తమ ఉనికి తెలియకుండా అతడిని చంపేసి..కడుపులో బిడ్డతో సహా తన గ్రహానికి వెళ్ళిపోవాలి. అక్కడ ఆమె గర్భంలో ఊపిరిపోసుకున్న … విజయార్కె క్యూ… ఆమె కనబడుటలేదు

చైనా ఈ విషయంలో మొట్టమొదటిసారిగా ముందడుగు వేసింది. ఏలియెన్స్ పై నెలకొన్న సస్పెన్స్ కు తెర దించేందుకు అతి పెద్ద రేడియో టెలిస్కోప్ ను చైనా ప్రారంభించింది.,గ్రహాంతరజీవుల రహస్యాలను ఇది పసి గట్టగలదని శాస్త్రజ్ఞులు అంటున్నారు
ఏలియెన్స్ తో జాగ్రత్త అంటూ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరిస్తున్నారు. మనకన్నా అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన గ్రహాంతర జీవుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారితో సంబంధాలకోసం ప్రయత్నించవద్దని ఆయన సూచిస్తున్నారు.
స్టీఫెన్ హాకింగ్స్ ఫేవరేట్ ప్లేసెస్ పేరిట విడుదల చేసిన ఆన్ లైన్ చిత్రంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. ఈ భూగోళంపై ఆధునిక మానవులు కొలంబస్ నాయకత్వంలో అమెరికా సంతతి ప్రజలను కలిసినప్పుడు ఏర్పడిన పరిస్థితులను ఆయన ఇందుకు ఉదాహరణగా గుర్తు చేశారు.
క్యూ… ఆమె కనబడుటలేదు నవల.(జనవరి 2006 ఫస్ట్ ఎడిషన్ )
———————————————————————-
సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ వీటిని తామింకా కనిపెట్టలేదని క్యూగ్రహం తెలుసుకుంది.ప్రహేళికను సృష్టించింది.ఆమె టార్గెట్ ఆమె టార్గెట్ సైంటిస్ట్ సిద్ధార్థ
అందుకే భూమ్మీదికి వచ్చారు.తమ పరిజ్ఞానంతో ఒక అచ్చమైన స్వచ్ఛమైన భారతీయ అమ్మాయిని సృష్టించారు.గర్భం ధరించే సామర్థ్యాన్ని సృష్టించారు.
అతడిని ప్రేమించి పెళ్ళాడి అతడి ద్వారా గర్భం ధరించి..
తమ ఉనికి తెలియకుండా అతడిని చంపేసి..కడుపులో బిడ్డతో సహా తన గ్రహానికి వెళ్ళిపోవాలి.
అక్కడ ఆమె గర్భంలో ఊపిరిపోసుకున్న మాంసపుముద్దను ఛిద్రం చేసి పరిశోధిస్తారు.
అనుకున్నట్టుగా ఆమె గర్భం దాల్చింది.కానీ చిత్రంగా తన భర్తను చంపకుండానే అదృశ్యమైంది ప్రహేళిక. 
ఆమె తిరిగి తన గ్రహానికి వెళ్లిపోలేదు.
సిద్ధార్థ తన భార్య కోసం అన్వేషణ మొదలుపెట్టాడు
క్యూగ్రహం ప్రహేళిక కోసం వేట మొదలుపెట్టింది.
జర్నిలిస్ట్ వాసంతి ఈ కేసు పరిశోధించడం మొదలుపెట్టింది.
సర్వాంతర్యామి క్యూగ్రహంతో చేతులు కలిపాడు.
భావోద్వేగాలతో ముడిపడ్డ వాణిజ్యసూత్రాల సెల్యూలాయిడ్ మీద ప్రముఖ రచయిత విజయార్కె చేసిన అక్షరాల సంతకం …క్యూ …ఆమె కనబడుటలేదు నవల.

ఈ నవల ప్రివ్యూ మీ కోసం.

http://preview.kinige.com/previews/5400/PreviewQAameKanabadutaLedu25698.pdf

NO COMMENTS

LEAVE A REPLY