ఉదయమే మీ బ్రేక్ ఫాస్ట్ ఏమిటి? బర్గర్లు పిజ్జాలు వచ్చేక జంక్ ఫుడ్ మన హెల్త్ తో గేమ్స్ ఆడుకుంటుంది.బ్రేక్ ఫాస్ట్ మెనూ …

బ్రేక్ ఫాస్ట్ మెనూ …
(కిరణ్మయి ,చెన్నై)
ఉదయమే మీ బ్రేక్ ఫాస్ట్ ఏమిటి? బర్గర్లు పిజ్జాలు వచ్చేక జంక్ ఫుడ్ మన హెల్త్ తో గేమ్స్ ఆడుకుంటుంది.
పొద్దున్నే మనకు శక్తిని నోటికి రుచిని ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారా?
మీ కోసం కొన్ని టిఫిన్స్ రెడీ…
చూడగానే మల్లెపువ్వులా మెరిసిపోతూ నోట్లో వేసుకుంటే యిట్టె కరిగిపోతూ వుండే ఆ టిఫిన్ ఏంటో మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది.
ఇడ్లీ
పిల్లలకే కాదు పెద్దలకు మంచి అల్పాహారం,కొబ్బరి చట్నీ.నెయ్యి కారప్పొడి,ఘుమఘుమలాడే సాంబారు …
పిల్లలకు ఎనర్జీ…ఇడ్లీ పిల్లలను చురుగ్గా ఉంచుతుంది.త్వరగా జీర్ణం అవుతుంది.అల్లం చట్నీతో ఇడ్లీలు ఎన్ని తిన్నా అట్టే కరిగిపోతాయి.
వడ…
ప్రోటీన్స్ వున్న అల్పాహారం.మంచి బలం ఇస్తుంది.నోటికి రుచిని కలిగిస్తుంది.వడ,సాంబార్,చట్నీ తో కూడా తినవచ్చు.పెరుగు వడ ను చాలా మంది ఇష్టంగా తింటారు.
పూరి మనకు చాల ఇష్టమైన అల్పాహారం.పూరీ బ్రేక్ ఫాస్ట్ లో మాత్రమే కాదు.బోజనంలో కూడా తీసుకుంటారు.బంగాళా దుంప,పూరీ ఇష్టమైన కాంబినేషన్,లిమిట్ గా తింటే మంచింది.
దోశ
మసాలా/ఆనియన్/ప్లెయిన్ దోశ…ఇలా ఎన్నిరకాల దోషాలు అయినా ఇంట్లో చేసుకోవచ్చు.
పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఎలానూ ఉందనే వుంది.
ఉదయమే బ్రేక్ ఫాస్ట్ లో ఇలాంటి అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
కొద్దిపాటి శ్రమతో వీటిని ఇంట్లోనే చేసుకుంటే డబ్బు ఆదా…ఆరోగ్యం మనతోటే ఉండిపోదా…
*మీరు కూడా ఇలాంటి ఆర్టికల్స్ పంపించవచ్చు,…

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY