నేను ఆపిల్ ని …మీ కోసమే ఆ దేవుడునన్ను పుట్టించాడు.ఆపిల్ తో మీ ఆరోగ్యం మరింత శక్తివంతం.

ఆపిల్ చూడ్డానికి ముద్దుగా బొద్దుగా మంచి కలర్ (ఆపిల్ కలర్)లోనే ఉంటుంది..ఆపిల్ తింటే మీకెన్ని లాభాలో…
మీ ఆరోగ్యాన్ని కాపాడమని ఆ దేవుడు నన్ను (ఆపిల్ ని)పుట్టించాడు అంటోంది ఆపిల్.
ఆపిల్ ని నములుతూ ఉంటే మీ దంత సౌందర్యం మరింత పెరుగుతుంది.మీ పళ్ళు శుభ్రమవుతాయి.బాక్టీరియా తొలిగిపోతుంది.
రోజుకో ఆపిల్ తింటే కొలెస్ట్రా‌ల్‌ తగ్గుతుంది
ఆపిల్ లోని పీచు పదార్థం జీర్ణప్రక్రియను చురుగ్గా చేస్తుంది.
ఆపిల్‌ తినడం వల్ల కాలేయానికి మేలు జరుగుతుంది.
మలబద్ధకం, డయేరియా, కడుపునొప్పి వంటి వాటివల్ల ఇర్రిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. వైద్య చికిత్స అనంతరం డాక్టర్ల సలహాతో ఆపిల్‌ తింటే సమస్య కొంత వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడంలో ఆపిల్ ముందుంటుంది.
ఆపిల్‌ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది,
ఆపిల్ ఉంటే డాక్టర్ అవసరం లేదు అన్న నానుడి నిజ్జం.రుచి శక్తి ని అందించే ఆపిల్ ఇప్పుడు చవకగా లభిస్తున్నాయి.ఈ సీజన్లో ఆపిల్ ను సాధ్యమైనంతవరకూ తినండి.మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
చిన్నమాట…
అయిదు నుంచి పదిరూపాయలలోపు ఇప్పుడు దొరికే ఆపిల్ మీకు చేతనైతే పేదవారికి పంచండి,
ఓల్డేజీ హోమ్స్,అనాథశరణాలయాలు సందర్శించి వారికీ ఈ ఆపిల్స్ ఇవ్వండి.వారికి శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చినవారు అవుతారు.
మీ తోటివారికి చెప్పండి.ఈ మంచిపని మీరు చేసినా,మీతోటివారు చేసినా వివరాలు ఫొటోతో సహా మాకు పంపించండి.మేన్ రోబో మీ దాతృత్వాన్ని పాఠకలోకానికి అందిస్తుంది.

ఈ కథనంపై మీ ఫీడ్ బ్యాక్ మాకు పంపించండి.
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY