క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన ద్వేషకణాలను ఏ కీమో థెరపీ తో తొలగిద్దాం…?ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి అక్షరాలతో నేను (19-11-2017)

ద్వేషాన్ని ద్వేషిద్దాం…ప్రేమను ఆహ్వానిద్దాం 
ద్వేషం అనే పదం పుట్టుపూర్వోత్తరాలు మీకు తెలుసా?ద్వేషమనే కణాలు ఎక్కడ పుడతాయి?ఎప్పుడు  పుడతాయి?ఎవరిలో పుడతాయి? ఎలా పుడతాయి?
క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన ద్వేషకణాలను ఏ కీమో థెరపీతో తొలగిద్దాం…?
ద్వేషాన్ని మన శరీరంలో నుంచి మన ఆలోచనల్లో నుంచి తొలిగించే సర్జరీ టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు కదా ?
కోపం ఆవేశం తొందరపాటు స్వార్థం ఈర్ష అసూయ ద్వేషానికి దగ్గరి చుట్టరికం…
ప్రేమించడానికి వెతకని రీజనింగులు ద్వేషించడానికి మాత్రం వెతుకుతాం…వాటే పీటీ
మిమల్ని మీరు ప్రశ్నించుకుని మీరు ద్వేషించేవారి లిస్ట్ ఒకటి రాసుకుని చూడండి.ఇది సుడోకు  కాదు.పదబంధం కాదు …
కానీ మానవ సంబంధాలను అనుబంధాలను అందమైన బంధాలను ద్వేషమనే ఇనుపబంధనాలతో(గొలుసులతో)  విషాదం అనే కారాగారంలో బంధించే క్రూరనియంత…ద్వే…షం 
అందుకే ద్వేషాన్ని నేను ద్వేషిస్తున్నాను..ద్వేషం అనే పదాన్ని ద్వేషం విషయంలోనే ఉపయోగిస్తున్నాను…
పాలనుంచి నీళ్లను వేరు చేసినట్టు ప్రేమ నుంచి ద్వేషాన్ని వేరుచేయండి.
స్వచ్ఛమైన పాలు నేలపాలు కాకుండా మీ ఇంటిల్లిపాదినీ సంతోషంగా ఉంచుతాయి..ఆరోగ్యంగా ఉంచుతాయి.
ద్వేషభావాన్ని వదిలేయండి..భవబంధాలు బ్రతికి ఉన్నంతవరకే..ప్రేమానుబంధాలు మన తరువాత తరాలు కూడా మన ఆస్తిగా దాచుకుంటారు…పంచుకుంటారు…మానవత్వాన్ని పెంచుకుంటారు.
ఈ కథనాన్ని ప్రేమిస్తే ద్వేషాన్ని ద్వేషిస్తే మీ అభిప్రాయాలను షేర్ చేయండి…హ్యూమానిటీని సేవ్ చేయండి.

అక్షరాలతో ఈ ప్రయాణం కొనసాగుతుంది

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.

గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY