“వెల్ కం అగస్త్యా” అన్న పిలుపు వినపడి ఒక్కసారి అదిరిపడ్డాడు అగస్త్య…స్మార్ట్ రైటర్ సురేంద్ర క్షిపణి (25-09-2016)

అగస్త్య కంట్రోల్ తప్పినవాడిలా నడుస్తూ లిఫ్ట్ దిగాడు. పార్టీలో తగిలిన వ్యక్తి అతణ్ణి జాగ్రత్తగా పట్టుకుని తీసుకువస్తున్నాడు.
హిమాంషు తానున్న పిల్లర్ చాటునుండి నేలకు జారాడు. నెమ్మదిగా పాకుకుంటూ టార్గెట్ చేసిన కార్ వెనుక చేరాడు.
ఆలస్యం చెయ్యకుండా తన వద్ద ఉన్న మైక్రో చిప్ ను కార్ వెనుక భాగంలో ఉన్న అద్దానికి అతికించాడు.
మైక్రో చిప్ యాక్సెస్ చెక్ చేస్తున్న ఖలీల్ అంతా ఓకే అన్నట్టు సైగ చేశాడు.
క్షణం ఆలస్యం చేయకుండా హిమాంషు పిల్లర్ వద్ద చేరాడు.
తమ పని అయినట్టుగా కార్ లో బయలుదేరి బయటపడ్డారు.
అగస్త్యను నడిపించుకుంటూ వచ్చిన వ్యక్తి, అతణ్ణి హిమాంషు చిప్ తగిలించిన కార్ లో కూర్చోపెట్టాడు.
కార్ రోడ్ ఎక్కింది.
ఖలీల్ చేతిలో ఉన్న డివైస్ అగస్త్య కార్ లో ప్రతి అంగుళం స్పష్టంగా చూపుతోంది
మైక్రో చిప్ లో స్పై కెమెరా ఉండడం వల్ల ప్రతి కదలిక క్లియర్ గా తెలుస్తోంది.
పైజల్ ఇచ్చిన సమాచారం ప్రకారం కార్ సాదియత్ వైపు కదులుతుందని పసికట్టిన హిమాంషు, తమ కార్ ను సాదియత్ వైపుకు తిప్పాడు
హిమాంషు గెస్ కరెక్ట్ అయ్యింది
సరిగ్గా 15 నిముషాల తరువాత అగస్త్య ఉన్న కార్ సాదియత్ రోడ్ ను తాకింది. ఆ కార్ వెనుక సెక్యూరిటీ అన్నట్టు 5 కార్లు ఎస్కార్ట్ గా దూసుకుపోయాయి
“బ్రో… వాట్ ఇస్ ది ప్లాన్?” అడిగాడు సాహు
హిమాంషు ఏదో చెప్పబోయేంతలో అతని సెల్ మోగింది
నందనవర్మ గారి కాల్
“బాయ్స్… ఏమి చేస్తున్నారు?”
హిమాంషు జరిగిన సంఘటన మొత్తం వివరించాడు
“వాట్ ఇస్ ది నెక్స్ట్ స్టెప్?”
“అదే ఆలోచిస్తున్నాం సర్”
“డూ వన్ థింగ్. సాదియత్ లో మన ఆఫీస్ ఉంది. గో దేర్. నేను వచ్చి కలుస్తాను” ఫోన్ పెట్టేశారు నందనవర్మగారు
హిమాంషుతో పాటు అక్కడ ఉన్నవారికి ఒక్కసారి రిలీఫ్ వచ్చింది
నందనవర్మగారు ప్లానింగ్ లో మాస్టర్ మైండ్
ఆయన ప్లాన్ చేస్తే మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు
పైగా ఆయనే స్వయంగా రంగంలో దిగారంటే మేటర్ చాలా సీరియస్ అండ్ మోస్ట్ క్రిటికల్ అని అర్థం అయ్యింది
45 నిముషాల తరువాత అగస్త్య ఉన్న కార్ సాదియత్ లోని అధునాతన విల్లా ముందు ఆగింది
అగస్త్య మత్తులో ఉన్నట్టు నటిస్తూ విల్లా ఏరియా మొత్తం స్కాన్ చేశాడు
మెషిన్ గన్స్ తో ఎంట్రన్స్ వద్ద అరడజను మంది కాపలా కాస్తున్నారు
ట్రైనింగ్ పొందిన డాగ్స్ క్రూరంగా చూస్తూ ఆ ఏరియా మొత్తం తిరుగుతున్నాయి
అడుగు పెడితే చీల్చి చెండాడే చూపులతో మొత్తం కలయదిరుగుతున్నాయి
అగస్త్యను నెమ్మదిగా దింపాడు ఆ వ్యక్తి
“ఎక్కడ ఉన్నాం బ్రో?” మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తున్నట్టు అడిగాడు అగస్త్య
“రావలసిన చోటుకే వచ్చాం బ్రో. నథింగ్ టు వర్రీ” అంటూ అతణ్ణి లోనికి తీసుకువెళ్ళాడు
ప్రపంచంలోని అతి ఖరీదైన ఫర్నిచర్ తో అద్భుతంగా ఉంది విల్లా
మార్తాండ భూపతి బహూశా ఇక్కడే ఉండొచ్చు అనుకున్నాడు అగస్త్య
“వెల్ కం అగస్త్యా” అన్న పిలుపు వినపడి ఒక్కసారి అదిరిపడ్డాడు అగస్త్య
అగస్త్య ప్రక్కన ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారి తుళ్ళిపడ్డాడు.
(ఈ సస్పెన్స్ వచ్చేవారం వరకూ )
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY