అక్షరయాన్ ,ప్రపంచ వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ

హైదరాబాద్
అక్షరయాన్ ఆధ్వర్యంలో శతక షోడసి అని 16 మంది రచయితలు రాసిన శతకాలు కలిపి ఒక పుస్తకంగా చేసి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , వ్యవసాయ శాఖ, సహకార, ఆహార , పౌరసరఫరాల శాఖ మంత్రి  తెలంగాణ బిసి కమీషనర్ కార్యాలయం లో ఆవిష్కరించారు.
బుర్రా వెంకటేశం బిసి కమీషన్ కార్యదర్శి,  వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణ రాష్ట్ర బిసి కమీషన్ చైర్మన్ , ఇతర సభ్యులు,  అక్షరయాన్  అధ్యక్షురాలు శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, అక్షరయాన్ రచయిత్రులు , నాళేశ్వరం శంకరం  తెలుగు భాషోపాధ్యాయుల సమక్షంలో పుస్తకావిష్కరణ చాలా కన్నుల పండుగగా జరిగింది
కార్యక్రమానికి ముందు తెలుగు బోధించే ఉపాధ్యాయులను సమావేశపరిచి తెలుగును ఆసక్తి కరంగా నేర్పించేందుకు ఏమేం చేయాలి అని కొందరు రచయితలతో ఉపాధ్యాయులతో  బుర్రా వెంకటేశం గారు చర్చించారు. త్వరలో ప్రతి తెలుగు వారు తెలుగులో రాయడం , చదవడం నేర్చుకునే దిశలో కార్యాచరణ ఉండాలన్నారు. ఛందస్సుతో సంబంధం లేకుండా భావవ్యక్తీకరణకు ప్రాధాన్యత నిచ్చి సరళ శతకాలను సూక్ష్మ కావ్యాలను రాయించాలన్నారు..
శతక షోడసి లో రచనలు చేసిన ములుగు లక్ష్మీ మైథిలి, డా.కోడూరు సుమన కేతవరపు రాజేశ్వరి , తదితరులను .మంత్రి నిరంజన్ రెడ్డి ,,ఐ.ఎ.యస్ అధికారి బి.సి.సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి   బుర్ర వెంకటేశం బి.సి.కమీషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్  సత్కరించారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY