రాజనాల…విలనిజంలో హీరోయిజం చివరి రోజుల్లో పేదరికం విషాదం

(విజయార్కె )
చలనచిత్ర పరిశ్రమలో విలన్ గా తనదైన విశ్వరూపాన్ని చూపిన రాజనాల చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యంతో కన్నుమూయడం చిత్రసీమలో వి..చిత్రం ..విషాదం.
తన ప్రతినాయక లక్షణాలతో వెండితెరను సుసంపన్నం చేసిన రాజనాల జీవితంలో విధి విలన్ గా మారింది.

చలనచిత్ర పరిశ్రమలో విలన్ గా తనదైన విశ్వరూపాన్ని చూపిన రాజనాల చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యంతో కన్నుమూయడం చిత్రసీమలో విచిత్రం విషాదం.

తన చూపులతో,నటనతో ప్రేక్షక లోకాన్ని సమ్మోహనపరిచిన రూపం తనది
కత్తియుద్ధం చేస్తే జానపదాలు సాహో అంటాయి.
ఎన్టీఆర్,కాంతారావు,కృష్ణ హీరో ఎవరైనా విలన్ మన రాజనాలే.
కరుడుగట్టిన విలనిజాన్ని వెండితెరపై ప్రదర్శించే రాజనాల సాత్వికమైన వ్యక్తి.శ్రీఆంజనేయస్వామి భక్తుడు.హస్తసాముద్రికం లో ప్రవేశం ఉంది.
మూడు షిప్ట్ లు పనిచేస్తూ బిజీగా వుండే రాజనాల ఒక చిన్న వేషం కోసం ఎదురు చూడటమే ఈ చిత్రసీమలోని విషాద చిత్రం.
రాజనాల అసలు పేరు రాజనాల కల్లయ్య (రాజనాల కాళేశ్వరరావు)

1925, జనవరి 3న జన్మించారు.
నిర్మాత హెచ్. ఎం. రెడ్డి వద్ద ‘ప్రతిజ్ఞ’ సినిమాకు విలన్‌గా రాజనాలను ఎంపికచేశారు.
నెలకు రూ.200/– జీతానికి హెచ్‌ఎం రెడ్డితో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. 1953లో విడుదలైన ఆ సినిమా రాజనాలకు మంచి పేరు తీసుకొచ్చింది.
పాతికేళ్ల వయసులోనే ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ఎన్టీఆర్ కు  మామగా ముసలి జమీందారు పాత్రలో నటించాడు.
అప్పటినుంచి నిర్మాత హెచ్. ఎం. రెడ్డి వద్ద పని చేస్తున్నారు. వారు తీసే ‘ప్రతిజ్ఞ’ సినిమాకు విలన్‌గా రాజనాలను ఎంపికచేశారు. నెలకు రూ.200/– జీతానికి హెచ్‌ఎం రెడ్డితో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. 1953లో విడుదలైన ఆ సినిమా విజయవంతమై అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. పాతికేళ్ల వయసులోనే ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ఎన్టీఆర్కు మామగా ముసలి జమీందారు పాత్రలో నటించాడు. అప్పటినుంచి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. 1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనే హాలివుడ్‌ సినిమాలో నటించి, హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు. 25 ఏళ్లపాటు విలన్‌గా, హాస్యనటుడుగా తారాజువ్వలా వెలుగొందాడు.కు రాజనాలను మామాజీ అనేవారట.1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనే హాలివుడ్‌ సినిమాలో నటించి, హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు.
25 ఏళ్లపాటు విలన్‌గా, ఒక వెలుగు వెలిగారు.
సరైన ప్లానింగ్ లేకపోవడం,భార్య మరణం,సినిమాల్లో వేషాలు తగ్గిపోవడంతో రాజనాల కృంగిపోయాడంటారు.
హైదరాబాద్ కు మకాం మార్చినా ఫలితం లేకపోయింది.చివరి రోజుల్లో ఈవీవీ సత్యనారాయణ,ఎస్వీ కృష్ణారెడ్డి తమ సినిమాల్లో అవకాశం ఇచ్చారు.రాజనాల డేట్స్ దొరికితే చాలు అనుకునే పారిస్తాయి నుంచి,అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి విషాదకరం.
రాజనాల పరిస్థితి గమనించి సూపర్ స్టార్ కృష్ణ ” తెలుగు వీర లేవరా” లో మంచి పాత్ర ఇచ్చారు.
అదే రాజనాల చివరి చిత్రం.
మధుమేహంతో బాధపడుతుండడం వల్ల, షూటింగ్ సమయంలో గాయపడిన అతని కాలిని తొలగించవలసి వచ్చింది.అనంతరం అతను చెన్నై లో  కూతురు దగ్గరికి వెళ్ళాడు. రాజనాలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ 1998, మే 21న చెన్నైలో మరణించాడు.
విలనిజంలో హీరోయిజం చూపించిన  రాజనాల,
జ్యోతిష్య శాస్త్రం  లో ప్రవేశం ఉన్న గొప్ప నటుడు వ్యక్తి..
తన ప్రతినాయక లక్షణాలతో వెండితెరను సుసంపన్నం చేసిన రాజనాల జీవితంలో విధి విలన్ గా మారింది.

 

NO COMMENTS

LEAVE A REPLY