రెండు వారాల్లో మరిన్ని పోటీలు జరిగాయి.జీవితంలో మొదటిసారి చాలా బహుమతులు వచ్చాయి. మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకున్నా.
ఒక ఆదివారం ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉండగా ఆంటీ బాలవికాస్ డేని అనౌన్సు చేశారు.
బాల వికాస్ డే ఒక వారం రోజులే ఉంది. నాకు టెన్షన్ మొదలైంది.
స్టేజ్ పైన చాలా డ్రామాలు వేశాను కానీ ఒంటరిగా యాక్ట్ చేయడం మొదటిసారి.
బాల వికాస్ ప్రోగ్రాం జరిగేది మా స్కూల్ లోనే. పైగా అదే స్టేజ్ పైన నేను ఎన్నో డ్రామాలు వేశాను. కొత్త ప్లేస్ అన్న టెన్షన్ లేదు.
స్కూల్ లో ఒక రోజు క్లాస్ మొత్తం అయ్యాక స్టేజ్ వద్దకు చేరుకున్నాను. అప్పటికే స్టూడెంట్స్ చాలా మంది వెళ్ళిపోయారు. వాన్ కోసం కొంతమంది వెయిటింగ్…
నేను స్టేజ్ ఎక్కి నా డైలాగ్స్ మననం చేసుకుంటూ అటూ ఇటూ నడుస్తున్నాను. ఇంతలో మా క్లాస్ టీచర్ అక్కడకు వచ్చారు. నేను ఆవిడను గమనించలేదు.
నా ప్రవర్తన ఆవిడకు విచిత్రంగా అనిపించింది. కాసేపు అలానే చూసి నన్ను పిలిచారు.
ఏదో లోకంలో ఉన్న నేను ఒక్కసారి ఉలిక్కిపడి చూశాను. స్టేజ్ కింద మా క్లాసు టీచర్ మరికొంత మంది స్టూడెంట్స్ నన్నే చూస్తున్నారు.
ఏమి చెప్పాలో తెలియక నెమ్మదిగా స్టేజ్ దిగి వచ్చాను. కిందకు రాగానే మా క్లాస్ టీచర్ స్టేజ్ పైన ఏమి చేస్తున్నావని అడిగారు.
ఏమీ చెప్పక సైలెంట్ గా ఉన్నాను. అదే ప్రశ్న మరోసారి రెట్టించి అడిగారు.
ఇక చెప్పక తప్పదని డ్రామా గురించి మొత్తం చెప్పాను.
ఆవిడ నమ్మినట్టు కనపడలేదు.మొత్తం యాక్ట్ చేసి చూపించమని అడిగారు.
ఇక తప్పేట్టు లేదు అనుకుంటూ స్టేజ్ పైకి ఎక్కాను.
నన్ను చూసి మరికొంత మంది స్టూడెంట్స్ స్టేజ్ వద్దకు వచ్చారు.
రెండు రోజుల్లో జరగబోయే ప్రోగ్రాంకి ఇది రిహార్సల్ లా ఉపయోగపడుతుందని పైగా ఆడియన్స్ మా స్కూల్ స్టూడెంట్స్ రారు కనుక నా యాక్టింగ్ ఎవరికీ తెలియదు అని అనిపించడంతో ధైర్యంగా స్టార్ట్ చేశాను.
నేను యాక్ట్ చేస్తూ ఆడియన్స్ వైపు ఒక కన్నేసి ఉంచాను.
మా మేడం పేస్ లో చేంజెస్ క్లియర్ గా కనపుడుతున్నాయి. నేనేదో అబద్ధం చెపుతున్నానని దొరికితే పనిష్మెంట్ ఇవ్వచ్చని ఆశ పడ్డ మా మేడం పేస్ లో నాకు నిరాశ కనిపించింది.
ఆవిడ నా యాక్టింగ్ చూడ్డం లేదని నా డైలాగ్స్ ను పట్టించుకోలేదని అర్థం అయ్యింది.
స్టూడెంట్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు.
కాసేపటి తరువాత యాక్టింగ్ కంప్లీట్ కావడంతో, నా డ్రామాను చూస్తున్న స్టూడెంట్స్ హ్యాపీగా చప్పట్లు కొట్టారు.
అందరూ హ్యాపీగా ఫీల్ అవడంతో మేడం ఏమీ అనలేక త్వరగా ఇంటికి వెళ్ళండి అంటూ తానూ వెళ్ళిపోయారు.
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్