.ప్రధాని ” జనతా కర్ఫ్యూ ” కు బాసటగా నిలుద్దాం కరోనా మరణవాగ్మూలాన్ని నిజం చేద్దాం..సాయంకాలం 5 గంటలకు మనం చేసే కరతాళధ్వనులు కరోనాకు మృత్యుఘంటికలు కావాలి..జై హింద్

కరోనా మరణ వాగ్మూలం
” నేను కరోనా ..మృత్యువు నాకున్న మరోపేరు.సృష్టి మొదలైనప్పటి నుంచి వైరస్ రూపంలో ఏదోఒక పేరుతో మీ మీద దాడి చేస్తూనే వున్నాను.ప్లేగు వ్యాధి పేరుతో మీ నగరాన్ని కుదిపేసాను.అయినా తట్టుకుని నిలబడ్డారు.
1918-19ల్లో వ్యాపించిన ఇన్‌ఫ్లుయెంజాను చరిత్రలో అత్యంత తీవ్రమైన ఇన్‌ఫ్లుయెంజాగా మీ ముందుకు వచ్చాను. అప్పట్లో పక్షుల నుంచి సంక్రమించిన వైరస్ దాదాపు ఐదు కోట్ల మంది ప్రాణాలు తీసింది.అని మీ లెక్కలే చెప్పాయి.
ఇప్పుడు కరోనా పేరుతో చైనా సరిహద్దు దాటి వచ్చాను.నా ప్రాణరహస్యం మీకు తెలుసు.నన్ను ఎలా జయించాలో..మీకు తెలుసు.మీ చేతుల్లోవున్న శుభ్రత అనే ఆయుధం..చాలు నేను కనుమరుగైపోవడానికి.
నన్ను చూడగానే అసహ్యంగా మీ ముక్కుకు వున్న మాస్క్ చాలు నేను మీకు దూరంగా ఉండడానికి…
ఏమాత్రం నేను మీ దగ్గరికి వచ్చానని తెలిసినా మీకు మీరు ఐసోలేషన్ లోకి వెళ్తేచాలు..నేను మీకు దూరమవ్వడానికి...
పరాయివాడు మీ దేశాన్ని ఆక్రమించుకున్నాడని అహింసతో పోరాడిన మహాత్ముడు..
హింసామార్గమే ” దెబ్బకుదెబ్బ” అన్న విప్లవవీరులు దీక్షాబలం..మీ సంకల్పం మీ దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.
అదే సంకల్పం
అదే దీక్ష
అదే మొక్కవోని ధైర్యంతో మీరు నాతో పోరాడి గెలువవచ్చు.
ప్రయత్నించి చూడండి.ఇది నా సవాలు.నన్ను ( నాలోని వైరస్ ను ) చంపేయండి.
మీ నేతలు ,వైద్యులు మీడియావాళ్లు సామాజికవేత్తలు నన్ను సమూలంగా నాశనం చేయడానికి నడుం కట్టారు.వారితో చేతులు కలిపి నన్నుమృత్యువు సరిహద్దువరకూ తరిమికొట్టగలరా? ప్రయత్నించి చూడండి.
రేపటిరోజు..ఈ ఆదివారం…నన్ను తరిమివేయడానికి మీరు ఎంతవరకు సిద్ధంగా వున్నారో ఎదురుచూస్తూ వుంటాను…
మమ్మల్ని ప్రేమిస్తూ..మీ ద్వేషాన్ని కూడగట్టుకున్న మీ కరోనా ( నాకున్న ఇంకోపేరు కోవిడ్ )
కరోనా మరణవాగ్మూలాన్ని నిజం చేద్దాం.కరోనాకు మరణశాసనాన్ని లిఖిద్దాం.
మనమేమిటో కరోనాకు తెలియజేద్దాం.కరోనా వైరస్ తో మనమంతా ఒక్కటై పోరాడుదాం.
ఈ ఆదివారం ఉదయం నుంచి రాత్రివరకు ఇంట్లోనే ఉండి కరోనా మీద యుద్ధాన్ని ప్రకటిద్దాం..ప్రధాని ” జనతా కర్ఫ్యూ” కు సంపూర్ణ మద్దత్తు పలుకుదాం
జనతా కర్ఫ్యూకు మేన్ రోబో సంపూర్ణ మద్దత్తును ప్రకటిస్తుంది.జనతా కర్ఫ్యూ పిలుపును విజయవంతం చేయాలనీ అఖండ భారతావనికి విజ్ఞప్తి చేస్తుంది.
సాయంకాలం 5 గంటలకు మనంచేసే కరతాళధ్వనులు కరోనాకు మృత్యుఘంటికలు కావాలి..జై హింద్

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY