జానపద కథల స్వర్ణయుగం లేదనే ఆలోచనను తరిమేస్తూ ఒకనాటి జానపద నవలల వైభవాన్ని ముందుకు తీసుకువస్తోన్న రచయితల్లో అడపా చిరంజీవి ఒకరు.
పిల్లలను పెద్దలను చదివించే అద్భుతమైన సాహసాల గాథలు ఆయన కలం నుంచి వచ్చాయి.ఇటీవలే కినిగెలో విడుదలైన తాజా పుస్తకం… “దెయ్యాల దిబ్బ వజ్రాల హారం”
విడుదలైన మొదటివారంలోనే టాప్ టెన్ పుస్తకాల సరసన నిలబడింది.జానపద నవలల సత్తా చాటింది.
చిన్నప్పుడు చదివిన అనగనగా కథలు …ఆ కథల్లోని సాహసాలు కత్తియుద్ధాలు మాయలు మంత్రాలూ చదువుతుంటే “పాతాళ భైరవిలో” తోటరాముడిలా సాహసం చేయాలనిపిస్తుంది.అడపా చిరంజీవి “దెయ్యాల దిబ్బ వజ్రాల హారం” నవల చదువుతుంటే సరిగ్గా అలాంటి ఫీలింగే కలుగుతుంది.
ముఖ్యంగా శశికాంతుడి సాహసాలు…మహారాజుతో చెప్పిన మాటలు ఉత్తేజభరితంగా వున్నాయి.మొదటిపేజీ నుంచి చివరిపేజీ వరకూ ఏకబిగిన చదివించే నవల.
నిర్భయంగా విలువైన హారాన్ని దొంగిలించలేదని చెప్పడం…తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం…అడుగడుగునా సాహసం…చదువరులను సమ్మోహనపరుస్తుంది.
టాప్ టెన్ లో నిలిచిన ఈ నవలను “జానపద నవలలను చదివే ప్రతీ ఒక్కరూ “ఇష్టపడుతారు….
మహారాజుకు కథానాయకుడికి మధ్య జరిగిన ఈ సంభాషణ కుతూహలాన్ని,నవల ఏకబిగిన చదవాలన్న తాపత్రయాన్ని కలిగిస్తుంది.
***
“మహారాజా! నా మాట నమ్మండి. ఆ హారం వైనమేమీ నాకు తెలియదు…” సౌమ్యంగా చెప్పాడు, దొంగగా ముద్ర వేయబడి నిండు కొలువుకు రావించబడిన ఆ యువకుడు.
“నీ పేరేమిటి ?”
“శశికాంతుడు ప్రభూ!”
“పేరుకు తగ్గ అందం వున్నది కానీ ఏమి ప్రయోజనం. దొంగతనం నేరం మీద నా ముందు నిలిచావు!” అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా చూస్తూ.
మౌనంగా చూస్తున్న శశికాంతుడు సమాధానం చెప్పలేదు. ఏం జరుగుతుందోనని ఆ విచారణా విధానాన్ని ఆతృతగా చూస్తున్నారు అక్కడ చేరిన ప్రజలు.
“ఉట్టిలోని గుట్టు బట్టబయలైన తర్వాత కూడా నువ్వు మౌనం వహించడంలో అర్థం లేదు.”
శశికాంతుడు సౌమ్యతను వీడలేదు. ” మహారాజా! ఆ హారం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆ పతకాన్ని మీ వేగుల సమక్షంలో చూడటం అదే మొదటిసారి!”
శశికాంతుడు దొంగా? నిర్దోషా?
శశికాంతుడు నిర్దోషి అయితే అసలు దొంగ ఎవరు?
ఈ కథలోని మలుపులు మెరుపులు తెలుసుకోవాలంటే “దెయ్యాల దిబ్బ వజ్రాల హారం” నవల చదవాల్సిందే.
మీ కోసం “దెయ్యాల దిబ్బ వజ్రాల హారం” నవల లింక్…
http://kinige.com/book/Deyyala+Dibba+Vajrala+Haram
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ రివ్యూను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్