తర్వాత మిస్టర్ డి అంతు చూస్తాను.ఈలోగా నాకు ఏదైనా అయితే మిస్టర్ డి పాపాల చిట్టా ఇదిగో..అతనికి ఎక్కడెక్కడ స్థావరాలు వున్నాయి..వాడికి ఎవరెవరితో లింకులున్నాయి..అన్న వివరాలు ఇవి…అంటూ చెప్పడం మొదలుపెట్టాడు కార్తీ,,అతనికి మిస్టర్ డి కు సంబంధించిన ప్రతీ విషయమూ తెలుసు..
జమిలి అదంతా అతనికి తెలియకుండానే రికార్డు చేస్తోంది.
మిస్టర్ డి ఫోన్ ట్రాప్చేయబడింది.అలా ట్రాప్ చేయబడిన సంభాషణ సిద్దార్థ్ జమిలికి అందించాడు..
డివైడ్ అండ్ రూల్
అమానుషత్వాన్ని ఎదిరించడానికి ఇంతకన్నా మార్గం  లేదు…
కరీమ్ చెబుతున్న మిస్టర్ డి రహస్య స్థావరాల వివరాలు.అతడితో లింకులు వున్న వారి చిరునామాలు డైరెక్ట్ గా సిద్దార్థకు చెడుతున్నాయి..వెంటవెంటనే పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆ స్థావరాల మీద.మిస్టర్ డి తో పరిచయాలు వున్న ఇతర మాఫియా మనుష్యుల మీద ఎటాక్ మొదలైంది.
కేఎం తన జేబులో వున్న రివాల్వర్ చూసుకుని బయటకు నడిచాడు.
తనకు సెక్యూరిటీ గా వండేవాళ్ళ ఫోన్స్ స్విచ్ఛాఫ్ అయినప్పుడే మిస్టర్ డి ప్లాన్ అర్థమయింది.
ఇప్పుడు రాబర్ట్ ను ఎదుర్కోవాలి..తరువాత టార్గెట్ మిస్టర్ డి
కరీమ్ వెళ్తుంటే జమిలి ఇలా అనుకుంది
” సారీ కరీమ్ నువ్వు చేసిన పాపాలకు నేను నీకు చేసిన  నమ్మకద్రోహం బాలన్స్ అయ్యింది..అంతేకాదు నన్ను నమ్మి మిస్టర్ డి డిటైల్స్ చెప్పినందుకు రాబర్ట్ నుంచి నీకు ప్రాణహాని ఉందని చెప్పాను ..నీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇచ్చాను. .రాబర్ట్ ను చంపితే నిన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు  ..లేదా నిన్ను   రాబర్ట్ చంపినా రాబర్ట్ ను నువ్వు చంపినా మీ  ఇద్దరూ ఒకరిచేతిలో మరొకరు   చచ్చినా చట్టానికి న్యాయం జరుగుతుంది.శాంతిభద్రతలు ప్రశాంతంగా  ఊపిరితీసుకుంటాయి.
మిస్టర్ డి ని అన్నివైపులా కార్నర్  చేసిన సిద్దార్థ మాస్టర్ ప్లాన్ …
                         ***
సిద్దార్థ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు.చదరంగంలో పావులను చకచకా కదిపాడు…
నగరంలో వున్నా పానీపూరి చాట్ వాలాలను సమావేశపరిచాడు..రోజూ కొన్నివేల అంది పానీపూరి అమ్ముతూ ఉపాథి పొందుతున్నారు.మిస్తే డి పానీపూరీని మాఫియాతో లింక్ చేసాక నిజాయితీగా పానీపూరి అమ్మి బ్రతుకుబండి వెళ్లదీసుకునేవాళ్లకు సమస్య్లు మొదలయ్యాయి.హంగు ఆర్భాటాలు డ్రగ్స్ కలిసిన కిక్ ముందు అసలు సిసలైన పానీపూరి టేస్ట్ దూరమైంది.
అందరి వైవు చూసాడు
” మీరు కొన్నేళ్లుగా పానీపూరి రుచి చుపిస్తున్నారు.మాఫియా వచ్చి డ్రగ్స్ ను దొడ్డిదారిలో తీసుకువచ్చి.ప్రజలను డ్రగ్స్ కు బానిసలూ అయ్యేలా చేస్తుంది.మీలో కిందరు డబ్బు ఆశతో అటువైపు వెళ్లి ఉండొచ్చు.కానీ చాలా మంది నిజాయితీగా ఈ వ్యాపారం చేస్తూ పానీపూరి రుచిని ప్రజలకు అందిస్తన్నారు.మీ వెంట పోలీసులు వున్నారు.మేమున్నాం..మీరంతా తిరగబడండి.మిస్టర్ డి పానీపూరి స్టాల్ల్స్ ఎక్కడ కనపడ్డా ధ్వండం చెడి.నిజాయితీగా వ్యాపారం చేయండి..ఈ విషయాన్నీ మీ వాళ్లకు చెప్పండి..ఉంబై కావచ్చు..మరెక్కడైనా కావచ్చు.పేర్లు మావొచ్చు..పానీపూరి గప్ చుప్  పాప్ బాజీ ఏదైనా సరే స్వచ్ఛమైన రుచి ఉండాలి..డ్రగ్స్ వ్యాపారం చేస్తూ మీ వ్యాపారానికి కళంకం తెచ్చే మిస్టర్ డి ని ఎదుర్కొంది..” చెప్పాడు సిద్దార్థ్
అదే సమయంలో
(ఈ సస్పెన్స్ కు చిన్న బ్రేక్) 
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY