మమ్మల్ని ముప్పయేళ్లు వెనక్కి తీసుకువెళ్లారు…అలనాటి మా జ్ఞాపకాలను గుర్తు చేసిన స్మార్ట్ రైటర్ సురేంద్ర గారికి కృతఙ్ఞతలు స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (20-08-2017)

ఫీడ్ బ్యాక్
మమ్మల్ని ముప్పయేళ్లు వెనక్కి తీసుకువెళ్లారు…అలనాటి మా జ్ఞాపకాలను గుర్తు చేసిన స్మార్ట్ రైటర్ సురేంద్ర గారికి కృతఙ్ఞతలు .శాంతిప్రియ (విజయవాడ)
(గత సంచిక తరువాయి)
దానవీర శూర కర్ణ. నీ జీవితంలో మరచిపోలేని సినిమా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. సినిమాను నేను ఎన్నోసార్లు చూసినా, అందులో సీన్స్ గుర్తుపెట్టుకున్నది లేదు. ఏదో చూడడం వదిలేయడం తప్ప మూవీని సీరియస్ గా తీసుకుంది లేదు.
సాయంత్రం 6 గంటలు.
ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉన్నాము. వీసీఆర్ లో కెసెట్ పెట్టి పక్కన్నే ఉన్న సోఫాలో కూర్చున్నాను.
“సినిమా ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యరా” అంటూ ఆంటీ ఆర్డర్ వేసింది.
సినిమా కర్ణుడు జననం నుండి మయసభ సీన్ వరకు వచ్చి ఆగింది.
దుర్యోధనుడు మయసభలో అడుగుపెట్టడం… అక్కడే ఆపమంది ఆంటీ…
పెన్ పేపర్ తీసుకుని రెడీ అయ్యి మూవీని కంటిన్యూ చేయ్యమంది.
“కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తర భ్రమ…” ఎన్టీఆర్ ఏక పాత్రాభినయం అక్కడ నుండి స్టార్ట్ అవుతుందని తెలిసింది. ఒక్కో డైలాగ్ దగ్గర వీసీఆర్ ను ఆపమనడం, ఆంటీ దాన్ని పేపర్ లో రాసుకోవడం… తిరిగి కంటిన్యూ కావడం….
ఆంటీ అర్థగంటలో రెండు పేజీల డైలాగ్స్ రెడీ చేసేసింది…
మరోసారి మయసభ సీన్ మొత్తం రన్ చెయ్యమని డైలాగ్స్ అన్నీ చెక్ చేసుకుని కేసెట్ ఆపమంది.
“ఆంటీ.. మనం కేసెట్ తీసుకున్నందుకు ఎలాగూ వీడియో షాప్ వాడికి ఒక రోజు డబ్బులు ఇవ్వాలి. సినిమా మొత్తం చూసి ఇద్దాం.” నాకు ఒక పక్క సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ ప్రపోజల్ పెట్టాను. అప్పటికే 7 దాటడంతో టీవీలో ఆదివారం సినిమా వేస్తున్నారు.
ఆంటీ నన్ను ఆఫీస్ రూమ్ లో ఉన్న వీసీఆర్ లో మూవీ చూడమని తరిమింది.
అంకుల్ ఆఫీస్ ఇంటి ముందు పోర్షన్ లోనే ఉంది. నేను మరో మాట మాట్లాడకుండా వెళ్లాను. సినిమా మొత్తం చూసి రాత్రి 9:30 కి ఇల్లు చేరాను.
చేతిలో ఉన్న కేసెట్ చూడగానే ఇంట్లోవాళ్ళు సినిమాను పెట్టమని గోల చేశారు.
అప్పటికే ఆంటీ వాళ్ళ ఇంట్లో డిన్నర్ ముగించడంవల్ల నాకు నిద్ర ముంచుకువస్తోంది. ఆంటీ వాళ్ళ ఇంట్లో డిన్నర్ అయ్యింది అని చెప్తే నాకు క్లాస్ పీకడం గ్యారంటీ అని తెలిసి కిక్కురుమనకుండా సినిమా వీసీఆర్ లో పెట్టి కిచెన్ లోకి వెళ్లాను.
అప్పటికే అందరి డిన్నర్ అయ్యి నాకోసం కొంత ఉంచారు. ఆకలి లేకపోయినా ఇక తప్పదు అన్నట్టు మరో రౌండ్ డిన్నర్ చేసి వచ్చి సినిమాలో జాయిన్ అయ్యాను.
నేను ఏకపాత్రాభినయం చేస్తున్నానని ఇంట్లో చెప్పకుండా వారితో పాటు మరోసారి సినిమా చూసి నిద్రకు రెడీ అయ్యాను.
అప్పటికే టైం 12 దాటడం… మరుసటి రోజు స్కూల్ ఉండడంతో బెడ్ పైన పడుకోవడం ఆలస్యం నిద్ర పట్టేసింది

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY